క్రికెట్, సినిమా ఈ రెండు కూడా ప్రజలని తమవైపు ఆకట్టుకుని, కొద్దిసేపు ఎలాంటి చింతా లేకుండా ఎంజాయ్ చేసేలాగా చేస్తాయి. అలాంటిది మొదటిసారి ఈ రెండూ కలిస్తే, ఊహకి కూడా అందదు ఈ కాంబినేషన్. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ కి తెలుగు సినిమాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక రకంగా అల్లు అర్జున్ చిత్రం పుష్ప ఇంత ప్రాధాన్యత, ఇంతటి ఆదరణ పొందింది అంటే సగం కారణం వార్నర్ తన కుటుంబంతో చేసిన డాన్స్ రీల్స్. ఇప్పటికి కూడా ఇండియా తో మ్యాచ్ ఆడుతుంటే పుష్ప డాన్స్ స్టెప్స్, యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాడు. మనవాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా వార్నర్ ని తెలుగు వాడిగా అయిపొమ్మని, ఇండియా వచ్చేసి ఆధార్ కార్డు తీసుకోమని, సినిమాలలో నటించమని కోరతారు. ఇదిలా ఉంటే తెలుగు చిత్ర సీమని ప్రపంచం మొత్తం గొప్పగా మెచ్చుకునే విధంగా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ కి రెండు ఆస్కార్ బహుమతులు కూడా వచ్చాయి.
ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే, క్రెడ్ అనే క్రెడిట్ కార్డు కంపెనీ ప్రచార వీడియో కి వీళ్ళు ఇద్దరూ కలిశారు. రాజమౌళి క్రికెట్ మ్యాచ్ టికెట్స్ కోసం వార్నర్ కి ఫోన్ చేస్తే, డిస్కౌంట్ అడగగా, ఇప్పించినందుకు తనతో సినిమా తియ్యాలని వార్నర్ కోరతాడు. మగధీర, బాహుబలి లాంటి కొన్ని సన్నివేశాలని వార్నర్ తో చిత్రీకరించినట్టు చూపించారు ఈ ప్రచార వీడియోలో. పేరుకి ఆస్ట్రేలియా వాడు అయినప్పటికీ తెలుగు చిత్రాలు అన్నా , తెలుగువాళ్ళన్నా వార్నర్ కి చాలా అభిమానం. ఇండియా ని తన రెండో ఇళ్లు అని కూడా చెబుతాడు. ఎప్పటికైనా వార్నర్ ఒక తెలుగు చిత్రంలో నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటిది మన తెలుగు వాళ్ళ అభిమానం. IPL లో తెలుగు జట్టు అయిన SRH కి వార్నర్ కొన్ని సంవత్సరాలు నాయకత్వం వహించాడు. కొన్ని అనుకోని కారణాల వలన గత ఏడాది ఈ జట్టుని వదిలేసి డిల్లీ జట్టులో చేరాడు. అయినప్పటికీ తెలుగు వాళ్లంటే అభిమానం చూపించటంలో ఎప్పుడు ముందు ఉంటాడు వార్నర్. ఇప్పుడు రాజమౌళి , వార్నర్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.