- Advertisement -spot_img
HomeMoviesTollywoodప్రేక్షకులు సినిమాని చూసే విధానం మారాలి - FilmCombat

ప్రేక్షకులు సినిమాని చూసే విధానం మారాలి – FilmCombat

- Advertisement -spot_img

గెలుపు ఓటములు ఎప్పుడు ఎలా నిర్ధారణ అవుతుందో మనకి తెలియదు. మన అందరం ఎవరి జీవితం వాళ్ళకి నచ్చినట్టుగా బతకలేం. చాలా వరుకు ఒకరు నిర్ధారించిన విధానంలోనే నడవటానికి అలవాటు పడ్డాం. ప్రస్తుతానికి చిత్ర రంగం యొక్క ధోరణి అలానే కనిపిస్తోంది. కాలానికి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా కథలు కొన్ని వస్తున్నప్పటికీ వాటికి కావలసిన ప్రోత్సాహం ప్రేక్షకుల నుంచి రావట్లేదు. ఒకప్పటి పాత చింతకాయ ధోరణిలోనే ఆలోచిస్తున్నారు చాలా మంది. అలాంటి ఆలోచనా విధానమే కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 మీద ప్రభావం చూపిస్తోంది. ఏ చిత్రం లోనైనా లోటుపాట్లు ఉంటాయి. అది ఒక దర్శకుడి ఆలోచనా విధానం బట్టి ఉంటుంది. కానీ భారతీయుడు 2 చిత్రంలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ కొన్ని వర్గాల వాళ్ళు పెదవి విరుస్తున్నారు. ఈనాటి ఈ విశ్లేషణలో భారతీయుడు 2 మీద ఎందుకు అంత విభిన్నమైన అభిప్రాయాలూ బయటకొస్తున్నాయో తెలుసుకుందాం.

FilmCombat ఈ చిత్రానికి 3.75/5 రేటింగ్ ఇచ్చింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ విశ్లేషణ థియేటర్ లో ప్రత్యక్షంగా కొందరు వీక్షకులు మాట్లాడిన అంశాల గురించి ప్రస్తావిస్తూ వివరిస్తున్నాం. ఇందులో మా విశ్లేషణ కూడా జత చేర్చబడింది.

ప్లస్ పాయింట్స్:

  1. కథ: ఇది చాలా అద్భుతమైన కథ. ఇప్పటిదాకా చూడని అంశం. సమాజం బాగుండాలి అంటే ముందు మన ఇల్లు బాగుండాలి అని చాలా చక్కగా చెప్పారు. మొదటి పార్ట్ వలెనే లంచం అని ఒక్క కారణంతో ఈ చిత్రం నడవదు.
  2. కథనం: కొన్ని సన్నివేశాలలో వివిధ ప్రదేశాలలో సమాంతరంగా కొన్ని సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూపించిన విధానం కూడా బాగున్నాయి. ఉదాహరణకి ప్రీ-ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం. ఒక రాష్ట్రంలో సేనాపతి ఒక వ్యక్తిని చంపుతా ఉంటారు. కానీ అదే సమయంలో సిద్ధార్థ్ ఇంకా తన స్నేహితుల దగ్గర ఇంకొక సన్నివేశం నడుస్తూ ఉంటుంది. పోలీస్ అధికారి బాబీ సింహ దగ్గర ఇంకొక సన్నివేశం నడుస్తూ ఉంటుంది. మూడిటిని సమాంతరంగా చూపిస్తారు.
  3. పాత్రలకి ఇచ్చిన విలువ: ఒక్కో పాత్రకి ఒక్కో విలువ ఉంటుంది ప్రతీ చిత్రంలో. కానీ కొన్నిసార్లు చాలా మంది నటులు ఉన్నప్పటికీ వాళ్ళు ఉండకపోయినా పెద్ద ప్రమాదం ఏమి లేదు అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ప్రతీ చిన్న పాత్రకి ఒక విలువ ఉంది. ఆ పాత్రలు తెరమీద ఉన్నంతసేపు వాటికి సంబందించిన విలువ కనిపిస్తూనే ఉంటుంది.
  4. యువతని మేల్కొలిపే అంశం: ఈ చిత్రం ముఖ్యంగా ఒక సేనాపతి గురించి కాదు. మనకి స్వతంత్రం తీసుకొచ్చిన యోధుల్లో ఒకరైన సేనాపతికి ఈ కథకి ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది తప్ప ఇంకేమి ఉండదు. అది నిజంగా మెచ్చుకోవలసిన అంశం. యువతకి కావాల్సిన అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి సిద్ధార్థ్ ఇంకా తన ఫ్రెండ్స్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ పేరు “బార్కింగ్ డాగ్స్ ” దాని అర్థం మొరిగే కుక్కలు. వాళ్ళు నిజాన్ని బయటపెట్టాలి అనుకున్నారు కానీ వాళ్ళని వాళ్లు మొరిగే కుక్కలు అనుకోవటంలో ఎలాంటి బాధ కానీ, సంకోచం కానీ చూపించలేదు. వాళ్ళని వాళ్ళు విశ్వాసం ఉన్నవాళ్లు అని నిరూపించుకున్నారు.
  5. విరమించని పోరాటం: ఈ సమాజం తనని ఎంత అసహ్యించుకున్నా కూడా తనలాంటి ఎంతో మంది యోధులు కస్టపడి సాధించిన స్వతంత్ర భారతాన్ని పట్టిపీడిస్తున్న ఈ హింసాత్మక ధోరణి అంతా ప్రక్షాళన చెయ్యాలని కంకణం కట్టుకుని అంత పెద్ద వయస్సులోకూడా పోరాడారు సేనాపతి. తనని తప్పుపట్టినప్పటికీ తనకి ఉన్న బాధ్యతని నిర్వర్తించడానికి పూనుకున్న ప్రక్రియ ఇప్పటి యువతరానికి చాలా అవసరం.
  6. బాధ్యత: మనకి సొంతం అనుకున్న వ్యక్తులని ఎంతో కస్టపడి కాపాడుకుంటూ వస్తున్నాం. అదే మనం నివసిస్తున్న ఈ సమాజం కూడా మనదే అని మనం గుర్తించాలి. ఈ చిత్రం మనకి ఆ విషయాన్నీ గుచ్చినట్టు చెబుతుంది. సమాజంలో మనమే కాదు కోట్లాను కోట్లమంది ఉన్నారు. ప్రతిఒక్కరికీ వాళ్ళ బాధ్యతలని గుర్తుకు చేస్తుంది ఈ చిత్రం.

మైనస్ పాయింట్స్:

  1. సేనాపతి పాత్రకి జరిగిన అవమానం: సేనాపతి అనే పాత్రని మనం అందరం మనసులో గొప్ప పాత్రగా ముద్ర వేసుకున్నాం, అలాంటి పాత్రకి ఒక సన్నివేశంలో ప్రజలు చేసిన అవమానం, అది చూపించిన విధానం ఒక్క క్షణం ఆయనని ప్రతినాయకుడిని చేసింది.
  2. సమాజాన్ని మార్చాలని ప్రయత్నించటం: సమాజాన్ని మార్చేయాలని చాలా అంశాలని ఒకేసారి చూపించే ప్రయత్నం చేసారు. ఉదాహరణకి సినిమా మొదట్లో సిద్ధార్థ్ ఇంకా తన ఫ్రెండ్స్ వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెట్టిన అంశాలు.

థియేటర్ రెస్పొన్సెస్:

సినిమా మొదట్లో టైటిల్ పడ్డప్పుడు, “కమ్ బ్యాక్ ఇండియన్” సాంగ్ దెగ్గర కొంచం సందడిగా అరిచారు అభిమానులు. ఎప్పుడైతే సేనాపతి పాత్ర, ప్రేక్షకులు అనుకున్నట్టుగా కత్తి తీసుకుని అందరినీ చంపకుండా మన ఇంటినుంచే అన్నీ మారుద్దాం. మన కుటుంబాన్ని శుభ్రం చేసుకుందాం అనేటప్పటికి నవ్వుతున్నారు. ఎప్పటికీ ఈ ప్రేక్షకులకి సేనాపతి అంటే ఆ పాత కత్తి తీసుకుని లంచం తీసుకున్న వాళ్ళని చంపేవాడే కానీ మార్పు తెచ్చేవాడు అవ్వక్కర్లేదు అని అనిపించింది. కొన్ని చోట్ల కమల్ గారి ఉన్నతమైన డైలాగ్స్ కి కూడా నవ్వుతున్నారు. ఆ డైలోగ్స్ ముఖ్యంగా యువతని ఉద్దేశించి మాట్లాడినప్పుడు. సంగీతం కూడా రెహ్మాన్ గారితో పోల్చటం. అప్పటి రోజులకి అప్పటి కథకి తగ్గట్టుగా చేసారు. ఇప్పుడు కథ మొత్తం యువత గురించి ఉంటుంది. దానికి తగ్గట్టుగా యూత్ పల్స్ తెలిసిన అనిరుధ్ ని తీసుకున్నారు. మనం అందరం ఒకటి గుర్తించాలి, చిత్రానికి సంబంధించి పని చేసే ప్రతి ఒక్క వ్యక్తి కథకి తగ్గట్టుగానే తీసుకొనబడతారు . పాటల మీదకూడా కామెడీ చేస్తున్నారు జనాలు. ఇలాంటివి చెయ్యటం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ , కొంచం వైవిధ్యమైన రివ్యూస్ వచ్చినప్పటికీ మంచిగానే థియేటర్స్ నిండుతున్నాయి. అందరూ మూడోవ పార్ట్ కోసం వెయిటింగ్. వేచి చూడాలి ఎప్పుడు విడుదల అవుతుందో.

ఆర్టికల్ బై : సాయిరాం తాడేపల్లి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page