గత రెండు నెలలుగా పూర్తిగా డౌన్ అయినా మార్కెట్ఇ ప్పట్లో తీరుకోవడం కష్టంగానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎలక్షన్స్ ఎఫెక్ట్ బాగా పడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మే13న సార్వత్రిక ఎన్నికలు ఉన్న తరుణంలో ఈ సమ్మర్ కి రావాల్సిన చాలా సినిమాలు పోస్టుపోన్ అవ్వడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి రాకుండా ముఖం చాటేశారు.ఏప్రిల్ తో పోలిస్తే మే నెలలో కొంచం పేరున్న సినిమాలు ఉన్నపటికీ అవి బాక్సాఫీస్ ని బిజీ చేసే సినిమాలైతే కాదు. ఈ పరిస్థితి ఇంకో 50రోజుల పాటు ఇలాగే కొనసాగనున్నది. ఎందుకంటే ఇప్పుడప్పుడే ప్రజలు ఎలక్షన్స్ మూమెంట్ నుంచి బయటికి రావడం కష్టం కనుక. కానీ అసలు సిసలు బాక్సాఫీస్ జాతర మాత్రం జూన్ 27 నుంచి మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో మిస్ అయ్యిన మాస్ జాతరంతా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ సినిమాతో మొదలవుతుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్-కె” సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9న రావాల్సి ఉన్న ఎన్నికల రీత్యా జూన్ 27కి పోస్టుపోన్ అయింది. ఈ సినిమాతోనే బాక్సాఫీస్ ఊచకోత తెరుచుకోనుంది. దీని తర్వాత “భారతీయుడు-2”, “పుష్ప-2”, “ఓ.జి” , “దేవర”, “గేమ్ ఛేంజర్” లాంటి వరుస సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్రకు రెడీగా ఉన్నాయి. నిజానికి భారతీయుడు-2 జూన్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వాళ్ళ జులై కి షిఫ్ట్ అయినట్లు సమాచారం. శంకర్- కమల్ సినిమాలు కావడంతో తెలుగులో కూడా మంచి అంచనాలున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాతో పాటు గేమ్ ఛేంజర్ సినిమా కూడా లాభపడుతుంది. ఎందుకంటే శంకర్ తర్వాత సినిమా గేమ్ ఛేంజర్ కాబట్టి. సో భారతీయుడు-2 హిట్ అయితే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ – రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువ జరిగిద్ది.ఇంకా ఆగష్టు నెలలో ఇండియాలో నే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన “పుష్ప ది రూల్” రాబోతుంది. “పుష్ప ది రైజ్” దెబ్బకి ప్రపంచమంతా అతనికి సలాం కొట్టింది. అందుకే ఇప్పుడు పుష్ప-2 కి అంత క్రేజ్. ఆల్రెడీ రిలీజ్ చేసిన గిలింప్స్ తో పాటు ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగల్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాలు మరింత ఎక్కువైయ్యాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఊచకోత ఖాయం. 1000కోట్ల బొమ్మ ఇది. ఇంకా దీని తర్వాత సెప్టెంబర్ లో పవర్ స్టార్ ప్రభంజనం ప్రారంభం కాబోతుంది. టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 100కోట్ల కొట్టగల స్టామినా పవర్ స్టార్ సొంతం. అలాంటిది హిట్ టాక్ పడితే “ఓ.జి” ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు.
“ఓ.జి” దిగిన రెండు వారాలకే యంగ్ టైగర్ “దేవర” గా రాబోతున్నాడు. యంగ్ టైగర్ బాక్సాఫీస్ స్టామినా ఏం తక్కువ కాదు. టాక్ బాగుంటే 100కోట్ల పైగా రాబట్టగలడు. పైగా “ఆర్.ఆర్. ఆర్” దయతో పాన్ఇండియన్ స్టార్ అయ్యాడు. కాబట్టి దేవర కి సైతం పాజిటివ్ టాక్ వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊచకోతని ఆపడం కష్టమే. ఇంకా చివరిగా రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” రాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా ఈ సంవత్సరం వస్తుందో వచ్చే సంవత్సరం వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఒకవేళ ఈ ఏడాదే వస్తే ఈ సినిమా సైతం ఆపడం కష్టమే. రామ్ చరణ్ కి ఇప్పటికే మిస్టర్. బాక్సాఫీస్ అనే పేరుంది. సో “గేమ్ ఛేంజర్”కూడా హిట్ అయితే రామ్ చరణ్ విధ్వంసానికి బాక్సాఫీస్ తలొంచాల్సిందే.
వీటితో పాటు మరికొన్ని నోటేడబుల్ మూవీస్ వస్తున్నాయి. వాటిలో “సరిపోయిందా శనివారం”, “తండేల్”, “డబల్ ఇస్మార్ట్” లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. చిన్న సినిమాలే కదా అని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఈజీగా 100కోట్ల మార్క్ ని టచ్ చేసి చూపించగలవు. అలా 2024 ఫస్ట్ హాఫ్ అంతా బోసిపోయిన, సెకండ్ హాఫ్ మాత్రం ఆ లోటును భర్తీ చేయబోతున్నాయి.