- Advertisement -spot_img
HomeReviewsసింబా మూవీ రివ్యూ: Simbaa Movie Review #FilmCombat

సింబా మూవీ రివ్యూ: Simbaa Movie Review #FilmCombat

- Advertisement -spot_img

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

చిత్రం: సింబా
విడుదల తేదీ: 09.08.2023
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: మెసేజ్ విత్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్

నటి నటులు: జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, గౌతమి, వసిష్ట సింహ, శ్రీనాథ్ మాగంటి, దివి వడ్త్యా, అనీష్ కురువిల్లా, కభీర్ సింగ్ తదితరులు.
ఎడిటర్: తమ్మిరాజు
సంగీత దర్శకుడు: కృష్ణ సౌరభ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్
నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్ రెడ్డి డి
మూవీ బ్యానర్: సంపంత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్
రచన: సంపత్ నంది
డైరెక్టర్: మురళీ మనోహర్

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులని నుండి అనుహ్య స్పందన రావడంతో పాటు, మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న రిలీజ్ సంధర్భంగా చిత్ర యూనిట్, ప్రత్యేకంగా ఒక రోజు ముందే ప్రెస్ షో నిర్వహించారు. ఈ సంధర్భంగా మన ఫిల్మ్ కంబాట్ రివ్యూ చూద్దాం!

కథ:
అనుముల అక్షిక (అన‌సూయ‌) ఓ సాధార‌ణ స్కూల్ లో టీచ‌ర్‌. సిటీ బడా హత్య కేసులో అక్షిక తో పాటు, మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేట్ చేస్తున్న జ‌ర్న‌లిస్ట్ ఫాజిల్‌ (శ్రీనాథ్‌)ని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ కేస్ ని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ అనురాగ్ (వ‌శిష్ట సింహా) ఆ ఇద్దరిలో కామన్ గా మ‌ర్డ‌ర్స్ చేసే ముందు ఇద్దరు వింతగా ప్రవర్తించడం అనేది గమనిస్తాడు. అక్షిక, ఫాజిల్ చేతుల్లో చంపబడ్డ ఆ ఇద్దరు బిజినెస్‌మెన్ పార్థ (క‌బీర్‌సింగ్ దుహాన్‌) & అతని తమ్ముడు మనుషులు కావడంతో ఇద్దరు రివెంజ్ ప్లాన్ చేస్తారు? చివరికి ప్లాన్ చేసిన అన్నా తమ్ముళ్లు చనిపోయారా? లేదంటే? అక్షిక, ఫాజిల్ చనిపోయారా? ఒక సాధారణ టీచర్ & జర్నలిస్ట్ మర్డర్స్ చేయడానికి రీజన్ ఏంటి? పోలీస్ ఆఫీస‌ర్ అనురాగ్ ఆ ఇద్దరిలో కనిపెట్టిన క్లూ ఏంటి? ఈ మ‌ర్డ‌ర్స్‌కు పురుషోత్త‌మ్ రెడ్డికి (జ‌గ‌ప‌తిబాబు) ఉన్న సంబంధం ఏమిటి? ఈ వ‌రుస హ‌త్య‌ల వెనుక ఉన్న మిస్ట‌రీని అనురాగ్ ఎలా ఛేదించాడు. అనేది తెలుసుకోవాలి అంటే మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే?

విశ్లేషణ: “సింబా” అంటే అడివికి రాజు సింహం. పైగా అమ్మవారి వాహనం అందరికి తెలిసిన విషయమే! కాకపోతే, ఇదే పాయింట్ ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా చిత్రీకరించి అడివిని కాపాడే సామాజిక వ్యక్తిగా సగటు ప్రేక్షకుడిని ఆలోచింప చేసే సైఫై థ్రిల్లర్‌ చిత్రమే ఈ సింబా..

ఇంట్రడక్షన్ లో హీరోయిన్ అనసూయ ని ఎంతో బాధ్యత గల టీచర్ గా సన్నివేశాలు చూపిస్తూ ప్రజలని ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆ తరువాత అనసూయ తో సాగే ఫైట్స్ సీన్స్ కన్విన్స్ గా లేకపోవటం…కొన్ని సీన్స్ కాస్త బోర్ ఫీల్ అనిపించినప్పటికీ….వెంటనే మరో సీన్స్ రావడంతో కాస్త ఊరట నిస్తుంది. శ్రీనాథ్ మాగంటి(ఫాజిల్) జర్నలిస్ట్ అనే పవర్ కార్డు ని ఎక్కడ యూజ్ చేసుకోలేదు. అసలు, ఎవ్వరు ఎవ్వరిని ఎందుకు చంపుతున్నారో ఎండ్ దాకా సస్పెన్స్ & ట్విస్ట్స్ క్యారీ చేసిన విధానం బాగుంది. అక్కడక్కడా “తలాగ్ దుమ్” అని వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెద్ద అసెట్. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో జగపతి బాబు తో సాగే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని హత్తుకునేలా ఉంటాయి. మానవుడు ప్రకృతి కి విరుద్ధంగా వెళ్తే, వెంటాడి…వేటాడైన సరే రివేంజ్ తీర్చుకోకుండా ప్రకృతి ఉండదు! అని చెప్తూ, సైఫై థ్రిల్లర్ రూపంలో చెప్పకనే చెప్పారు దర్శకుడు….ఓవరాల్ గా సినిమాని థియేటర్ లో తప్పకుండ చుడాలిసిన సినిమా. సో, డోంట్ మిస్ టూ వాచ్.

నటి నటులు పెర్ఫామెన్స్: సీనియర్ నటుడు జగపతి బాబు(పురుషోత్తం రెడ్డి) కథకి మూలకర్త గా వ్యవహరిస్తూనే అందరు మెచ్చేలా చక్కటి పాత్రని పోషించారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్(అక్ష) క్యారెక్టర్ ని ఒక కొత్త కోణంలో నటన చూడటంతో పాటు, ఫైట్స్ సీన్స్ లో మెప్పించారు. వసిష్ట సింహ(అనురాగ్) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కథని ముందుకి నడిపిస్తూ 100% న్యాయం చేసారు. శ్రీనాథ్ మాగంటి(ఫాజిల్) జర్నలిస్ట్ పాత్రకి మాత్రమే పరిమితం చేయకుండా, కథకి ఇతనే హీరో నా అనిపించేలా పాత్ర ఉంటుంది. గౌతమి, దివి వడ్త్యా, అనీష్ కురువిల్లా, కభీర్ సింగ్ తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.

సాంకేతిక విభాగం: ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌నే మెసేజ్‌కు బ‌యోలాజిక‌ల్ మెమోరీ అనే సైంటిఫిక్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ క‌థ‌ను రాసుకున్న విధానం బాగుంది. డైరెక్టర్ ‘మురళీ మనోహర్’ ఇంకాస్త స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ తో పాటు, సీన్స్ కన్విన్స్ గా చెప్పి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కృష్ణ సౌరభ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ మేరకు పర్వాలేదు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపించాయి.

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page