ప్రతి ఏటా సందడి సందడిగా సాగే సమ్మర్ బాక్సాఫీస్ ఈ సమ్మర్ మాత్రం కొంచం నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఒక్క “టిల్లుస్క్వేర్” మినహా మిగిలిన ఏ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేదు. “ఫ్యామిలీ స్టార్ “, “గీతాంజలి” లాంటి చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలొచ్చినా ఏవి కూడా జనాదరణ పొందలేకపోయాయి. దీనితో గత నెల రోజులుగా నీరసంగా ఉన్న బాక్సాఫీస్ మే నెలలో మాత్రం కొంచం ఉత్సాహంగా సాగే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈ నెలలో కూడా పెద్ద సినిమాలేవీ లేకపోయినప్పటికీ అల్లరి నరేష్, సుహాస్ , విశ్వక్ సేన్, సుధీర్ బాబు లాంటి మినిమం గ్యారంటీ హీరోస్ సినిమాలు ఉండడంతో, ఈ నెలలో కొంచం బాక్సాఫీస్ సందడిగా మారే అవకాశాలు ఎక్కువున్నాయి.
.
ముందుగా మే తొలివారంనే అల్లరి నరేష్, సుహాస్ లాంటి వాళ్ళు సందడి చేయడానికి రెడీ అయిపోయారు. అల్లరి నరేష్ – ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్స్ గా “ఆ ఒక్కటి అడక్కు” అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం మే 3 తారీకునే రిలీజ్ కి రెడీగా ఉంది. చాలాకాలం తర్వాత అల్లరి నరేష్ మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇంకా ఇదే రోజున సుహాస్ “ప్రసన్నవదనం” అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైపోయాడు. ఫేస్ బ్లైండ్నెస్ అనే కొత్త తరహా కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఈ చిత్రం పైన కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇంకా ఇదే రోజునా వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో చేస్తున్న “శబరి” తో పాటు రాశిఖన్నా-తమన్నా ల హారర్ క్రైమ్ చిత్రం “బాక్” కూడా విడుదల కాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేష్ సినిమా వైపే ఆడియన్స్ కొంచం ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.
ఇక రెండోవారం మాత్రం పూర్తిగా ఎలక్షన్స్ కోసం కేటాయించేశారు. అందుకే రెండూ వారంలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావడంలేదు. మూడో వారంలో మాత్రం విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం రాబోతుంది. నిజానికి మేలో రిలీజవుతున్న సినిమాలలో ఈ సినిమాకే కొంచం బజ్ ఎక్కువ. ఇన్నాళ్లు క్లాస్ హీరోగా కనిపించిన విశ్వక్ సేన్ ఈ చిత్రంలో మాత్రం గోదావరి స్టైల్ మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన కొంచం అంచనాలున్నాయి. ఇంకా మే చివరి వారంలో సుధీర్ బాబు హీరోగా “హరోంహర” అనే సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ కృష గారి జయంతి రోజునే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సుధీర్ బాబు కి కూడా చాలా సంవత్సరాల నుంచి హిట్ లేదు. హిట్ కోసం చాలాకాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా విజయం సుధీర్ బాబుకి కీలకం. ఇలా ఏప్రిల్లో మిస్సైయిన ఈ నెలలో మాత్రం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి మంచి సినిమాలే వస్తున్నాయి. వాస్తవానికి ఈ మే నెలలోనే ప్రభాస్ “ప్రాజెక్ట్-k” కూడా రావాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్ ద్రుష్ట్యా జూన్27కి పోస్టుపోన్ అయింది. లేదంటే గనుక ఈ సమ్మర్ బాక్సాఫీస్ ఇంకోలా ఉండేది.