- Advertisement -spot_img
HomeMoviesఅల్లు వారి అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు! - FilmCombat

అల్లు వారి అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు! – FilmCombat

- Advertisement -spot_img

అల్లు అర్జున్ అని పేరు చెప్తే చాలా మందికి గుర్తొచ్చే అంశం బంగారు పంజరంలో పుట్టాడని. తాత అల్లు రామలింగయ్య పెద్ద కమెడియన్. తండ్రి అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసర్. ఇంక మేనమామ చిరంజీవి ఐతే మెగాస్టార్. ఇంత పెద్ద ఫ్యామిలీ బాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ సునాయాసంగా హీరో అయ్యాడు అనుకుంటారు చాలా మంది. ఇవన్నీ అల్లుఅర్జున్ కేవలం హీరో అవ్వడానికి మాత్రమే ఉపయోగ పడ్డాయి తప్ప అతన్ని స్టార్ చేయడానికి ఐతే మాత్రం కాదు. ఈరోజు అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉన్నదంటే మాత్రం కేవలం అతని కృషి, పట్టదల. ఎందుకంటే అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి రిలీజ్ అయ్యినప్పుడు, అతన్ని చాలామంది విమర్శించారు. ఆ సినిమాలో అతని లుక్స్ కి గాను ఇతను హీరో ఏంటి అంటూ చాలామంది హేళన చేసారు. హీరో మెటీరియల్ కాదు అంటూ చులకనగా చుశారు. పైగా గంగోత్రి సినిమాలో అతని నటన కూడా అంతంత మాత్రమే ఉండడంతో విమర్శకులని ఆపడం ఎవరి తరం కాకుండా పోయింది. అలాంటి వారందరికీ ఆర్య సినిమాతో సమాధానం చెప్పాడు. గంగోత్రి సినిమా చూసి ఎవరైతే అల్లుఅర్జున్ కి నటన రాదు అని విమర్శించారో, ఆర్య సినిమాతో వాళ్ళందరిని తన నటనతో మెస్మరైజ్ చేసాడు. ఇంక దేశముదురు సినిమాతో ఎవరైతే అల్లుఅర్జున్ లుక్స్ ని చూసి హీరో మెటీరియల్ కాదని విమర్శించరో సిక్స్ ప్యాక్ చేసి చూపించి ఔరా అనిపించాడు. అప్పటికే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి వారు సిక్స్- ప్యాక్ లుక్స్ దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్న టైంలో, సౌత్ నుంచి అల్లుఅర్జున్ మాత్రమే చేసి చూపించి మేము కూడా ఏ మాత్రం తక్కువ కాదు అనిపించుకున్నాడు. నిజానికి దేశముదురు సినిమా నుంచే అల్లుఅర్జున్ కి కేరళ మార్కెట్ ఏర్పడింది.

పరుగు, ఆర్య-2 చిత్రాలతో అది మరింత ముందుకి వెళ్ళింది. ఎంతలా అంటే కేరళ స్టార్ హీరోస్ సినిమాలతో పోటీగా అల్లుఅర్జున్ సినిమాలు వసూళ్లు సాధించేవి. 2010లో క్రిష్ డైరెక్షన్లో వచ్చిన “వేదం” సినిమాతో అల్లుఅర్జున్ నటుడిగా మరోమెట్టు పైకెక్కాడు. ఎందుకంటే అప్పటివరకు అల్లుఅర్జున్ అంటే కేవలం ఒక లవర్ బాయ్ గా లేదంటే ఫ్యామిలీ హీరోగానే చూస్తున్న ఆడియన్స్ కి “వేదం” సినిమాలో కేబుల్ రాజుగా చుసిన తర్వాత లేదు అల్లుఅర్జున్ లో మంచి నటుడున్నాడన్న ప్రేక్షకులకి విషయం అర్దమైయింది. ఆ తర్వాత అప్పుడే మగధీర సినిమా తీసి మంచి ఊపు మీదున్న రామ్ చరణ్. తానూ కూడా అలాంటి సినిమా తీయాలన్న ఉద్దేశంతో వి.వి. వినాయక్ తో బద్రీనాథ్ తీసి చేతులు కాల్చుకున్నారు. ఈ సినిమాలో అల్లుఅర్జున్ నటుడిగాను, లుక్స్ విషయంలోనూ ప్రతి విషయంలోనూ దారుణంగా విఫలమైయ్యాడు. ఇంక తర్వాత జనం తనని ఈ టైపు రోల్స్ లో యాక్సెప్ట్ చెయ్యరు అన్న విషయం అర్ధం చేసుకొని, త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి లాంటి మాస్+ కామెడీ ఎంటర్టైనర్ తీసి మెప్పించగలిగారు. ఈ సినిమా అప్పటివరకు ఉన్న అల్లుఅర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వగా త్రివిక్రమ్ కి మాత్రం కొంచం ఊరట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తీసిన ఇద్దరమ్మాయిలతో అనుకున్నంత విజయం సాధించక పోయినప్పటికీ డాన్స్ విషయంలో మాత్రం అల్లు అర్జున్ రఫ్ఫాడించాడు. నిజానికి ఈ సినిమాతో అల్లుఅర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న పేరొచ్చింది.

ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అల్లుఅర్జున్ కి సినిమాలైతే ఆడుతున్నాయి గాని తాను కోరుకున్న విజయం ఐతే రావట్లేదు అని బాధ పడుతున్న అల్లు అర్జున్ కి, అప్పుడు వచ్చింది “రేసుగుర్రం” సినిమా. అల్లుఅర్జున్ కి తను కోరుకున్న విజయం ఇవ్వడమే కాకుండా. ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ డాన్సులకి డాన్సులు, ఫైట్స్ కి ఫైట్స్, కామెడీ కి కామెడీ ఇలా ప్రతి విషయంలోనూ అల్లుఅర్జున్ కుమ్మి కుమ్మి వదిలేసాడు. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీ తో మళ్ళీ త్రివిక్రంతోని s/o సత్యమూర్తి అనే సినిమా చేసాడు. ఐతే రేస్ గుర్రంలో ఎంత ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఈ సినిమాలో అంత సాఫ్ట్ గా కనిపించాడు. కలెక్షన్స్ కూడా అంతే వచ్చాయి. ఓవరాల్ గా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో ఆడియన్స్ తన నుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తున్నారో అర్ధం చేసుకున్న అల్లుఅర్జున్. వెంటనే బోయపాటి శ్రీను తో “సరైనోడు” సినిమా చేసాడు. 1st టైం ఊర మాస్ క్యారెక్టర్లో రెచ్చిపోయాడు అల్లుఅర్జున్. బోయపాటి మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్ పాటు అల్లుఅర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసాయి. ఐతే ఈ సినిమాతో నే ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే అల్లుఅర్జున్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో వివాదంలోకి దిగాడు. ఇది ఎంత పెద్ద వివాదం అంటే. పవర్ స్టార్ ఫాన్స్ దెబ్బకు అల్లుఅర్జున్ తర్వాత రెండు సినిమాలు దారుణంగా దెబ్బతిన్నాయి అనడంలో ఎలాంటి అతిశేయోక్తి లేదు. ముఖ్యంగా d.j సినిమా కి ఐతే టీజర్ రిలీజ్ అయ్యిన వెంటనే 1మిలియన్+ దిస్లైక్స్ వచ్చాయి. ఇండియాలో ఏ సినిమాకి ఇన్ని దిస్లైక్స్ రాలేదు. ఆ చెత్త రికార్డు కూడా అల్లుఅర్జున్ పేరిట ఉంది. దానికి తోడు d.j , నా పేరు సూర్య వంటి చిత్రాలు ఘోర పరాజయం పాలవ్వడంతో, అల్లు అర్జున్ మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఈ దెబ్బ తో రెండేళ్లు ఖాళీగా ఉన్న అల్లుఅర్జున్. ఏ నక్క తోక తొక్కడో గాని అల వైకుంఠపురంలో సినిమలోని పాటలకి గ్లోబల్ రీచ్ వచ్చింది.

ఈ సినిమా లో అల్లు అర్జున్ డాన్స్ కి భారత్ దేశం మొత్తం సలాం కొట్టింది. అయితే ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది మాత్రం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. లాక్ డౌన్ సమయంలో తన భార్య బిడ్డలతో సరదాగా ఈ సినిమా పాటలకు స్టెప్స్ వేసి అందరిని ఆకట్టుకున్నారు. స్వయంగా చిత్ర యూనిట్ డేవిడ్ వార్నర్ కు థాంక్స్ చెప్పారు అంటే అర్ధం చేసుకోవచ్చు. అతను ఈ సినిమాకి ఎంత మేలు చేసాడో చెప్పడానికి. ఒక్కసారి తగిలితే లాటరి అంటాం. అలాంటిది రెండోసారి కూడా ఇంకా గట్టిగ తగిలితే దాన్ని ఏం అనాలి. అల్లుఅర్జున్ కి పుష్ప విషయంలో సరిగ్గా అదే జరిగింది. అలా వైకుంఠపురంలో సినిమాకి డేవిడ్ వార్నర్ గ్లోబల్ రీచ్ తెచ్చి పెడితే. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ నే గ్లోబల్ రీచ్ తెచ్చిపెట్టాడు. ఎంతలా అంటే భారత దేశంలోని పెద్ద సెలెబ్రెటీస్, క్రికెటర్స్, పొలిటిషన్స్, బిజినెస్ మెన్స్ తో పాటు పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, నైజీరియా, చైనా జపాన్, అమెరికా. ఇలా ప్రపంచం మొత్తం పుష్ప సినిమా తరువాత అల్లుఅర్జున్ నామస్మరణం చేశారు. అసలు అల్లు అర్జున్ సైతం ఊహించి ఉండడు తనకి ఈ స్థాయి రేంజ్ వస్తుందని. ఇప్పుడు అల్లుఅర్జున్ అంటే ప్రపంచం మొత్తం తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా వీడు హీరో ఏంట్రా అనే స్థాయి నుంచి వీడు రా హీరో అనే స్థాయికి ఎదిగిన తీరు చుస్తే అద్భుతం. అల్లు అర్జున్ తనని తను చెక్కుకున్న శిల్పి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం పుష్ప-2 చేస్తున్న అల్లుఅర్జున్ ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఇట్లు ,
ఎం.నవీన్
FilmCombat

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page