- Advertisement -spot_img
HomeMoviesTollywoodశ్రీ విష్ణు "స్వాగ్" టీజర్ రివ్యూ - FilmCombat

శ్రీ విష్ణు “స్వాగ్” టీజర్ రివ్యూ – FilmCombat

- Advertisement -spot_img

చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమా మీద ఉన్న మక్కువని అనుక్షణం తన ప్రతిభతో అందరికీ తెలియచేసి ఒక పెద్ద స్టార్ గా ఎదుగుతున్న నటుడు శ్రీ విష్ణు. తనదైన కామెడీ టైమింగ్ తో ఎప్పుడూ అదరకొడుతూనే ఉంటారు ఆయన. ఈ సంవత్సరం ఆయన నుంచి వచ్చిన ఒక కామెడీ చిత్రం “ఓం భీమ్ బుష్” అందరినీ ఆకట్టుకుంది. పాటలు బాగా అలరించాయి. తనకి బాగా కలిసొచ్చిన కామెడీ ట్రాక్ ని మాత్రమే ఉపయోగించి సక్సెస్ అవుదామని ఆయన ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక కొత్త తరహా చిత్రంతో మన ముందుకి రాబోతున్నారు. రితూ వర్మ కథానాయికగా చేస్తుండగా, ఒకప్పటి తార మీరా జాస్మిన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి “స్వాగ్” అని టైటిల్ పెట్టారు. ఒక విచిత్రమైన వేషధారణలో కనిపించి శ్రీ విష్ణు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు. మగవాళ్ళు, ఆడవాళ్ళ మధ్య జరిగే ఒక ఇగో ప్రాబ్లెమ్, వాటివల్ల వచ్చే సమస్యలతో తెరకెక్కించిన హాస్యాస్పద చిత్రంలాగా కనిపిస్తోంది. ఈ చిత్రం టీజర్ హీరోయిన్ రితూ వర్మ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసారు. అందులోని శ్రీ విష్ణు డైలాగ్స్, వేషధారణ కొత్తగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది, విశ్వ ప్రసాద్ గారు నిర్మాత. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. దక్షా నాగార్కర్, శరణ్యా ప్రదీప్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వేచిచూద్దాం ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో శ్రీ విష్ణు గారు. కానీ ఆయన కథలు ఎంచుకునే విధానంని మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం. వైవిధ్యమైన అంశాలతో ఎప్పటికప్పుడు మనముందుకు వస్తున్న శ్రీ విష్ణు గారికి ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page