హీరో నవదీప్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. తమిళ ప్రెకషకులకి కూడా పరిచయం ఉన్న వ్యక్తి. వరుసగా అద్భుతమైన చిత్రాలు అందించిన ఆయన గత కొంత కాలంగా విరామం తీసుకుని, మధ్య మధ్యలో కొన్ని చిత్రాలలో ఇంపార్టెంట్ రోల్స్ లో నటించి మెప్పిస్తూ ఉన్నారు. హీరోగా గ్యాప్ ఇచ్చినా ఏదొక విధంగా ప్రేక్షకులకి దెగ్గరగానే ఉన్న నవదీప్ ఇప్పుడు “లవ్ మౌళి” అనే ఒక ప్రేమ కావ్యంతో మన ముందుకు హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి చిత్రం మీద మంచి ఒపీనియన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ట్రైలర్ రివ్యూ, ఇంకా కొన్ని విశేషాలు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం.
మౌళి అనే ఒక కళాకారుడు, తను అనుకున్న జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉంటాడు. తను అందరిలాగా కాకుండా చాలా విభిన్నంగా ఉండే వ్యక్తి. తనకి ప్రియురాలిగా వచ్చే అమ్మాయిలో కొన్ని లక్షణాలు ఉండాలని చెబుతూ ఉంటాడు. అలాంటి అమ్మాయి దొరుకుతుంది అనే నమ్మకంతోనే ఉంటాడు. అనుకోకుండా తనకి వచ్చిన ఆర్ట్ ద్వారా తన కలల రాకుమారిని చిత్రీకరిస్తారు. అనుకోని సంఘటల నడుమ ఆ చిత్రం ప్రాణం పోసుకుంటుంది. అలా వచ్చిన ఆ మగువతో జరిగిన సంఘటనలే ఈ చిత్రం. నవదీప్ సరసన పంఖురి గిద్వాని నటించారు. ఆవిడ 2016 మిస్ గ్రాండ్ ఇండియా విజేత. ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు, గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ చిత్రంలో నవదీప్ వేషధారణ, మాట్లాడే తీరు కూడా కొత్తగా ఉంటాయి. ఎగ్గ్రసివ్ ఆటిట్యూడ్ బాగా చూపించారు.
ట్రైలర్ లోనే మొత్తం చిత్రానికి సంబందించిన అంశాలన్నీ చెప్పేసారు. అలా చెప్పటానికి కారణం కూడా నవదీప్, ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తావించారు. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, చాలా వ్యవధిలో పాటలని, టీజర్ ని విడుదల చేసుకుంటూ వచ్చారు. ఈ చిత్రానికి సంబందించిన లుక్స్ ఇంకా పోస్టర్స్ కూడా అడపా దడపా విడుదల చేస్తూ ఉన్నారు. కానీ ఇలాగ గ్యాప్ ఇచ్చి చెయ్యటం వలన చిత్రం మీద ఇంట్రస్ట్ కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇంత టైం పట్టటానికి కారణం ప్రేక్షకులకి తెలిస్తే, సినిమా మీద ఉండే ఒపీనియన్ మారుతుంది. చిత్రం మీద ఇంటరెస్ట్ మొదలవుతుంది. వాళ్ళు ప్రాణం పెట్టి రాసుకుని చిత్రికరించిన ఈ చిత్రాన్ని ప్రజలలోకి మంచి ఉద్దేశంతో తీసుకువెళ్లాలని ఉద్దేశంతో ఇలా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం తెరకెక్కించిన లొకేషన్స్, పడిన శ్రమ , కష్టం అన్నీ కూడాను ఆ ట్రైలర్ కట్ లోనే తెలుస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు అయితే ఇప్పట్లో తెలుగు తెరమీద చుడమేమో అనిపించేలా ఉన్నాయి. ఇది కచ్చితంగా నవదీప్ కి మంచి కమ్ బ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని నవదీప్ తన సొంత సంస్థ అయిన Cspace ద్వారా నిర్మించారు. ఆయనతో నైర సంస్థ, శ్రీకరా స్టూడియోస్ కూడా నిర్మాణ భాద్యతలు చేపట్టాయి. మొత్తానికి ఒక విభిన్నమైన ప్రేమ కావ్యం, ఎన్నో భావోద్వేగాలతో అల్లుకుని ఉన్నది. ఆ విషయం ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు చిత్ర బృందం. వాళ్ళ ధైర్యానికి సలాం కొడుతూ, ఈ చిత్రం విడుదల అయ్యి మంచిగా నవదీప్ కి గుర్తిండిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఈ చిత్రం ఏప్రిల్ 19వ తేదీన విడుదల అవ్వబోతోంది.