- Advertisement -spot_img
HomeMoviesటాప్-10 బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇన్ తెలుగు సినిమా !

టాప్-10 బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇన్ తెలుగు సినిమా !

- Advertisement -spot_img

మన తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు పెద్ద హిట్స్, భారీ సక్సెస్ లు మాత్రమే కాదు. కొన్ని కళలో కూడా ఊహించని ఘోర పరాజయాలు కూడా ఉన్నాయి. అవి తెలుగు సినిమా చరిత్రలోనే కాదు హీరోస్ కెరీర్లో కూడా మానని మచ్చగా మిగిలిపోయి నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. మరి అలాంటి టాప్-10 సినిమాలేవో ఇప్పుడు చూద్దాం.

  1. రాధేశ్యామ్- 2022

ప్రభాస్ కెరీర్లో బాహుబలి-1,2 ఎంత పెద్ద హిట్టో రాధేశ్యామ్ అంత పెద్ద ఫ్లాప్. బాహుబలి సినిమా ప్రభాస్ కి ఎంత కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయో, రాధేశ్యామ్ అంతకంటే ఎక్కువ అపకీర్తి తెచ్చిపెట్టింది. ప్రభాస్- పూజ హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం 2022 మార్చి 11న విడుదలై భారీ పరాజయం పాలైయింది. గోపీచంద్ “జిల్” చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన రాధా కృష్ణ రెండో చిత్రంతోనే ప్రభాస్ ఇచ్చిన పాన్ ఇండియా ఆఫర్ ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. “టైటానిక్” లాంటి ఒక ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ఇస్తాడని ఆశించిన వాళ్ళకి 200కోట్లు పెట్టి ఒక నాసిరకమైన ప్రేమకధనిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా 210 కోట్ల ప్రీ- రిలీజ్ బిజినెస్ జరుపుకున్న రాధేశ్యామ్ ఫైనల్ రన్ పూర్తిచేసుకునే సరికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 89కోట్ల షేర్ కలెక్ట్ చేసి 120కోట్లకు పైగా భారీ నష్టాలను మిగిల్చింది.

  1. ఆచార్య- 2022

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయి గాని ఆచార్య ఫ్లాప్ మాత్రం మెగాస్టార్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అంటే ఈ సినిమాకి వచ్చిన నష్టాలకి డైరెక్టర్ కొరటాల శివ తన ఇల్లు అమ్ముకునేంతల. అప్పటివరకు వరుస నాలుగు హిట్స్ తో మంచి జోరు మీదున్న కొరటాల శివ ఈ సినిమా దెబ్బకు ఫ్లాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. మెగాస్టార్ తన కొడుకు రాంచరణ్ ఇద్దరు కలిసి నటించినా ఈ సినిమా పరాజయాన్ని ఆపలేకపోయారు. ముందుగా అనుకున్న కధలో మార్పులు చేర్పులు చేయడం. కాజల్ అగర్వాల్  క్యారెక్టర్ ని పూర్తిగా తొలగించేసి రామ్ చరణ్ క్యారెక్టర్ నిడివి అప్పటికప్పుడు పెంచేయడం లాంటి తప్పిదాల వల్లే ఈ సినిమా ఘోర పరాజయం సాధించింది. టోటల్ 130కోట్ల బ్రేక్ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఆచార్య ఓవరాల్ గా 49కోట్ల షేర్ మాత్రమే సాధించి 80కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే కాదు రామ్ చరణ్ కెరీర్లో లో కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్.

  1. స్పైడర్- 2017

సూపర్ స్టార్ మహేష్ బాబు- తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ కావడం. మహేష్ బాబు “స్పై” రోల్లో కనిపించడం దానికి తోడు ట్రైలర్, టీజర్ అదిరిపోవడం ఇన్ని పాజిటివ్ అంచనాల మధ్య వచ్చిన “స్పైడర్” మహేష్ బాబు కెరీర్లోనే కనివిని ఎరుగని డిజాస్టర్. అంతక ముందే “బ్రహ్మోత్సవం” రూపంలో ఒక భారీ పరాజయాన్ని చవిచుసిన మహేష్ బాబు. ఈ సినిమాతో దానికి రెండింతల పరాజయాన్ని చవిచూసాడు. కధ పరంగా బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కించిన విధానంలో మాత్రం పూర్తిగా విఫలమైయ్యాడు మురగదాస్. అటు మహేష్ బాబు కూడా నటుడిగా పూర్తిగా తేలిపోయాడు. సినిమాలో హీరో కంటే విల్లన్ క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో తెలుగు ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. కానీ తమిళంలో మాత్రం మహేష్ బాబు కెరీర్లో నే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. 125కోట్ల బ్రేక్ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం ఓవరాల్ గా 49కోట్ల షేర్ మాత్రమే వసూల్ చేసి 70కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది.

  1. అజ్ఞతవాసి- 2018

తెలుగులో కొన్ని హిట్ కంబినేషన్స్ ఉంటాయి. ఎవరు ఎవరితో ఎన్ని సినిమాలు తీసిన ఈ డైరెక్టర్- ఈ హీరో కి బాగా సెట్ అవుతాడు, వీళ్లిద్దరి కాంబినేషన్ బాగుంటుంది అన్న అభిప్రాయం ఉంటుంది. అలాంటి కాంబినేషన్ నే త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్. అజ్ఞతవాసి ముందు వరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జల్సా” హిట్టైతే, “అత్తారింటికి దారేది” ఇండస్ట్రీ హిట్. మరి వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముచ్చటగా మూడో చిత్రమే ఈ “అజ్ఞతవాసి” చిత్రం. సినిమా రిలీజ్ ముందు భారీ హైప్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం. పైగా పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కావడం. దానికి తోడు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేయదు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడన్న ప్రకటన రావడం. వీటన్నికి తోడు సినిమా ట్రైలర్ , టీజర్ అదిరిపోవడం. ఇన్ని అంచనాల మధ్య రిలీజైనా ఈ చిత్రం ఇంకోసారి పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే భయపడేలా చేసింది. సినిమా కలెక్షన్స్ విషయంలోనే కొత్త రికార్డ్స్ సెట్ చేసి పెడుతుందనుకుంటే ప్లాపులోనే కొత్త రికార్డు సెట్ చేసి పెట్టింది. టోటల్ 125కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం ఫైనల్ రన్ లో మాత్రం 57కోట్ల షేర్ సాధించి 65కోట్ల పైగా నష్టాలు చవిచూసింది.

  1. సాహో- 2019

బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాల పై అంచనాలు పీక్స్ కి చేరాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ “సాహో” లాంటి పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా చేస్తుండడంతో అందరిలో భారీ అంచానాలు పెట్టుకున్నారు సినిమా పై. అందుకు తగత్తె ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో ప్రీ- రిలీజ్ బిజినెస్ కుండా బద్దలుకొట్టింది. ఏకంగా 290కోట్లకు పైగా ప్రీ- రిలీజ్ బిజినెస్ జరుపుకొని ఇండస్ట్రీ వర్గాలని షాక్ కి గురి చేసింది. బాహుబలి తర్వాత ఒక తెలుగు సినిమాకి ఇదే హైయెస్ట్ ప్రీ- రిలీజ్ బిజినెస్. సుమారు రెండున్నరేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫైనల్ గా 2019 ఆగష్టులో రిలీజైయింది. 1st డే 1st షో నుంచే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. చాలామందికి ఈ సినిమా అర్థంకాలేదు. అందుకే సౌత్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ హిందీలో మాత్రం కలెక్షన్స్ కుమ్మేసింది. హిందీ లోను సైతం ప్లాప్ టాక్ తో మొదలయి ఏకంగా 120కోట్లకు పైగా షేర్ సాధించి బ్రేక్ ఈవెన్ అయింది. మిగితా అన్ని చోట్ల ఈ సినిమా ప్లాప్. కలెక్షన్స్ ఐతే 232కోట్ల షేర్ వసూల్ చేసింది గాని ప్రీ- రిలీజ్ బిజినెస్ ఎక్కువుండడంతో 60కోట్ల పైగా నష్టాలు తప్పలేదు.

  1. NTR- కధానాయకుడు- 2019

తెలుగు వారి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ గా తెరకెక్కిన “NTR కధానాయకుడు” రిలీజ్ తర్వాత ఆయన పరువు తీసిందనే చెప్పాలి. తన తండ్రి బయోపిక్ లో తనయుడు బాలకృష్ణ నటించడమే ఈ సినిమాకి అతి పెద్ద మైనస్. సినిమాకి అంతా పాజిటివ్ రివ్యూస్, టాక్ కూడా పాజిటివ్ వచ్చినప్పటికీ ఎందుకో ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. బయోపిక్ అన్నాక ఎత్తుపల్లాలు అన్ని చూపించాలి. కానీ ఈ చిత్రంలో రామారావు గారి జీవితంలోని పాజిటివిటీ మాత్రమే చూపించి ఆయన జీవితంలో జరిగిన అవమానాలు, తప్పిదాలు మాత్రం చూపించేలేదు. అందుకే సినిమా ఆకట్టుకోలేదు ఆడియన్స్ ని. పైగా బాలకృష్ణ గారి గెటప్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్. రామారావు గారి జీవిత చరిత్ర కాబట్టి ఆడియన్స్ చేసేస్తారు అన్న నమ్మకంతో 74కోట్లకు అమ్మారు. తీరా వచ్చింది చుస్తే కేవలం 22కోట్లు అంటే 50కోట్లకు పైగా నష్టం కల్గింది. దీని ప్రభావం NTR మహానాయకుడు పై గట్టిగా పడింది. కధానాయకుడు కి వచ్చిన నష్టాలకి మహానాయకుడు చిత్రాన్ని ఫ్రీగా బయ్యర్స్ కి ఇచ్చేసారు. అయినా కూడా లాస్ రికవరీ చేయకపోగా కేవలం 3కోట్ల షేర్ మాత్రమే వసూల్ చేసి పరువు తీసింది.

  1. లైగర్- 2022

చాలా కలం తర్వాత “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్. తాను చేయబోయే తర్వాత సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగత్తె విజయ్ దేవరకొండ ని హీరోగా సెలెక్ట్ చేసుకొని “లైగర్” అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అవ్వడంతో మళ్లీ “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి” టైపు మ్యాజిక్ ఆశించారు. అందుకు తగత్తె టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసాడు పూరి. పైగా ఇందులో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఉండడంతో సినిమా పై అంచనాలు తారస్థాయికి చేరాయి. 90 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఇదే హైయెస్ట్ ప్రీ- రిలీజ్ బిజినెస్. మరి ఇన్ని అంచనాల మధ్య రిలీజైనా సినిమా తీరా తుస్సుమనిపించింది. విజయ్ దేవరకొండ మార్కెట్ ని దారుణంగా దెబ్బ కొట్టింది. 90కోట్లు+ బ్రేక్ఈవెన్ టార్గెట్ బరిలో దిగి కేవలం 32 కోట్ల షేర్ మాత్రమే వసూల్ చేసి 58కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా దెబ్బతో పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ “జనగణమన” సినిమా నుంచి విజయ్ దేవరకొండ తప్పుకున్నాడు.

  1. బ్రహ్మోత్సవం- 2016

అప్పటికే “శ్రీమంతుడు” లాంటి బిగ్గెస్ట్ హిట్ తో మంచి ఊపుమీదున్న మహేష్ బాబు ని “బ్రహ్మోత్సవం” సినిమా బాగా వెనక్కినెట్టేసింది. మహేష్ బాబు కళలో కూడా ఊహించి ఉండదు ఇంతటి దారుణమైన పరాభావం ఎదురవుతుందని. శ్రీమంతుడు సినిమా ఎంత పేరైతే తెచ్చిపెట్టిందో, “బ్రహ్మోత్సవం” సినిమా అందుకు రెండింతలు మచ్చ గా మిగిలిపోయింది. మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకొని కధ, కధనాలు లేకుండా ఒక ఫ్యామిలీ సీరియల్ తీసి ఆడియన్స్ కి తలనొప్పి తెప్పించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. పూర్తిస్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఒక సినిమా తీస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమా ఒక ఉదాహరణ. 72 కోట్ల కు అమ్మితే కేవలం 32 కోట్ల షేర్ మాత్రమే వసూల్ చేసి 40కోట్ల నష్టంతో మహేష్ బాబు రేంజ్ బాగా తగ్గించేసింది.

  1. సర్దార్ గబ్బర్ సింగ్- 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 10ఏళ్ళ తర్వాత హిట్టిచ్చిన చిత్రం “గబ్బర్ సింగ్”. దబాంగ్ రీమేక్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. మరి అలాంటి సినిమాకి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ స్వీయ రచనలో బాబీ డైరెక్షన్ లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబొర్ల పడింది. గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్టో ఈ సినిమా అంత పెద్ద ప్లాప్. గబ్బర్ సింగ్ హైప్ తో ఓవరాల్ 87కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం. ఫైనల్ రన్ ముగిసేసరికి 52కోట్ల షేర్ మాత్రమే వసూల్ చేసి 35కోట్ల నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా నష్టాల దెబ్బకి డిస్టిబ్యూటర్స్ పవన్ కళ్యాణ్ ఇంటి ముందు టెంట్ వేసుకొనికుర్చున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్ ఫ్లాప్ అని.

  1. వినయ విధేయ రామ- 2019

“రంగస్థలం” లాంటి గ్రాండ్ హిట్ తర్వాత రామ్ చరణ్ మళ్లీ ఆ స్థాయి విజయం ఇవ్వడానికి బోయపాటి శ్రీనుతో చేతులు కలిపాడు. అసలే బోయపాటి అంటే హై వోల్టేజ్ యాక్షన్. దానికి తోడు రామ్ చరణ్ అంటే విస్ఫోటనం ఖాయం అనుకున్నారందరు. కానీ విచిత్రంగా సినిమా ఘోర పరాజయం పాలైయింది. “సింహ”, “లెజెండ్” లాంటి ఊరమాస్ సినిమా తీస్తాడనుకుంటే. ఒక నాసిరకమైన యాక్షన్- ఫ్యామిలీ డ్రామా తీసి నవ్వులపాలైయ్యాడు. రామ్ చరణ్- బోయపాటి కాంబినేషన్ మీద నమ్మకంతో 90కోట్లకు కొన్న బయర్లందరూ భారీగా నష్టాలు చవిచూసారు. ఓవరాల్ గా 63కోట్ల షేర్ వసూల్ చేసి 27కోట్ల నష్టాలను తెచ్చిపెట్టింది.

ఇవే తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page