నాని గారి గురించి ఏమని వర్ణిస్తాం. ఆయన స్థాయి, సత్తా వేరే లెవెల్. వివేక్ ఆత్రేయ గారితో రెండొవసారి కలిసి పనిచేస్తున్నారు నాని గారు DVV దానయ్య గారు నిర్మిస్తున్న ఈ చిత్రం పక్కా ఒక మాస్ ఎంటర్టైనర్. అదే “సరిపోదా శనివారం”. ఇది ఒక విభిన్నమైన కథాంశం. ఒక వ్యక్తికి వచ్చే అణుచుకోలేని కోపాన్ని మొత్తం ఒక రోజులో చూపిస్తాడు అదే శనివారం రోజున. ఆ వారం తనకి కోపం తెప్పించిన ప్రతీ అంశాన్ని తన డైరీలో రాసుకుని, వచ్చే శనివారం వాళ్ళ భరతం పడతాడు. ఇది ఒక విభిన్నమైన పాత్ర. నాని గారికి ఇలాంటి పాత్రలు చెయ్యటం కొట్టిన పిండి. ఆయన సరసన ప్రియాంక మోహనన్ నటిస్తున్నారు కానిస్టేబుల్ చారులత పాత్రలో. ఈ చిత్రానికి ఇంకొక ముఖ్యమైన పాత్ర IPS దయానంద్ పాత్ర.
అది చేసింది ఇంకెవరో కాదు, మన అందరి అభిమాన నటుడు SJ సూర్య గారు. ఆయన వైవిధ్యమైన నటన, నాని గారి సహజ నటన, సాయికుమార్ గారి హీరో ఎలేవేషన్ తో విడుదల అయ్యింది ఈ చిత్రం ట్రైలర్. ఆధ్యంతం పోరాటాలతో నిండిపోయింది. ఒక ఊరికి వచ్చిన సమస్యని తన సమస్యగా తీసుకున్న పాత్రలో నాని గారు నటించారు ఆయన పాత్ర పేరు సూర్య. ట్రైలర్ లో చాలా అంశాలని వ్యక్తపరిచారు డైరెక్టర్ ఆత్రేయ గారు. ఈ చిత్రానికి ఇంకొక ముఖ్యమైన ఆధారం సంగీతం. జాక్స్ బెజోయ్ అందించిన సంగీతం అలరిస్తుంది. ట్రైలర్ లో బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి ఇది ఒక పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు. నాని గారు ఇదివరకు చేసిన దసరా చిత్రం కన్నా ఈ చిత్రంలో మాస్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతినాయకుడు కూడా చాలా బలవంతుడు. ఈ చిత్రం ఆయుష్ 29వ తేదీన మన ముందుకి రాబోతోంది. నాని గారి హిట్ స్ట్రీక్ కొనసాగాలని కోరుకుందాం.