ఈ ఆగష్టు 15, టాలీవుడ్ లో మంచి ఉత్కంఠం రేపే సందర్భం రాబోతోంది. రెండు తెలుగు చిత్రాలతో పాటుగా ఒక తమిళ చిత్రం కూడా విడుదల అవ్వబోతోంది. ఈసారి మొదటగా మీ ఓటు ఎవరికి వేస్తారో చూస్కోండి మరి. విషయానికి వస్తే, ప్లాప్‌లతో ఉన్న రామ్, పూరి కలిసి ఒక మాస్ జాతర చిత్రం తెరకెక్కించి హిట్ కొట్టారు రెండేళ్ల ముందు అదే ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు అదే కలయికతో దానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. అదే టీం తో తెరకెక్కించారు పూరి గారు. ట్రైలర్ విషయానికి వస్తే కొంత పాజిటివ్ కొంత నెగటివ్ మాట్లాడుతున్నారు ప్రేక్షకులు. ఇదే రోజున మాస్ మహారాజ రవితేజ, తనని ఆరాధించే దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో “మిస్టర్ బచ్చన్” సినిమా కూడా విడుదల అవ్వబోతోంది. ఇప్పటికే విడుదల అయిన పాటలకి, టీజర్ కి, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చాయి. రవితేజ గురించి తెలిసిందేగా, ఒక పక్కా మాస్ పాత్ర పడితే ఒక ఊపు ఊపేస్తారని. మళ్ళీ ఒకప్పటి విక్రమ్ రాథోడ్ లాంటి మాస్ పాత్రకోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిటింగ్. ఇప్పుడు హరీష్ శంకర్ ఎలా రవితేజ గారిని చూపిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే , “ఐ ఆమ్ కమింగ్” అంటూ అదే తేదీన వచ్చేస్తున్నారు చియాన్ విక్రమ్. పా రంజిత్, విక్రమ్ కలయికతో అదే రోజు రాబోతోంది “తంగలాన్”. ఇది ఒక డిఫరెంట్ కథాంశం. విక్రమ్ గారి గెటప్ కొత్తగా ఉంది. మొదటిసారి విక్రంగారే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఎప్పటినుంచో వాయిదాపడుతూ వస్తున్న చిత్రం ఇది. అసలు ఈ తేదీకి బన్నీ, సుకుమార్ ల మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప రావాల్సిఉంది. కానీ అది వాయిదా పడటం వలన ఈ మూడు చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు నిర్ణయించుకోండి ప్రేక్షక దేవుళ్ళారా, మీ మొదటి ఓటు ఎవరికి. ఈ మూడు చిత్రాలు మంచి విజయాలు అవ్వాలని కోరుకుందాం. ముగ్గురికి సరైన హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ చిత్రాల విజయం వాళ్ళకి చాలా అవసరం.