ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు ఐ.పి.ఎల్ ఎఫక్ట్ ఇవి సరిపోవా అన్నట్లు ఎలెక్షన్ హీట్ ఒకటి. ఇలా ఎప్పుడు కళకళలాడే సమ్మర్ ఈసారి మాత్రం మూగబోయింది. థియేటర్స్ లో జనాలు లేక ఈగలు తోలుకునే పరిస్థితికొచ్చారు. దానికి తోడు పెద్దగా పేరున్న సినిమాలు కూడా ఏమి లేకపోవడంతో ఈ సమ్మర్ కళ తప్పిందనే చెప్పాలి. మార్చి నెలాఖరులో వచ్చిన “టిల్లు స్క్వేర్” సినిమానే ఏప్రిల్ నెలను కూడా కొంతవరకు నెట్టుకొచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన “ఫ్యామిలీ స్టార్” మొదటి వీకెండ్ ఫర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఐతే ఇదే వారం వచ్చిన కేరళ బ్లాక్ బస్టర్ “మంజుమ్మెల్ బాయ్స్” సినిమాకి తెలుగులో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత వరకు ఎవరు టచ్ చెయ్యని పాయింట్ NDRF సిబ్బంది యొక్క గొప్పతనాన్ని దర్శకుడు చాలా రసవత్తంగా రక్తి కట్టించాడు. అందుకే ఈ చిత్రానికి కేరళ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు. ఇంకా రెండో వారంలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రాలేదు. ఒక్క “గీతాంజలి మల్లి వచ్చింది” అనే సినిమానే కొంచం చెప్పుకోదగ్గ సినిమా. ఎప్పుడు పదేళ్ల క్రితం వచ్చిన “గీతాంజలి” సినిమాకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం మాత్రం సాదించలేకపోయింది. సునీల్, అలీ, సత్యం రాజేష్, జబర్దస్త్ గ్యాంగ్ ఇలా ఎంతమంది ఉన్న సినిమాని మాత్రం కాపాడలేకపోయాయి. దీనితో రెండో వారంకూడా మంజుమ్మెల్ బాయ్స్, టిల్లు స్క్వేర్ లాంటి చిత్రాలే మళ్ళీ రి-రన్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు వారం అన్న థియేటర్స్ ఫుల్ అవుతాయి అనుకుంటే ఒక్క “మార్కెట్ మహాలక్ష్మి” చిత్రం తప్పించి మిగిలిన ఏ చిత్రం ఆ లోటుని భర్తీ చేయలేకపోయాయి. చాలాకాలం తర్వాత పార్వతీశం ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 1st డే నుంచే పాజిటివ్ టాక్ తో డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి గట్టి సపోర్ట్ దొరికింది. ఫస్ట్ వీకెండ్ మంచిగానే పెర్ఫర్మ్ చేసిన ఈ చిత్రం. ఈ వీకెండ్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో సెకండ్ వీకెండ్ కూడా “మార్కెట్ మహాలక్ష్మి”కి కలిసొచ్చే అంశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వారమే రావాల్సిన “లవ్ మీ ఇఫ్ యూ డేర్” చిత్రం వచ్చే నెలకి పోస్ట్ పోన్ అవ్వడంతో, ఈ వారంకూడా బాక్సాఫీస్ డల్ గానే కనిపించడం ఖాయంగానే కనిపిస్తుంది. ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఈ సమ్మర్ పై గట్టిగానే పడిందని చెప్పాలి. కనీసం ప్రభాస్ “ప్రాజెక్ట్-కె”వచ్చినా ఈ సమ్మర్ కొంచం గట్టెకేది. కానీ అది కూడా పోస్టుపోన్ అవ్వడంతో ఈ సమ్మర్ అంతా బాక్సాఫీస్ కి కష్టమే.