- Advertisement -spot_img
HomeMovies8 సంవత్సరాలకి ప్రాజెక్ట్ - z విడుదల: సందీప్ కిషన్, లావణ్య సైన్స్ ఫిక్షన్ చిత్రం...

8 సంవత్సరాలకి ప్రాజెక్ట్ – z విడుదల: సందీప్ కిషన్, లావణ్య సైన్స్ ఫిక్షన్ చిత్రం – FilmCombat

- Advertisement -spot_img

స్టూడియో గ్రీన్ సంస్థ 2017లో సందీప్ కిషన్, లావణ్య జంటగా ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం విడుదల చేసారు. సి.వి. కుమార్ కథను అందించి దర్శకత్వం వహించారు. తమిళంలో “మాయవన్” అనే పేరుతో విడుదల అయిన ఈ చిత్రం తెలుగులో “ప్రాజెక్ట్ – z” అనే పేరుతో విడుదల చేద్దామని సంగం సిద్ధం చేసారు. కానీ తమిళ్ వెర్షన్ విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించింది. కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం అంతగా రాబట్టలేకపోయినా , సందీప్ కిషన్ సినీ జీవితంలో ఈ చిత్రం ఒక మైలురాయి. ఇప్పటివరకు ఎవ్వరు చూడని ఒక వింత కాన్సెప్ట్ తో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. యూట్యూబ్ లో చివరి 20 నిముషాలు కట్ చేసి ఎవరో అప్లోడ్ చేసారు తమిళ్ వెర్షన్ ని, తరువాత తొలగించబడింది. కానీ ఇన్నాళ్ళకి ఆ చిత్రానికి తెలుగు వెర్షన్ విడుదలకి మోక్షం లభించింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల అయ్యింది. లెక్క ప్రకారం ఇది రీ – రిలీజ్ అనుకుంటారు. కాకపోతే తెలుగు వెర్షన్ కి ఇది మొదటి రిలీజ్. ప్రొమోషన్స్ పెద్దగా చేయకపోవటం వలన ఈ చిత్రానికి కొంత తక్కువ షోస్ ఇచ్చారు. ప్రమోట్ చేసి ఉంటే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మంచి కలెక్షన్స్ గణించేది ఈ చిత్రం. ఇప్పుడు విడుదల అయిన అయిన షోస్ కూడా మంచిగా బుక్ అవుతున్నాయి. అదే కొంచం సంతోషం కలిగించే విషయం. మొత్తానికి ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం రావాల్సిన చిత్రం ఇప్పుడు వచ్చింది. OTT తమిళ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. తెలుగు మాత్రం కొన్ని రోజుల తరువాత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page