తెలుగులో ఎంతమంది హీరోస్ ఉన్న ఎన్టీఆర్ స్టైల్ వేరు. ఏ పాత్ర ఇచ్చిన దాన్ని చీల్చిచెందాలగల ఈ తరంలో ఏకైక హీరో జూనియర్.ఎన్టీఆర్. 18ఏళ్లకే “ఆది” లాంటి సినిమా చేయాలన్న, 20ఏళ్లకే “సింహాద్రి” లాంటి సినిమా చేయాలన్న, 25ఏళ్లకే పొలిటికల్ స్పీచెస్ తో జనం మధ్యలోకి వచ్చి అదరకొట్టాలన్న అది కేవలం ఎన్టీఆర్ వాళ్ళ మాత్రమే సాధ్యం. తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి లాంటి పెద్ద కుటుంబంలో పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఏమి అంత సాఫీగా సాగిపోలేదు. నిజానికి ఎన్టీఆర్ జీవితంలో ఎన్ని గొప్ప మైలురాళ్ళు ఉన్నాయో అన్నే చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. నందమూరి తారక రామారావు గారి మనవడిగా పుట్టిన తాను ఈ స్థాయి వరకు వచ్చాడంటే కేవలం అతని కృషి పట్టుదలతోనే.
హీరో అయినా మొదట్లో పొట్టోడు ఇతను హీరో ఏంటి అని ఎగతాళి చేశారు. కానీ అలా అన్న వాళ్ళ చేతే “సింహాద్రి” సినిమాలో విలన్స్ ని వెంటపడి నరుకుతుంటే సింగమలై అన్న అంటూ జైజైలు కొట్టించుకున్నాడు. “రాఖీ” సినిమాలో బాగా బొద్దుగా ఉన్నాడు ఎన్టీఆర్ హీరో మెటీరియలే కాదన్నారు. కట్ చేస్తే సంవత్సరం తిరిగే సరికి సన్నబడి “యమదొంగ” సినిమా లో యంగ్ యముడి విన్యాసాలకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ లో కామెడీ టైమింగ్ లేదు అన్నారు. “అదుర్స్” సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు. వరుసగా ఐదేళ్ల పాటు డబల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చి ఇంకా ఎన్టీఆర్ పని అయిపోయిందనిపించుకున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ ఐదేళ్లు డబల్ హ్యాట్రిక్ బ్లాక్బస్టర్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి బ్రేక్ ఈవెన్ లేదన్నారు. “ఆర్. ఆర్. ఆర్” సినిమాతో రామ్ చరణ్ తో కలిసి 1000కోట్లు కొట్టి ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఇలా మీరు ఎన్టీఆర్ ఈ పాత్ర చేయలేదు అని చెప్పండి. నెక్స్ట్ సినిమాతో అది చేసి చూపిస్తాడు. తనలోని నెగటివిటీని కూడా పాజిటివ్ గా మార్చుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్. అందుకే ఈరోజు ఎన్టీఆర్ దేశంలోనే వన్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్టర్స్ లో ఒకరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
బెస్ట్ యాక్టర్ మాత్రమే కాదు లక్కీచార్మ్ కూడా !
ఎన్టీఆర్ కేవలం బెస్ట్ యాక్టర్ మాత్రమే కాదు లక్కీచార్మ్ కూడా. ప్లాప్స్ లో ఉన్న డైరెక్టర్స్ ని ఎన్నోసార్లు ఆదుకున్నాడు. పూరి జగన్నాధ్ కి “టెంపర్” , సుకుమార్ కి “నాన్నకు ప్రేమతో”, బాబీ కి “జై లవ కుశ”, త్రివిక్రమ్ కి “అరవింద సమేత వీర రాఘవ” ఇలా వీళ్ళందరూ ఎన్టీఆర్ తో సినిమా చేయకముందు ఫ్లాప్స్ లో ఉన్న వాళ్లే మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా చేశాకే హిట్ ట్రాక్ ఎక్కారు. ఇప్పుడు లేటెస్ట్ గా కొరటాల శివ కూడా ఫ్లాప్స్ లో ఉన్న దర్శకుడే. ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కొరటాల శివ కి కూడ మంచి హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ మనల్ని ఇలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మా filmcombat వెబ్ సైట్ తరుపున మరొక్కసారి “తారకరామునికి జన్మదిన శుభాకాంక్షలు”.