- Advertisement -spot_img
HomeReviewsకమిటీ కుర్రోళ్ళు మూవీ రివ్యూ: Committee Kurrollu Movie Review #FilmCombat

కమిటీ కుర్రోళ్ళు మూవీ రివ్యూ: Committee Kurrollu Movie Review #FilmCombat

- Advertisement -spot_img

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

చిత్రం: కమిటీ కుర్రోళ్లు
విడుదల తేదీ: 09.08.2023
రేటింగ్: 3.25/5
బాటమ్ లైన్: A Wholesome Journey of Love, Humor, and Emotion.

నటి నటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్. మహిళా ప్రధాన తారాగణం: రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి….తదితరులు

ఎడిటర్: అన్వర్ అలీ
సంగీత దర్శకుడు: అనుదీప్ దేవ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎదురోలు రాజు
నిర్మాతలు: పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక
మూవీ బ్యానర్లు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్
డైలాగ్ రైటర్స్: వెంకట్ సుబాష్ చీరాల, కొండల్రావు అడ్డగళ్ల
రచన & దర్శకత్వం: యదు వంశీ

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు ‘య‌దు వంశీ’ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేసిన, ఈ చిత్రం ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 9న గ్రాండ్ గా దాదాపు 300+ థియేటర్స్ లో రీలిజ్ అయ్యిన సంధర్భంగా సినిమా గురించి మన “ఫిల్మ్ కాంబాట్” రివ్యూ ఏంటో చూసేద్దాం!

కథ:
గోదావ‌రి జిల్లాల్లోని ప్ర‌తి ప‌న్నెండేళ్ల‌కు ఓ ప‌ల్లెటూరులో జాత‌ర ఆనవాయితీ. అయ్యితే, గ‌త‌ జాత‌ర‌లో
11మంది కమిటీ కుర్రాళ్ళు లో సుబ్బు(త్రినాథ్ వర్మ), విలియం(ఈశ్వర్ రాచిరాజు) మధ్య కులాలు, రిజ‌ర్వేష‌న్ల గొడ‌వ‌ జరుగుతుంది. ఆ గొడవలో ఊరి జాతర బ‌లిచాట‌కు ఎదురు వెళ్లటంతో 11 మందిలో ఒకరు చనిపోతారు. అలా చనిపోవటంతో స్నేహితుల & కుటుంబాల మధ్య దూరంతో పాటు ఊరిలో పలు మార్పులు జరుగుతాయి. మళ్ళీ ప‌న్నెండేళ్ల కి వచ్చిన జాతరకు విడిపోయిన ఫ్రెండ్స్ & ఊరు మొత్తం కలిసి జాతర కొనసాగించారా? లేదా? అనేది తెలియాలి అంటే మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే?

విశ్లేషణ: ఊరు.. కుర్రోళ్లు.. ప్రేమ..భావోద్వేగాలు..అన్ని రకాల అంశాలతో దర్శకుడు తన ఊరిలో జరిగే జాతరను బేస్ చేసుకుని తీసిన చిత్రం “కమిటీ కుర్రోళ్లు”.

సినిమా ఓపినింగ్ పంచాయతీ తో స్టార్ట్ అయ్యి, మెల్లగా ప్రతి ఒక్కరిని తమ బాల్యాన్ని గుర్తు చేస్తుంది. బాల్యంలో జరిగే సన్నివేశాలు ఎంతో డెప్త్ గా రీసర్చ్ చేసి చూపించిన విధానం బాగుంది.

ముఖ్యంగా, 1/- సైకిల్ అద్దికి ఇవ్వటం. ఫ్రెండ్ ఇంట్లో డివిడి ప్లేయర్ తీసుకోవటం. గర్ల్ ఫ్రెండ్ కోసం ఫెవరెట్ హీరో సినిమా క్యాసిట్స్ తీసుకురావటం. అమ్మాయి పెద్ద మనిషి వీడియోస్, లేడి వాయిస్ కాల్స్, ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అనుకోవటం…అబ్బో ఇలాంటివి ఎన్నో సీన్స్ థియేటర్ లో చూస్తుంటే కడుపుబ్బా నవ్వుకోవటం ఖాయం.

ఫ్రెండ్స్ మధ్య సరదాగా సాగుతున్న టైంలో రిజర్వేషన్ టాపిక్ గురించి జరిగే సంభాషణలు ఒకరిని ఒకరు విడిపోయేలా ఉద్రికృతంగా సాగుతాయి. 10నిముషాలు పాటు జరిగే ఇంటర్వెల్ ని డైరెక్టర్ ఎగ్జ్ క్యూట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్.

సినిమా మొత్తం మీద ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. సెకండ్ హాఫ్ లో సత్తయ్య ని ఫ్రెండ్స్ అందరు కలిసి పచ్చాతప్ప పడే సన్నివేశాలు సగటు ప్రేక్షకుడికి కన్నీరు తెప్పిస్తాయి.
పొలిశెట్టి బుజ్జి(సాయికుమార్‌) & శివ(సందీప్ సరోజ్)కి మధ్య సాగే రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు సన్నివేశాలు ప్రెజెంట్ జెనరేషన్ ని బాగా ఆకట్టుకుంటాయి.

కాకపోతే, సత్తయ్య జాతర కి వస్తాను అని ఈజీ గా యాక్సెప్ట్ చేయటం? ఫోన్ కాల్ లో ఫ్రెండ్ ని టీజ్ చేసింది ఓపెన్ చేయకపోవటం? క్లైమాక్స్ కి మంచి ముగింపు ఇవ్వచ్చు కదా! అన్నప్పటికీ, థియేటర్లో కుర్చున్నంత సేపు జాతరలో ఉండి సినిమాను చూస్తున్నట్టుగా నిజంగానే పూనకాలు వస్తాయి. ఓవరాల్ గా సినిమాని థియేటర్ లో తప్పకుండ చుడాలిసిన సినిమా. సో, డోంట్ మిస్ టూ వాచ్.

నటి నటులు పెర్ఫామెన్స్:
హీరోలు ప్రధాన తారాగణం: శివ(సందీప్ సరోజ్) సెట్టిల్డ్ పెర్ఫామెన్స్ ఇస్తూ, యాక్టింగ్ హీరో నాగ చైతన్య ని గుర్తు చేస్తుంటుంది. సుబ్బు (త్రినాధ్ వర్మ)గా క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశారు. కొన్ని సీన్స్ లో ఇచ్చిన పెర్ఫామెన్స్ హై లైట్. యశ్వంత్ పెండ్యాల టూ షేడ్స్ క్యారెక్టర్ లో హ్యాండ్సమ్ గా, మెచ్యూర్డ్ గా కనిపించి మెప్పించారు. ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, లోకేష్ కుమార్ పరిమి సినిమాలో ఎంతో విభిన్నమైన పాత్రలు చేసి నవ్వించి ఏడిపించేసారు.

హీరోయిన్స్ ప్రధాన తారాగణం: మాధురి(రాధ్యా సురేష్) పక్కింటి అమ్మాయి లా ఎంతో క్యూట్ గా పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. జ్యోతి(తేజస్వీ రావు) యాక్టింగ్ & స్క్రీన్ ప్రెజెన్స్ తెర మీద ఎంతో ప్రత్యేకం. టీనా శ్రావ్య, విషిక, తది తరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘యదు వంశీ’ ఎంచుకున్న కథ పాతదే అయ్యినప్పటికీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఎగ్జ్ క్యూట్ చేసిన విధానం సూపర్బ్. కొన్ని సన్నివేశాలలో ఎమోషనల్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. అనుదీప్ దేవ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమా కి ప్రాణం పోశాయి. క్లైమాక్స్ లో ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపించాయి.

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page