- Advertisement -spot_img
HomeMoviesTollywoodగ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "శ్రీ శ్రీ శ్రీ రాజావారు"…

గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “శ్రీ శ్రీ శ్రీ రాజావారు”…

- Advertisement -spot_img

రీసెంట్ గా ఆయ్ అంటూ , గతంలోమ్యాడ్ నంటు యూత్ ని ఎంటర్టైన్ చేస్తూ,హిట్ మీద హిట్టు తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకులకు ముందుకు రానుంది.


ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ… ‘ముందుగా మమ్మల్ని మా బ్యానర్ ని ఆదరిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు.

ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న.ఎన్టీఆర్ ఎంతో మెచ్చి… ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలోఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page