మహేష్ ఆ పేరులో కిక్ ఉంది, సెలబ్రేషన్ ఉంది, వైబ్రేషన్ ఉంది. తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్న మహేష్ బాబు స్టయిలే వేరు. అందం అనే పేరు వినిపిస్తే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. ఎన్నిసార్లు చూసిన తనివితీరని ఫేస్ మహేష్ బాబు సొంతం. మహేష్ బాబు జస్ట్ అలా ఒక చిన్న స్మైల్ ఇస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కనకవర్షం కురుస్తుంది. తన కెరీర్లో ఎన్నో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలని కూడా తన స్క్రీన్ ప్రెజన్స్ తో నిర్మాతలని గట్టెకించాడు. అందుకే హ్యాండ్సమ్ అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్లాంటోడు మహేష్ బాబు. అందరు నడిచే దారిలో నడవదు తన రూటే సపరేటు అన్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం. అందుకే మహేష్ బాబు సినిమా వచ్చిన సెన్సేషనే , పుట్టిన రోజు వచ్చిన సెన్సేషనే. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన తన కష్టం మీదే సూపర్ స్టార్ అయ్యాడు. మిగితా హీరోస్ తో పోలిస్తే మహేష్ బాబు ఫిలిం కెరీర్ కొంచం డిఫరెంట్ గా ఉంటుంది.
మహేష్ బాబు కెరీర్ మొత్తం పరిశీలిస్తే ఫ్యాక్షన్ సినిమాలు తెలుగునాట రాజ్యమేలుతున్న టైంలో “టక్కరిదొంగ” లో కౌబాయ్ గా చేసాడు. ఆ తర్వాత “ఒక్కడు” సినిమాతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా తీసి ఫ్యాక్షన్ సినిమాలలోనే సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. “నాని” లాంటి ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ సినిమా ని ప్రేక్షకులకి పరిచయం చేసాడు. అయితే సినిమా ప్లాప్ అయినప్పటికీ మంచి ఎక్స్పెరిమెంటల్ సినిమా గా ప్రశంసలు అందుకుంది. “అతడు” లో ప్రొఫెషనల్ కిల్లర్ గా, “పోకిరి”లో సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ గా, “సైనికుడు” లో సమాజం పై భాద్యత ఉన్న యువకుడిలాగా, “ఖలేజా” లో ఊరిని కాపాడే దేవుడిగా, “బిజినెస్ మాన్” సినిమాలో మాఫియా డోన్ గా, “సీతమ్మ వాకిట్లో సిసిమాల్లే చెట్టు” లో తమ్ముడిగా , “1” లో రాక్ స్టార్ గా, “శ్రీమంతుడు” లో ఊరిని బాగు చేసే ఒక శ్రీమంతుడిగా, “భరత్ అనే నేను” లో ముఖ్యమంత్రిగా, “సరిలేరు నీకెవరు” లో ఒక జవాన్ లాగా. చేసింది కేవలం 28 సినిమాలే అయినా ఇన్ని వేరియేషన్స్ చూపించిన నటుడు మరొకరు లేరు. అందుకే మహేష్ బాబు సినిమా వస్తుందండితే ప్రేక్షకులు ఎప్పుడు ఏదో కొత్తరకమైన అనుభూతికి లోనవుతారు.
“పోకిరి” తో సూపర్ స్టార్ గా!
మహేష్ బాబు సినిమాలో ది బెస్ట్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు “పోకిరి” సినిమా. 2006లో రిలీజైనా ఈ చిత్రం సాధారణమైన హిట్ కాదు. చరిత్రలోనే నిలిచిపోయే ఇండస్ట్రీ హిట్. పూరి జగన్నాథ్ రైటింగ్ కి, టేకింగ్ కి మహేష్ బాబు నట విశ్వరూపాన్ని బాక్సాఫీస్ కుదేలైపోయింది. ఏకంగా 500రోజులు పైగా మహేష్ బాబు బాక్సాఫీస్ ని ఉక్కిరిబిక్కిరి చేసాడు కలెక్షన్స్ తో. మహేష్ బాబు ని రాత్రికి రాత్రి సూపర్ స్టార్ ని చేసింది. పూరిజగన్నాథ్ ని స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిపింది. ఆ సంవత్సరంలో ఇండియన్ సినిమాస్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో రెండవ స్థానంలో నిలిచింది.
నిజ జీవితంలోనూ సూపర్ స్టారే!
మహేష్ బాబు కేవలం సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ఎంతోమంది చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేసి బ్రతికించాడు. ఇప్పటికి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎంతోమందిని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నాడు. సొంత ఊరిని దత్తకు తీసుకొని అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకే మహేష్ బాబు ని ఒక మనిషిగా కాదు ఆరాధ్య దైవంగా కొలుస్తారు చాలామంది. ఎలాంటి కాంట్రవర్సీస్ లో లేదు కాబట్టే ఈరోజు మహేష్ బాబు ని చచ్చేంతలా అభిమానిస్తున్నారు.
రాజమౌళి సినిమా పైనే అందరి కళ్ళు!
మామూలుగానే మహేష్ బాబు సినిమా కి థియేటర్స్ దద్దరిల్లుతాయి, బాక్సాఫీస్ బద్దలవుతాయి. మరి అలాంటి మహేష్ బాబు కి రాజమౌళి తోడైతే ఇంకా థియేటర్స్ దగ్గర జరిగే అరాచకం ఊహించటం కష్టం. అలాంటిదే జరగబోతుంది. రాజమౌళి తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ తో అనే నాలుగేళ్ల క్రిందటే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా అనౌన్స్ మెంట్ కోసం. అటు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం తన మాక్ ఓవర్ పై ద్రుష్టి పెట్టాడు. అతి త్వరలోనే చిత్ర అనౌన్స్ మెంట్ జరగొచ్చు. ఈ సినిమా హిట్ ఐతే మహేష్ బాబు రేంజ్ ఇంకా పదింతలవుతుంది. ఇన్నాళ్లు టాలీవుడ్ రికార్డ్స్ నే బద్దలుకొట్టిన మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా తో పాటు వరల్డ్ సినిమాస్ రికార్డ్స్ కూడా బద్దలుకొట్టడం ఖాయం.
మరి ఇంత ఘనమైన సినీ కెరీర్ కలిగిన మన ప్రిన్స్, తెలుగింటి సోగ్గాడు ఈరోజు తన 49వ పుట్టినరోజు జరుపుకుంటుంనందుకు గాను మన “film cobat” వెబ్సైట్ తరుపున హృదయపూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. మహేష్ బాబు ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని. ఇంకా ఎంతోమంది చిన్నారుల గుండెలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.