- Advertisement -spot_img
HomeMoviesTollywood"డబుల్ ఇస్మార్ట్" ట్రైలర్ రివ్యూ- పూరి ఈజ్ బ్యాక్!

“డబుల్ ఇస్మార్ట్” ట్రైలర్ రివ్యూ- పూరి ఈజ్ బ్యాక్!

- Advertisement -spot_img

చాలాకాలం గా హిట్ కోసం పూరి జగన్నాథ్ పరితపిస్తుండగా అందులో “లైగర్” వంటి భారీ డిజాస్టర్ తో ప్రమాదంలో పడిన పూరి కెరీర్ కి రామ్ పోతినేనిని భలే దొరికాడు. గతంలో కూడా దశాబ్దకాలంగా హిట్ చూడని పూరీజగనాథ్ కి రామ్ తో తీసిన “ఇస్మార్ట్ శంకర్” లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా “లైగర్” సినిమా దెబ్బకి పీకల్లోటు కష్టాలో ఉన్న కూరుకుపోయిన పూరి జగన్నాథ్ కి మరోసారి ఆదుకునేలాగే ఉంది. మరోసారి పూరి జగన్నాథ్- రామ్ కాంబోలో వస్తున్నా “డబుల్ ఇస్మార్ట్” సినిమా ట్రైలర్ ఈరోజు గ్రాండ్ రిలీజ్ చేశారు. చాలా కాలంగా మిస్ అయినా పూరి మార్క్ ఈ “డబుల్ ఇస్మార్ట్” ట్రైలర్లో స్పష్టంగా కనిపిచింది. ఆ డైలాగ్స్, ఆ పంచస్ మరోసారి పాత పూరి జగన్నాధ్ ని గుర్తుకు చేస్తున్నాయి.

రామ్ పోతినేని నే ట్రైలర్ కి ప్రధాన హైలెట్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో సినిమా మొత్తం అల్లాడించాడు అని ట్రైలర్లోనే తెలిసిపోతుంది. హీరోయిన్ కావ్య థాపర్ తన గ్లామర్ షో తో ట్రైలర్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా విలన్ సంజయ్ దత్ మరో ప్రధాన ఆకర్షణ. రామ్- సంజయ్ దత్ మధ్య జరిగే వార్ సన్నివేశాలు చూస్తుంటే సినిమా చూడాలన్న క్యూరియాసిటీ మరింత పెంచింది. అలీ కామెడీ కి కూడా ట్రైలర్ లో చోటు కల్పించారు. మణిశర్మ మ్యూజిక్ కూడా మరో అదనపు ఆకర్షణ ట్రైలర్ కి. ఓవరాల్ గా చెప్పుకుంటే పూరి గత కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ “డబుల్ ఇస్మార్ట్” లో పూరి మార్క్ గట్టిగ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడులవుతున్న ఈ సినిమా విజయం అటూ పూరి జగన్నాథ్ కి ఇటూ రామ్ కి ఇద్దరికీ చాలా అవసరం. ముఖ్యంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి లకి ఈ సినిమా విజయం మరింత అవసరం. “లైగర్” సినిమాతో భారీ నష్టాలపాలవడమే కాకుండా ఘోర అవమానాల పాలయ్యారు ఇద్దరు. అందుకే ఇప్పుడు ఈ “డబుల్ ఇస్మార్ట్” సినిమా పైనే గంపెడాశలు పెట్టుకున్నారు ఇద్దరు. “డబుల్ ఇస్మార్ట్” సినిమా హిట్టైతే “లైగర్” సినిమా వివాదాల నుంచి ఎంతో కొంత బయటపడతారు ఇద్దరు. మరి చూద్దాం ట్రైలర్ లో కనిపించిన పూరి మార్క్ సినిమాలో కనిపిస్తుందో లేదో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page