మహేష్ బాబు ఏం చేసిన ట్రేండింగ్ గానే ఉంటుంది. ఆయన సినిమాలు చేసిన, యాడ్స్ చేసిన, స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన ప్రతిదీ సంచలనమే. అందుకు తగట్టే మహేష్ బాబు ఫాన్స్ కూడా ఉంటారు. మహేష్ బాబు ని ప్రతి విషయంలో టాప్ లో ఉంచుతారు. రెండేళ్ల క్రిందట “పోకిరి” సినిమా రీ-రిలీజ్ చేస్తే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో ట్రెండ్ సెట్ చేశారు. ఈ సినిమా తర్వాత రీరిలీజ్ ట్రెండ్ మొదలయింది. ప్రతి హీరో యొక్క పాత హిట్ సినిమాలు రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. గతంలో మహేష్ బాబు “పోకిరి”, “ఒక్కడు” , “బిజినెస్ మ్యాన్” సినిమాలు రీరిలీజ్ చేయగా, మూడు చిత్రాలు అదిరిపోయే కలెక్షన్స్ నమోదు చేశాయి. ఈసారి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా “మురారి” సినిమా రీరిలీజ్ చేస్తున్నారు.
“మురారి” చిత్రం మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ హిట్. సినిమాలోని సాంగ్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఎవర్గ్రీన్. మహేష్ బాబు – సోనాలీ బెంద్రే కాంబినేషన్ నే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. 2001లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. 23ఏళ్ళ తర్వాత కూడా “మురారి” సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నమోదవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ నే నిదర్శనం. మురారి రీరిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏకంగా 2.02 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు రీరిలీజ్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసిన “ఖుషి” సినిమా కలెక్షన్స్ బ్రేక్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. “గుంటూరు కారం” ప్లాప్ అయినప్పటికీ “మురారి” అడ్వాన్స్ బుకింగ్స్ తో సూపర్ స్టార్ కి పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు ఫాన్స్. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇన్ని రికార్డ్స్ బద్దలుకొట్టిన “మురారి” రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో.