5ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటానే ఉన్న ఇంతవరకు కంప్లీట్ చేసుకోకపోగా అసలు సినిమా ఉండా లేదా అనే అనుమాన స్థితికి వెళ్లిపోయింది హరిహర వీర మల్లు సినిమా. అలాంటిది రెండురోజుల క్రితం టీజర్ అంటూ చిత్రయూనిట్ హడావిడి చేసింది. నిజానికి అనుకున్న లెక్కల ప్రకరం నిన్న నే రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోని కారణాల వాళ్ల అది ఎట్టకేలకు ఈరోజు ఉదయం 9గంటలకు రిలీజ్ చేశారు. ఎలక్షన్స్ హీట్ హడావిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ ద్రుష్టి ని ఈ టీజర్ డ్రాగ్ చేసిందనే చెప్పాలి. టీజర్లో నే సినిమా కధకు సంబందించిన హింట్ ఇచ్చేసారు. నవాబుల నాటి కాలంలో హైదరాబాద్ ని ఎలా పరిపాలించారు, ఇక్కడి ప్రజల కష్టాన్ని సొమ్ముని దోచుకుంటున్న ఢిల్లీ నవాబులు పై యుద్ధం చేసే వీరుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడన్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కథ కొంచం కొత్త గానే ఉన్నపటికీ “సైరా నరసింహరెడ్డి” సినిమా కథకి కొంచం దగ్గరిగా ఉంది. విజువల్స్ కూడా కొంచం సైరా ని తలపిస్తున్నాయి. ఓవరాల్ గా టీజర్ ఐతే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా టీజర్ ఎండింగ్ లో చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ కత్తి సాము చేసే షాట్ ఐతే అరాచకం.
ఐతే రిలీజ్ డేట్ సంబంధించిన అప్డేట్ కోసం ఆశగా ఎదురుచూసిన ఫాన్స్ కి రిలీజ్ డేట్ చెప్పకుండా నిరాశపరిచారు. కానీ ధర్మం కోసం యుద్ధం-2024 అంటూ క్లూ ఇచ్చి వదిలేశారు. అంటే సినిమా 2024 లోనే వస్తుంది అని సింబాలిక్ చెప్పారు. ఐతే ఈ సినిమా రెండు పార్ట్ లాగా తెరకెక్కించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. టీజర్ తో పాటుగా ఇంకో షాకింగ్ అప్డేట్ కూడా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ ని తప్పించి జ్యోతి కృష్ణ కి ఇస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ జ్యోతి కృష్ణ ఎవరో కాదు ఈ చిత్ర నిర్మాత ఏ.ఏం.రత్నం పెద్ద కొడుకు. గతంలో గోపీచంద్ తో “ఆక్సిజన్”, రీసెంట్ గా కిరణ్ అబ్బవరంతో “రూల్స్ రంజన్” అనే సినిమాలు తీసాడు. క్రిష్ తప్పుకున్నప్పటికీ ఆయన పర్వేక్షణలోనే మిగిలిన పార్ట్ కంప్లీట్ చేస్తారన్న విషయం స్పష్టం చేశారు.