గత వారం రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ డే-1 నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి బాక్సాఫీస్ దగ్గర భీబత్సమైన జాతర చేసింది. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి నిర్మాత నాగ వంశీకి కలెక్షన్స్ కనక వర్షం కురిపించింది. అటు యూ.స్ మార్కెట్ లోను ఈ సినిమా పండగ చేసుకుంటోంది. 2మిలియన్స్ క్లబ్ లో చేరిపోయి అరుదయిన రికార్డు సృష్టించింది. టయర్-2 హీరోస్ లో ఈ ఫీట్ సాధించిన హీరోస్ లిస్టులో తాజాగా సిద్దు జొన్నలగడ్డ కూడా చేరిపోయాడు. ఫస్ట్ వీకెండ్ కుమ్మేసిన టిల్లు స్క్వేర్. సెకండ్ వీకెండ్ లో కూడా తన హవా కొనసాగిస్తూనే ఉంది. వీక్-2 లో ఒకవైపు “ది ఫ్యామిలీ స్టార్” ఉన్నపటికీ మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇంకా “గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్” తెలుగులో రన్ దాదాపు ముగిసినట్టే. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లే రాబట్టిన ఈ హాలీవుడ్ చిత్రం. సెకండ్ వీకెండ్ వచ్చేసరికి తెలుగులో మరికొన్ని సినిమాల రాకతో థియేటర్స్ కౌంట్ తగ్గిపోయింది. ఇంక ఈ వారమే రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ కి ఫస్ట్ డే నే దారుణమైన ఓపెనింగ్స్ నమోదయ్యాయి. టోటల్ 37 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకొని 38కోట్ల బ్రేక్-ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఫ్యామిలీ స్టార్, ఫస్ట్ డే నే మిక్స్డ్ టాక్ తో కేవలం 6కోట్ల షేర్ మాత్రమే వసూల్ చేసి ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేసింది. విజయ్ కెరీర్లో ఇంత దారుణమైన బుకింగ్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు రాలేదు. ఐతే వీకెండ్ కావడంతో ఈ వీకెండ్ వరకు ఎలాంటి డోకా లేదు. కానీ ఒకవైపు టిల్లు స్క్వేర్, మంజుమ్మెల్ బాయ్స్ చిత్రాల నుండి గట్టి పోటీ ఎదురవుతుండడంతో, ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.