- Advertisement -spot_img
HomeMoviesఅల్లరి నరేష్ "బచ్చల మల్లి" ప్రోమో టీజర్ రివ్యూ - FilmCombat

అల్లరి నరేష్ “బచ్చల మల్లి” ప్రోమో టీజర్ రివ్యూ – FilmCombat

- Advertisement -spot_img

అల్లరి నరేష్ అనగానే గుర్తొచ్చేది హాస్యాస్పద చిత్రాలే. తన తండ్రిగారి బాటలోనే హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ఆయన, సరైన గుర్తింపు రాక ఒక రెండు మూడు చిత్రాలు వేరే పంధాలో ప్రయత్నించి మెప్పించారు. కానీ మళ్ళీ తనకి ఎంతో అచొచ్చిన హాస్యాస్పదమైన కథాంశంతో “ఆ ఒక్కటీ అడక్కు” అనే చిత్రం ద్వారా మన ముందుకి వచ్చిన ఆయన అంతగా మెప్పించకపోయినప్పటికీ ఒకమాదిరి పరవాలేదనిపించారు. ఇప్పుడు ఆయన నుంచి ఇంకొక కొత్త చిత్రం రాబోతోంది. పోస్టర్ చూడటానికి మాస్ అవతారంలో ఉన్నప్పటికీ చిత్రానికి సంబందించిన ప్రోమో టీజర్ మాత్రం నరేష్ గారి మార్క్ కామెడీ తోనే నిండి ఉంది.

“బచ్చల మల్లి” అనే పేరుతో ఆయన నుంచి ఒక కొత్త చిత్రం రాబోతోంది. ఆ వివరాలని తెలియజేస్తూ ఒక ప్రోమో వీడియో విడుదల చేసారు. నరేష్ గారు గుబురు గడ్డంతో సిగరేట్ కాలుస్తూ ఒక రిక్షా మీద మాస్ పోస్ లో కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక గ్రామదేవత విగ్రహం కూడా కనిపిస్తోంది. వైవిధ్యమైన పద్దతిలో చిత్రానికి సంబందించిన సాంకేతిక విభాగానికి సంబందించిన అందరినీ వినూత్న పద్దతిలో పరిచయం చేసారు. సుబ్బు మంగదేవి దర్శకులుగా చేస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండ, బాలాజి గుట్ట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా, చోటా కే ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్ గారితో పాటుగా రావు రమేష్ గారు, హరి తేజ, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. చూస్తుంటే ఈసారి నరేష్ గారికి ఒక మంచి హిట్ దక్కేలనే కనపడుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page