- Advertisement -spot_img
HomeMoviesపండుగాడి ఊచకోతకి 18ఏళ్ళు! - FilmCombat

పండుగాడి ఊచకోతకి 18ఏళ్ళు! – FilmCombat

- Advertisement -spot_img

“ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు”, “ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ బులెట్ దిగిందా లేదా”, “ఒక్కసారి కమిట్ ఐతే నా మాట నేనే వినను” ఈ డైలాగ్స్ వింటే చాలు ఎక్కడ లేని పూనకాలొస్తాయి, అసలు విజిల్స్ వేయడం రానోడికి కూడా విజిల్స్ నేర్చుకొని మరి వేయాలనిపిస్తుంది, చొక్కాలు చింపుకోవాలనిపిస్తుంది. ఇదంతా ఒక 18ఏళ్ళ క్రితం రిలీజైనా ఒక సినిమా తాలూక వ్యవహారం. “ఖలేజా” సినిమాలో రావు రమేష్ అన్నట్లు అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అనే డైలాగ్ “పోకిరి” సినిమా విషయంలో నిజమైయింది. సరిగ్గా 18ఏళ్ళ క్రిత్రం “పోకిరి” అనే ఒక అద్భుతం జరిగింది. సినిమా రిలీజ్ ముందు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. పైగా సెన్సార్ రిపోర్ట్ కి పంపితే వాళ్ళ నుంచి మిక్స్డ్ రివ్యూ, సినిమా ఆడడు అని భయపెట్టారు. దీనితో ఒక్కసారిగా చిత్రయూనిట్లో టెన్షన్ మొదలైయింది. మహేష్ బాబు, పూరి జగన్నాధ్ లకైతే అసలు ఏం చెయ్యాలో కూడా తెలియని సిట్యుయేషన్ కి వెళ్లిపోయారు. ఏడైతే ఏదైయింది అని ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. ఆ ధైర్యంతో నే ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేశారు. రిలీజైన ఫస్ట్ డే 1st షో నుంచే సెన్సార్ వాళ్ళు చెప్పినట్లు ప్లాప్ టాక్ బయటికొచ్చింది. మహేష్ బాబు, పూరి జగన్నాధ్ రెడీ అయిపోయారు భారీ పరాజయాన్ని పేస్ చేయడానికి. పూరి జగన్నాథ్ అయితే మహేష్ బాబుకి కాల్ చేసి మరి సారీ చెప్పాడు. అలా ఆరోజు అయిపోయింది. మరుసటి రోజు దర్శకుడు పూరి జగన్నాధ్ కి ఆంధ్రలోని చాలా ఏరియాల నుంచి డిస్టిబ్యూటర్స్ ఫోన్ చేశారు. లాస్ రికవరీ కి ఫోన్ చేస్తున్నారేమో అని పూరి భయం భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసాడు.

సినిమా బ్లాక్బస్టర్ అన్ని ఏరియాస్ లో హౌస్ ఫుల్ అన్నారు. పూరి ఒక్కసారిగా షాకైయ్యాడు. తన స్నేహితులు ఎవరో ఫోన్ చేసి సరదాగా ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నాడు. వాళ్ళు ఎంత చెప్పిన పూరి నమ్మలేదు ఎందుకైనా మంచింది అని భావించి మహేష్ బాబుని తీసుకొని ఒకసారి సుదర్శన్ 35mm కి వెళ్లారు. అక్కడ రెస్పాన్స్ చూసి పూరి, మహేష్ మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగానే అక్కడ జనం టికెట్స్ కోసం తన్నుకుంటున్నారు, లోపల అరిసి గోల చేసిన శబ్దాలు బయటికి వినిపిస్తున్నాయి. సరే అని చెప్పి మిగితా థియేటర్స్ కి వెళ్లి చూసారు అక్కడ సుదర్శన్ 35mm దగ్గరికంటే ఇంకా భయంకరంగా ఉంది సిట్యుయేషన్. క్రౌడ్ ని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేస్తున్నారు. మహేష్ బాబు, పూరి జగన్నాధ్ లా ఆనదండానికి అవధులు లేకుండా పోయాయి. సర్లే ఏదో హిట్ అయిందిలే అనుకున్నారు ఇద్దరు. కానీ రోజు రోజుకి సినిమాకి వస్తున్నా కలెక్షన్స్ చూసి చిత్రయూనిట్ కే దిమ్మ తిరిగి బొమ్మకనిపిస్తుంది. 15కోట్లు అమ్మితే 20కోట్లు వస్తుంది అనుకున్నారు. కానీ 25 కోట్లని దాటేసి అప్పటి ఇండస్ట్రీ హిట్ “ఇంద్ర” ని దాటేసి టాలీవుడ్ ని షేక్ చేసింది. సరే ఫైనల్ రన్లో 30కోట్ల దగ్గర ఆగుతుంది అనుకుంటే, ఏకంగా 40కోట్ల షేర్ మార్కుని టచ్ చేసి పెద్ద సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో 1st 40కోట్ల షేర్ మార్క్ ని , 75కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసిన చిత్రం పోకిరి. అసలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే గుంటూరులోని ఓ థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుల వెహికల్స్ పార్కింగ్ ఫీజు తో వచ్చిన డబ్బులతో ఓ వ్యక్తి తన కూతురి పెళ్లి చేసాడంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద ఘన విజయమో. అప్పటివరకు మహేష్ బాబు అంటే ఒక మిల్క్ బాయ్, ఫ్యామిలీ హీరో మాస్ చిత్రాలకి పనికి రాదు అని అనుకున్న వాళ్లందరికి ఈ సినిమా చూపించు ముక్కున వేలేసుకునేలా చేశాడు మహేష్ బాబు. పండుగాడిగా మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, డైలాగ్స్, కుర్రకారుని ఉర్రుతలూగించే సాంగ్స్, ఇలియానా గ్లామర్ ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఇవన్నీ కలిసి ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. 2006 ఏప్రిల్ 28న రిలీజైన ఈ చిత్రం 200సెంటర్స్ లో 100డేస్, 63 సెంటర్స్ లో 175 డేస్, 15 సెంటర్స్ లో 200డేస్, 3 సెంటర్స్ లో 365 డేస్, కర్నూల్ లోని ఒక థియేటర్లో 500డేస్ ఆడి తెలుగులో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల లిస్ట్ లో చేరిపోయింది. పోకిరి సినిమాని తమిళంలో విజయ్ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్. కన్నడలో పోర్కి దర్శన్ రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్బస్టర్, హిందీలో వాంటెడ్ పేరుతో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా అక్కడ ఇంకో పెద్ద హిట్. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా సరిగ్గా ఈరోజుతో 18సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవలే మహేష్ బాబు అభిమానుల కోసం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ-రిలీజ్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టి విజయం సాధించింది

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page