రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
చిత్రం: ది బర్త్ డే బాయ్
విడుదల తేదీ: 19.జులై.2024
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ప్రతి కుటుంబాన్ని గుండె లోతుల్లో కదిలించే సినిమా “ది బర్త్ డే బాయ్”.
నటీనటులు: రవి కృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్ మల్లా, మణివాక, రాజా అశోక్, విక్రాంత్ వేద, సాయి అరుణ్, రాహుల్ చిలమ్ మరియు ఇతరులు.
ఎడిటర్: నరేష్ అదుపా
డిఒపి: రాహుల్ మాచినేని
సంగీత దర్శకుడు: ప్రశాంత్ శ్రీనివాస్
ప్రొడ్యూజర్: భరత్ ఇమ్మలరాజు
రచయిత మరియు దర్శకుడు: విస్కీ దాసరి
మణివాక, రాజా అశోక్, విక్రాంత్ వేద, సాయి అరుణ్, రాహుల్ చిలమ్ ఐదుగురు కొత్త కుర్రాళ్ళ తో ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ది బర్త్ డే బాయ్”. విరూపాక్ష ఫెమ్ “రవి కృష్ణ” ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి భరత్ ఇమ్మలరాజు ప్రొడ్యూజర్ గా, విస్కీ దాసరి యువ దర్శకత్వం అందించారు. ఇప్పటికే విడుదలైన, ఈ చిత్రం ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి అశేష ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రం జులై 19న థియేటర్ లో విడుదలవుతున్న సందర్భంగా, ముందు రోజు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ప్రీమియర్ షో నిర్వహించారు.
కథ:
బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి (విక్రాంత్ వేద, మణివాక, రాజా అశోక్, సాయి అరుణ్, రాహుల్ చిలమ్) ఇండియా లో, ఈ ఐదుగురు స్కూల్ ఏజ్ నుంచి మంచి స్నేహితులగా ఎదుగుతారు. పై చదువులు కోసం వెంకట్(రాజా అశోక్) ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యిన డాక్టర్ ప్రవీణ్(సమీర్ మళ్ళా) నివాసంలో ఈ ఐదుగురు కలిసి అమెరికా లో ఉంటారు. ఒక రోజు బాలు(విక్రాంత్ వేద) బర్త్ డే కావడంతో వెంకట్(రాజా అశోక్) తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ ప్లాన్ చేస్తాడు.
ఆ పార్టీలో అందరు పీకల దాక తాగి బాలుని సరదాగా కొడుతుంటారు. శృతి మించిన సరదా అవ్వడంతో, వాళ్ళ చేతుల్లో బాలు (విక్రాంత్ వేద) మరణిస్తాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అప్పటికే అమెరికా లో, సెట్టిల్ అయ్యి ఉన్న అర్జున్ (మణివాక) సొంత అన్నయ్య అయ్యిన లాయర్ భరత్ (రవికృష్ణ)ను అర్దరాత్రి పిలిపిస్తారు. అలాగే, ఈ విషయాన్ని ఇండియా లో ఉన్న బాలు పేరెంట్స్ కి చెప్పడంతో (ప్రమోదిని, రాజీవ్ కనకాల) ఇద్దరు అమెరికాకు వస్తారు. ఈ క్రమంలో అందరు కలిసి బాడీని ఏం చేయాలో ప్లాన్ చేస్తారు.
అసలు బాలు ఎలా చనిపోయాడు? శృతి మించిన సరదా వల్ల చనిపోయాడా? లేదంటే ఎవ్వరైనా కావాలని చంపేసారా? బాడీ ని మాయం చేయడానికి ఆ నలుగురు బాలు తల్లి తండ్రులని ఎలా కన్విన్స్ చేసారు? యు.యస్ లో పోలీస్ లకి చిక్కకుండా బాడీ ని ఎలా మాయం చేసారు? ఈ సినిమాలో లాయర్ భరత్ (రవికృష్ణ), డాక్టర్ ప్రవీణ్(సమీర్ మళ్ళా) పాత్రలు ఏంటి? అనేది పూర్తిగా తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండ సినిమా థియేటర్ లో చుడాలిసిందే?
విశ్లేషణ: డైరెక్టర్ విస్కీ దాసరి స్వయానా తన మిత్రుడు రియల్ లైఫ్ లో జరిగిన నిజ జీవిత గాధ, కథ ఆధారంగా ఈ చిత్రం యొక్క సారాంశం, నీతి, నైతిక విలువులు మరియు కొన్ని వాస్తవాలు ప్రేక్షకులకి తెలియాలనే ఉద్దేశంతో ఎంతో డేరింగ్ గా, తాను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే రిస్క్ లో పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రాన్ని ప్రజల దాకా తీసుకొచ్చినందుకు ముందుగా అభినందించాలి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లో తాను ఫ్రెమ్ లో ఉన్నప్పటికీ, నిజ జీవితాన్ని చిత్రంగా మలిచే టప్పుడు ఒక వ్యక్తి గా, మిత్రుడి గా ఎంతగా కుమిలిపోయుంటాడో ఈ చిత్రం చూస్తే మీకు అర్ధం అవ్వుతుంది…..
ఇకపోతే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్రెండ్స్ అందరు కలిసి బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న తీరు చూసే ప్రేక్షకుడి హృదయాలని కలిచి వేస్తుంది. ఎందుకంటే, ఆ సీన్స్ చూస్తున్నంత సేపు యవ్వనంలో మనకి కూడా ఇలా జరిగింది కదా! మనం కూడా మన తోటి ఫ్రెండ్స్ తో ఇలా ప్రవర్తించాం కదా! అనిపిస్తుంది. అప్పుడు, ఆ నిమిషం మన అందరి గుండె బరువెక్కుతుంది. అంతలా, ఆ సీన్స్ ని దర్శకుడు చిత్రీకరించిన విధానం అద్భుతం. కాకపోతే అక్కడక్కడా నటుల నుంచి పెర్ఫామెన్స్ కాస్త తడబాటు అనిపించినప్పటికీ మ్యానేజ్ బుల్ అనిపించింది. లాయర్ భరత్ (రవికృష్ణ) స్క్రీన్ మీద పెట్టే టెన్షన్ చూసి సగటు ప్రేక్షకుడికి కూడా హై టెన్షన్ క్రియేట్ అవ్వుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది.
సెకండ్ హాఫ్ మొదట్లో జరిగే చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్ట్ లు చూసాక, డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని డీల్ చేసిన విధానం చూసి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలిసిందే. ఎందుకంటే, ఏ మాత్రం తేడా వచ్చిన సినిమా బ్యాలెన్స్ తప్పుతుంది. కొన్ని సీన్స్ చాలా ఎమోషన్స్ కి గురి చేస్తాయి. ముఖ్యంగా, ఫ్లాష్ బ్యాక్ అండ్ మదర్ & ఫాదర్ తో సాగే సీన్ టాప్ నాచ్ ఉంటాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది. కాకపోతే, ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త బెటర్ గా చేయచ్చు అనిపించింది. అలాగే, యాక్టింగ్ చేసిన కుర్రాళ్ళు కొత్త వాళ్లే అయ్యినప్పటికీ పాస్ మార్క్స్ తో అందరు రాణించారు. సో, ప్రతి ఒక్కరు తమ ఫ్యామిలీస్ తో కలిసి సినిమా తప్పకుండా చుడండి.
నటి నటుల పెర్ఫామెన్స్:
బిగ్ బాస్ ఫెమ్ నటుడు ‘రవి కృష్ణ’ ముఖ్య పాత్ర పోషించి కథ ని ముందుకి నడిపిస్తూ అద్భుతమైన నటనని కనబర్చారు. సమీర్ మళ్ళా తన పాత్ర లో పరకాయ ప్రవేశం చేసాడు. రాజీవ్ కనకాల పాత్ర నిడివి తక్కువే అయ్యినప్పటికీ టాప్ నాచ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇకపోతే, ఆ ఐదుగురు ఫ్రెండ్స్ పాత్రలో నటించిన మణివక, రాజా అశోక్, విక్రాంత్ వేద, సాయి అరుణ్, రాహుల్ చిలమ్ తమదైన స్టైల్ లో అందరు ఎక్సలెంట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా, రాజా అశోక్ పాత్ర చాలా యూనిక్ గా ఉంటుంది.
సాంకేతిక విభాగం:
డైరెక్టర్ ‘విస్కీ దాసరి’ కథ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. కొన్ని సన్నివేశాలలో ఎమోషనల్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. క్లైమాక్స్ లో రాజీవ్ కనకాల పాత్రకి ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మేరకు పర్వాలేదు.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.