- Advertisement -spot_img
HomeMoviesఎలక్షన్ మూమెంట్ - తెలుగులో బెస్ట్ పొలిటికల్ మూవీస్ ఇవే !

ఎలక్షన్ మూమెంట్ – తెలుగులో బెస్ట్ పొలిటికల్ మూవీస్ ఇవే !

- Advertisement -spot_img

మన హీరోలు ఎప్పుడు తొడలు కొట్టడాలు, మీసాలు మెలేయడాలే కాదు, ఫ్లవర్స్ చేతిలో పట్టుకొని ఫీల్ మై లవ్ అంటూ అమ్మాయిల చుట్టూ తిరగడమే కాదు అప్పుడప్పుడు కొంచం బాధ్యతగా కూడా ప్రవర్తిస్తారు. రాజకీయం, దేశభక్తి వంటి అంశాలతో ప్రేక్షకులకి మంచి మెసేజ్ ఇస్తారు. దేశం అంటే ఏంటి, నాయకుడంటే ఎలా ఉండాలి, ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మంచి జరుగుతుంది వంటి అంశాలతో ప్రజలకి అవగాహన కల్పిస్తారు. మరి అలాంటి వాటిల్లో తెలుగు ఇప్పటి వరకు వచ్చిన టాప్ 10 బెస్ట్ పోలిటికల్ చిత్రాలివే.

1.ఒకేఒక్కడు 1999

దర్శకుడు శంకర్ తీసిన చిత్రాలలో అప్పటికీ , ఇప్పటికీ, ఎప్పటికీ వన్ ఆఫ్ బెస్ట్ చిత్రం అంటే “ఒకే ఒక్కడు” సినిమానే. ఒక సామాన్యుడికి అందులోనూ చదువుకున్నోడికి ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చుస్తే ఏం జరుగుతుందో, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో శంకర్ ఈ సినిమాలో చేసి చూపించారు. చౌదరి( రఘువరన్ ) గవర్నమెంట్ లో జరుగుతున్నా తప్పులని ఎలా సరిదిద్దొచో ఒక్క రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉంది చేసి చూపించి అందరి చేత శబాష్ అనిపించుకుంటాడు పురుషోత్తం( అర్జున్ ). బదులుగా అది కాస్త అవమానంగా భావించిన చౌదరి అప్పటి నుంచి పురుషోత్తంని ఇబ్బంది పెడతాడు. చౌదరి గవర్నమెంట్ పెడుతున్న ఇబ్బందులని ఎలా ఎదుర్కున్నాడు అన్నదే అసలు కథ. ఇటువంటి పొలిటికల్ కథతో అప్పటికీ, ఇప్పటికీ ఏ సినిమా రాలేదు. అందుకే ఈ చిత్రం పొలిటికల్ మూవీస్ లోనే ఒక ట్రెండ్ సెట్టర్. మనీషా కొయిలారా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 1999వ సంవత్సరంలో రిలీజై పెద్ద హిట్టైయింది. ఈ చిత్రం చూసి దేశంలోని ఏంటో మంది రాజకీయ నాయకులు దర్శకుడు శంకర్ ను కొనాడారు.

2.భారతీయుడు 1996

భారతీయుడు చిత్రం కూడా దర్శకుడు శంకర్ బుర్రలో నుంచి వచ్చిన జాలువారిన ఇంకో దృశ్యకావ్యం. ఇందులో కమల్ హస్సన్ డ్యూయెల్ రోల్ పోషించగా ఊర్మిళ, మనీషా కొయిలారా, సుకన్య కీలక పాత్ర పోషించారు. సేనాపతి ( కమల్ హస్సన్ ) ఒక 70ఏళ్ళ వృద్ధుడు. అతను బ్రిటిష్ వారి పై యుద్ధం చేసి భారతదేశానికి స్వతంత్రం తేవడంలో తన వంతు పాత్ర పోషించారు. తనతో పాటు తన భార్య అమృతవల్లి ( సుకన్య ) కూడా స్వతంత్రం యుద్ధంలో పాల్గొనడంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి చంద్రబోస్ ( కమల్ హస్సన్ ), కస్తూరి ( కస్తూరి ) అనే ఇద్దరు పిల్లలుంటారు. కొన్నాళ్లకి ఒక ప్రమాదంతో సేనాపతి కూతురు చనిపోతుంది. సకాలంలో తన కూతురుకి లంచగొండితనం వాళ్ళ వైద్యం అందక చనిపోతుంది. అప్పటి నుంచి దేశంలో లంచగొండితనం పై యుద్ధం చేస్తుంటాడు. లంచాలు తీసుకునే వాళ్ళందరిని చంపేస్తుంటాడు. అయితే R.T.O లో పని చేస్తున్న తన కొడుకు కూడా అవినీతిపరుడని తెలిసి అతన్ని కూడా చంపేస్తాడు ఇదే కథ. దేశంలో లంచాల వాళ్ళ జరుగుతున్నా అన్యాయాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు శంకర్. అందుకే 1996లో రిలీజైనా ఈ చిత్రం కూడా పెద్ద హిట్. రెండు పాత్రలలో కమల్ హస్సన్ ఇరగదీసాడు. ఈ చిత్రం అంత పెద్ద హిట్టైయింది కాబట్టే దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది.

3.ఠాగూర్ 2004

మెగాస్టార్ సినీ కెరీర్లో నే “ఠాగూర్” చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా వల్లే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. బద్రినారాయణ ( సాయాజీ షిండే ) లంచగొండుల సహాయంతో అక్రమ కట్టడాల వాళ్ళ తన భార్య( జ్యోతిక ) ని కోల్పోయిన ఠాగూర్ ( చిరంజీవి ) తనకి జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని భావించి. ఒక కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ దేశంలో లాంచగోడితనాన్ని అరికట్టడానికి ACF( anti corruption force) గా ఏర్పడి లంచాలు తీసుకునే వాళ్ళని శిక్షిస్తుంటాడు. తమిళంలో 2002వ సంవత్సరంలో విజయ్ కాంత్ – మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన “రమణ” చిత్రం పెద్ద హిట్. దాన్నే తెలుగు నేటివిటీకి తగట్టు కొన్ని మార్పులు చేసి వి. వి. వినాయక్ చాలా చక్కగా చూపించాడు. ప్రతి డిపార్మెంట్లో ఎంత అవినీతి జరుగుతుందో, జనాల్ని ఎలా మోసం చేస్తున్నారు కళ్లకట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చెప్పే డైలాగ్స్ ఇప్పటికి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. ఈ సినిమా రిలీజైయాక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవడం మానేశారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో.

4.శివాజీ ( ది బాస్ ) 2007

శంకర్ నుంచే వచ్చిన ఇంకో ఆణిముత్యం ఈ “శివాజీ” చిత్రం. అమెరికా నుంచి వచ్చిన శివాజీ. ఇండియా లో పేదవాళ్ల కోసం స్కూల్స్, కాలేజస్ , హాస్పిటల్స్ లాంటి కట్టి దేశం ఋణం తేర్చుకోవాలనుకుంటాడు. కానీ దాన్ని ఆదికేశవ్ లాంటి రాజకీయ నాయకులు అడ్డుకుంటారు. అంటే కాకుండా అక్రమ కట్టడాలంటూ బ్యాన్ చేయిస్తాడు. ఐతే శివాజీ మాత్రం రాజకీయంగా అతన్ని ఎదుర్కొని దేశంలోని ప్రముఖుల దగ్గర ఉన్న నల్లధనంతోనే తిరిగి తన ఆశయాన్ని పూర్తిచేస్తాడు. విదేశాలలో చదువుకున్న మన NRI లు దేశం అభివృద్ధి కి పాల్పడుతుంటే రాజకీయ నాయకులు ఎలా అడ్డుకుంటున్నారో స్పష్టంగా చూపించారు. అంటే కాకుండా టాక్స్ లు కట్టకుండా దేశ సంపదను ఎలా దోచుకుంటున్నారో ఈ సినిమా చుస్తే అర్ధమవుతుంది. 2007లో వచ్చిన ఈ చిత్రం సూపర్ స్టార్ రజిని కాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. చదువుకున్న యువకుల, విదేశాలలో సెటిల్ అయ్యిన NRIలు దేశాభిరుద్దికి పాటు పడాలని గొప్ప సందేశాన్నిచ్చింది ఈ చిత్రం.

5.ప్రస్థానం -2010

తెలుగులో బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో ఈ సినిమా కూడా ఉంటది. ఇంకో 100ఏళ్ళు అయినా ఇటువంటి పొలిటికల్ డ్రామా రాదు, చూడలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటె అచ్చం రామాయణం, మహాభారతం కధలకు ఏ మాత్రం తీసిపోని కథ
ఇది. వాస్తవిక రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ సినిమా. కుళ్ళు, ద్వేషం, పగ ఈ మూడు మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో ఈ సినిమా చుసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక సవతి తండ్రి ఇద్దరి సవతి అన్నదమ్ముల మధ్య జరిగే రాజకీయ కధే ఈ చిత్రం. మిత్ర గా ( శర్వానంద్ ), చిన్నగా ( సందీప్ కిషన్ ), లోకనాధం గా ( సాయి కుమార్ ) ఈ ముగ్గురి రాజకీయ ప్రస్థానమే ఈ ప్రస్థానం. 2010లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సరిగ్గా ఆడలేదు గాని ఇప్పుడు వచ్చి ఉంటే మాత్రం పెద్ద హిట్టైయేది.

6.లీడర్ -2010


ఎప్పుడు ఏ రాజకీయ విశేషం జరిగిన, లేదా రాజకీయ సంగతులు గుర్తొచ్చిన టక్కున గుర్తొచ్చే చిత్రం “లీడర్”. రాజకీయాల్లోకి అందరు మంచి ఉద్దేశంతోనే వస్తారు కానీ రాజకీయాలే వాళ్ళని చెడకొడతాయి అని ఎవరో ఒక మహాకవి చెప్పిన మాట ఆధారంగా వచ్చిన చిత్రమే ఈ “లీడర్” చిత్రం. అర్జున్ ప్రసాద్ ( రానా ) తన తండ్రి చనిపోవడంతో తన తల్లి ఆశ మేరకు తన తండ్రి తర్వాత తానే సీఎం అవుతాడు. స్వతహాగానే మంచివాడైనా అర్జున్ ప్రసాద్ కానీ తన పార్టీని కాపాడుకోవడానికి కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. అదే తన పార్టీ లోని బలమైన నాయకుడి కొడుకుని ఒక రేప్ కేసు నుంచి కాపాడడం. ఆ నిర్ణయం వాళ్ళ అతని జీవితంలో కొన్ని అనుహ్య మార్పులు సంభవిస్తాయి. ఆఖరికి అతను చేసిన తప్పుకి తట్టుకోలేక అతని తల్లి మరణిస్తుంది. చేసిన తప్పు తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టి పాదయాత్ర మొదలుపెట్టి ప్రజలు తన పై పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి మళ్లీ తెచ్చుకుంటాడు. ఒరిజినాలిటీ చాలా దగ్గరుగా ఉన్న సినిమా ఇది. రాజకీయాలు మంచివాళ్ళని సైతం ఎలా మార్చేస్తాయో చాలా బాగా చెప్పారు శేఖర్ కమ్ముళ్ల. ఫస్ట్ సినిమానే అయినా సీఎం క్యారెక్టర్లో చాలా చక్కగా ఒదిగిపోయాడు రానా. 2010 లోనే వచ్చిన ఈ చిత్రం సరిగ్గా ఆడకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలైతే అందుకుంది.

7. కెమెరామాన్ గంగతో రాంబాబు- 2012

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సమాజం పై బాధ్యతని , రాజకీయాల పై తనకున్న ఇష్టాన్ని, ప్రేమని, పవన్ కళ్యాణ్ లోని ఫైర్ ని, మొండితనాన్ని అసలు సిసలైన నాయకుడిని తేరా పైన ఆవిష్కరించారు డైరెక్టర్ పూరి జగన్నాద్. మాములుగా ఎప్పుడు సినిమాలో నటించే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మాత్రం జీవించేసారు. కారణం రాంబాబు పాత్ర పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ కాబట్టి. సినిమాలో జర్నలిస్ట్ గా రాంబాబు అడ్డా దారిలో ముఖ్యమంత్రి అవ్వడం కోసం ప్రయత్నించే రానా ప్రతాప్ నాయుడు ( ప్రకాష్ రాజ్ ) ను ఎదుర్కునే తీరుని చుస్తే. పవన్ కళ్యాణ్ లోని నాయకత్వ లక్షణాలకు అర్థంపడతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ యువతకి పిలుపునిచ్చే సన్నివేశం చుస్తే ఇటువంటి నాయకుడు కదా మనకి కావాలి అని అనిపిస్తుంది. 2012 లో రిలీజైనా ఈ చిత్రం ప్లాప్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ లోని నాయకత్వ లక్షణాలకి అర్ధం పడతాయి.

8. ప్రతినిధి -2014

నారా రోహిత్ హీరోగా నటించిన ఈ చిత్రం సైతం వన్ ఆఫ్ బెస్ట్ పొలిటికల్ మూవీస్ లో ఒకటి. ఒక ముఖ్యమంత్రిని కిడ్నప్ చేసి తన డిమాండ్స్ నెరవేర్చుకోవడమే ఈ చిత్ర కధ. కర్రెన్సీ నోట్ల పై గాంధీ బొమ్మ తీసేయమనడం, పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు తనకి రావాల్సిన 84పైసలు లాంటి డిమాండ్స్ కొంచం సిల్లీగానే అనిపించొచ్చు గాని కొంచం లోతుగా ఆలోచిస్తే దాని వెనుక మర్మం ఏంటో అర్ధమవుతుంది. సీఎం ని కిడ్నప్ చేసి తద్వారా మన చట్టంలో ఉన్న లోపాలు, ప్రభుత్వ పరిపాలనలో జరుగుతున్న తప్పిదాలు వివరిస్తున్న తీరు చుస్తే అందరిని ఆలోజింపచేస్తాయి. 2014లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం మంచి విజయం సాధించింది. అందుకే దీనికి కొనసాగింపుగా ప్రతినిధి 2 వచ్చింది.

9. భరత్ అనే నేను -2018

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక్షంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ సమాజం పై తనకున్న బాధ్యతని ఈ సినిమాతో మరోసారి చాటుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రాజకీయాల్లోకి వస్తే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో కొరటాల శివ చాలా చక్కగా చూపించాడు. సినిమాలో సీఎం భరత్ ఎడ్యుకేషన్ సిస్టంలో తెచ్చిన మార్పులు, ట్రాఫిక్ రూల్స్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు, స్వయం పరిపాలన లాంటి అంశాలు. నిజజీవితంలో కూడా అప్లై చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా నేటి రాజకీయ విధానాల పై ఎంత ప్రభావం చూపించిందో. అందుకే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలలోనే ట్రెండ్ సెట్టర్.

10. యాత్ర-2019

వైయస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం కూడా వన్ ఆఫ్ బెస్ట్ పొలిటికల్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి యొక్క గొప్పతనం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చేసిన మంచి పనులు తీసుకొచ్చిన చట్టాలు ఆదర్శయంగా నిలుస్తాయి. నాయకుడంటే ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేస్తే జనం మనల్ని గుండెల్లో పెట్టుకుంటారో అనే దానికి వైయస్. రాజశేఖర్ రెడ్డి జీవితం అందుకు నిదర్శనం. 2019లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్ అయినప్పటికీ. ఆంధ్రప్రదేశ్ లో ఆయన తనయుడు వైయస్. జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో మాత్రం కీలక పాత్రపోషించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page