శివ కార్తికేయన్ ఆంటే తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఏర్పడింది “రెమో” చిత్రంతో. కానీ డాక్టర్ మూవీ తో ఆయన దశ తిరిగింది తెలుగు సీమలో. ఆయన ప్రతీ తమిళ చిత్రం తెలుగులో కూడా విడుదల అవ్వటం మొదలు అయ్యాయి. కానీ ఆ ఆనవాయితీకి ఈ సంవత్సరం బ్రేక్ పడింది. ఆర్ . రవికుమార్ దర్శకత్వంలో సంక్రాంతికి అయలాన్ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రం విడుదల అయ్యింది. ప్లాన్ ప్రకారం ఇది తమిళ్ ఇంకా తెలుగు లో జనవరి 12న విడుదల అవ్వాలి. కానీ తెలుగు నుంచి 4 చిత్రాలు విడుదల అవ్వటంతో ఈ చిత్రాన్ని జనవరి 26 కి పోస్టుపోన్ చేసారు తెలుగు వెర్షన్ వరుకు. కానీ శివ కార్తికేయన్ మీద ఉన్న ప్రేమతో తెలుగు ప్రేక్షకులు ఆన్లైన్ లో, థియేటర్ లో తమిళ్ వెర్షన్ చూసేసారు. బాగా నచ్చేసింది కూడాను. ఏమయ్యిందో తేలేదు కానీ తెలుగు వెర్షన్ మాత్రం థియేటర్ విడుదలకి నోచుకోలేదు. చివరికి OTT కి వచ్చేస్తుంది అని చెప్పారు. చెప్పి కూడా రెండు నెలలు అయ్యింది కానీ విడుదల కాలేదు. ఇది శివ కార్తికేయన్ తెలుగు అభిమానులకి చేదు అనుభవమే మిగిల్చింది. కానీ ఇప్పుడు అధికారికంగా ఒక వార్త చిత్ర బృందం నుంచి వచ్చింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సన్ నెట్వర్క్ OTT ప్లేట్ ఫార్మ్ లో ఏప్రిల్ 19నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ చిత్రంలో శివ గారి సరసన రకుల్ ప్రీత్ నటించారు. రెహమాన్ సంగీతం అందించారు. తమిళ్ లో ఒక మోస్తరు విజయం అందుకున్నది ఈ చిత్రం. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి నచ్చే అవకాశం చాలానే ఉంది మరి. వేచి చూడాలి, ఇప్పటికైనా విడుదల అవుతుందో లేదో.