చాలా రోజులకి మనకి ఎంతో ఇష్టమైన సినిమా థియేటర్ దెగ్గర సందడి మొదలవబోతోంది. చాలా రోజుల నుంచి మంచి చిత్రాల విడుదల లేక విలవిల లాడిన థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో సందడికి సిద్ధం అవ్వబోతున్నాయి. గత వారం విడుదల అయిన రెండు చిన్న చిత్రాలు సైతం సందడి చెయ్యటంలో విఫలం అయినప్పటికీ, టాలీవుడ్ కి మేమున్నాం అంటూ వచ్చేస్తున్నారు యంగ్ హీరోలు కార్తికేయ, విశ్వక్సేన్ లు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో హీరోగా చేస్తున్నారు కార్తికేయ. RX 100 తరువాత అంతటి విజయం నోచుకోని ఈయన ఒక స్పోర్ట్స్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ “భజే వాయు వేగం” తో మన ముందుకి వస్తున్నారు. ఐశ్వర్య మీనన్ ఆయన సరసన నటిస్తున్నారు. బొమ్మాళి రవి శంకర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన విడుదలకి సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఎప్పటినుంచో విడుదల చేద్దామని వాయిదాలమీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నా మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం “గ్యాంగ్స్ అఫ్ గోదావరి”. ఇది కూడా ఒక పొలిటికల్ చిత్రమే. ఈ చిత్రంలో ఆయన సరసన మన అందరి ప్రియమైన రాధిక అక్క “నేహా శర్మ” నటిస్తున్నారు. అందాల తార అంజలి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నాజర్ గారికి చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నది ఈ చిత్రంలో. పాటల రచనా సాముద్రికుడు “కృష్ణ చైతన్య” దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం కూడా ఈ నెల మే 31వ తేదీన మన ముందుకు రాబోతోంది. రెండు చిత్రాలూ యంగ్ హీరో వి కావటం, కొంచం విరామం తరువాత వాళ్ళ చిత్రాలు విడుదల అవ్వటం, మళ్ళీ థియేటర్లు ప్రేక్షకులతో నిండటానికి నిద్దంగా ఉండటం చూస్తుంటే, మన తెలుగు చిత్ర సీమకి మంచిరోజులు వచ్చేస్తున్నాయనిపిస్తోంది. వేచి చూడాలి మన ప్రేక్షక దేవుళ్ళు ఎలా ఆదరిస్తారో?