చిత్రం: ఆ ఒక్కటి అడక్కు
రేటింగ్: 2.25/5
బాటమ్ లైన్: ” కామెడీ మాత్రం ఎక్కువ అడగొద్దు”
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, హరితేజ, మురళి శర్మ, గౌతమి, జమీ లివర్ తదితరులు
సంగీతం: గోపి సుందర్
నిర్మాత: రాజీవ్ చిలక
దర్శకత్వం: మల్లి అంకం
విడుదల: 3 మే 2024
“ఆ ఒక్కటి అడక్కు” అంటే అల్లరి నరేష్ తండ్రి ఇ.వి.వి సత్యనారాయణ తీసిన సినిమానే గుర్తొస్తుంది. రాజేంద్రప్రసాద్- రంభ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో గొప్ప హాస్యాస్పదమైన చిత్రాలలో ఒకటి. 1992లో రిలీజైనా ఈ చిత్రం ఇప్పటికి టీ.వీ లో వస్తే అతుక్కుపోయే వాళ్ళు ఉన్నారు. ఈ చిత్రంలోని కామెడీ ఇప్పుడు చూసిన కూడా ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మరి అదే సినిమా పేరు పెట్టుకొని వచ్చిన ఈ చిత్రం మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేసిందో లేదో ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం.
కథ:
గణపతి( అల్లరి నరేష్ ) ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతనో ఏజ్ బారైనా పెళ్లి కానీ ప్రసాద్. కానీ తమ్ముడికి మాత్రం పెళ్లయి ఒక 10ఏళ్ళ పాప కూడా ఉంటుంది. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. గణపతి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒక మాట్రిమోనీ ని కంసల్ట్ అవ్వుతాడు. వాళ్ల ద్వారా కొంతమంది అమ్మాయిలను కలుస్తుంటాడు. కానీ ఎవరు కూడా సెట్ అవ్వరు. అయితే అదే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ది( ఫరియా అబ్దుల్లా) ను కాలుస్తాడు. గతంలోనే ఓ సందర్భంలో కలిసిన వీళ్లిద్దరు మళ్లీ ఈ మాట్రిమోనీ దయ వాళ్ల మరింత దగ్గరవుతారు. సిద్ది కూడా గణపతి లాగే అబ్బాయిలని కలవడం రిజెక్ట్ చేయడం చేస్తుంటుంది.కానీ గణపతిని మాత్రం నిజంగానే ప్రేమిస్తుంది. ఇంటర్వెల్ టైంకి ఈ మాట్రిమోనీ పెద్ద మోసం అని అందులో సిద్ది తో పాటు మరికొంతమంది అమ్మాయిలు భాగం అని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న గణపతి ఆ మాట్రిమోనీ మోసాన్ని ఎలా బయట పెట్టాడు, సిద్ది ప్రేమని ఒప్పుకున్నాడా లేదా అన్నదే అసలు కధ.
విశ్లేషణ:
ఆ ఒక్కటి అడక్కు అని టైటిల్ పెట్టుకోగానే మళ్లీ ఆ స్థాయి కాకపోయినా అల్లరి నరేష్ పాత సినిమాల మాదిరి కొంచం వినోదాన్ని ఆశించే వెళ్లారు ప్రేక్షకులు. పైగా ట్రైలర్, టీజర్ కూడా వినోదభరితంగా సాగడంతో అల్లరి నరేష్ ఈస్ బ్యాక్ అనే వైబ్స్ గుర్తొచ్చాయి. కానీ తీరా సినిమా చూసాక ఆడియన్స్ చాలా వరకు నిరాశకు లోనైయ్యారనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళ పేరుతో మాట్రిమోనీస్ ఏ విధంగా జనాల్ని మోసం చేస్తున్నాయో తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాము. అదే పాయింట్ ని కథగా తీసుకొని దర్శకుడు మల్లి అంకం ప్రేక్షకులకి ఒక మంచి మెసేజ్ ఇద్దామనే ప్రయత్నం చేసాడు. కానీ దాన్ని వినోదభరితంగా చూపిద్దామనే ప్రయత్నంలో దర్శకుడు కొంచం తడ పడ్డాడు. అటూ కామెడీని ఇటూ కధలోని పాయింట్ ని రెండిటిని బాలన్స్ చేస్తూ సరిగ్గా హేండిల్ చేయలేకపోయాడు.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటుల పనితీరు. అల్లరి నరేష్ తన సహజ సిద్దమైన నటనతో బాగా చేసాడు. దాశాబ్దకాలం నుంచి సీరియస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నా అల్లరి నరేష్ ఈ సినిమాతో తన పాత ట్రక్ లోకి వచ్చాడు. తనలోని కామెడీ యాంగిల్ ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకున్నాడు. ఫరియా అబ్దుల్లా కూడా చాలా బాగా చేసింది. తన పాత్రకి మంచి స్కోప్ దొరికింది. తనలో మంచి నటి ఉందన్నా విషయం అర్ధమవుతుంది. ఇంకా అల్లరి నరేష్ మరదలు గా నటించిన జమీ లివర్ క్యారెక్టర్ మాత్రం నవ్వులు పూయిస్తుంది. అల్లరి నరేష్, జమీ లివర్ పాత్రల మధ్య జరిగే సన్నివేశాలు హిలేరియస్ గా ఉన్నాయి. వెన్నెల కిశోర్ క్యారెక్టర్ కూడా ఉన్నంతసేపు బాగానే నవ్విస్తుంది. మిగితా పాత్రలు తమ తమ పరిధి మేరకు బానే చేశారు. చివర్లో జడ్జి రూపంలో వచ్చిన గౌతమీ క్యారెక్టర్ బిగ్ సర్ప్రైజ్.
ప్లస్ పాయింట్స్:
జమీ లివర్, వెన్నెల కిశోర్ కామెడీ ఉన్నతసేపు నవ్వించి వెళ్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా రిచ్ గా ఉంది. బాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. కెమెరా మాన్ పనితీరు కూడా చాలా బాగుంది. దర్శకుడు పెళ్ళిళ్ళ పేరుతో కొన్ని మాట్రిమోనీస్ ఎలా మోసం చేస్తున్నాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ సాంగ్స్. మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోదు. కామెడీ కూడా చాలా సందర్భాలలో ఫోర్స్ ఫుల్ గా అనిపిస్తుంది. ఇంక ప్రధానంగా ఇంకో మైనస్ పాయింట్ కథని డైరెక్టర్ హేండిల్ చేసిన విధానం. మంచి కథే తీసుకున్నాడు గాని దాన్ని కామెడీ వే లో చూపించాలా , లేదా సీరియస్ వే లో చూపించాలో తెలియక దర్శకుడు తికమక పడ్డాడు. సినిమా లెంగ్త్ కూడా చాలా ఉంది. చాలా సందర్భాలలో సాగదీసినట్లు అనిపిస్తుంది.
రివ్యూ బై: ఎం. నవీన్