- Advertisement -spot_img
HomeMoviesTollywoodచిన్న సినిమాలే కానీ పెద్ద విజయాలు!

చిన్న సినిమాలే కానీ పెద్ద విజయాలు!

- Advertisement -spot_img

చిన్న సినిమాలే కానీ పెద్ద విజయాలు!

కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కి చిన్న, పెద్ద అని తేడా లేదు ఆదరిస్తారని మరోసారి రుజువైయింది. తెలుగు బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ పెద్ద సినిమా జూన్ లో వచ్చిన ప్రభాస్ “కల్కి2898AD”. అది వచ్చి దాదాపు 100రోజులు దాటిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న సినిమాలదే హవా. భారీ అంచనాలతో వచ్చిన “భారతీయుడు-2”, “మిస్టర్ బచ్చన్”, “డబుల్ ఇస్మార్ట్”, “సరిపోదా శనివారం” లాంటి పెద్ద సినిమాలోచినప్పటికీ ఒక్క “సరిపోదా శనివారం” తప్పించి మిగితా చిత్రాలన్నిటిని ప్రేక్షకులు సున్నితంగా తిరస్కరించారు. కానీ ఈ మధ్యకాలంలో అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన “కమిటీ కుర్రోళ్ళు”, “ఆయ్”,”35 చిన్న కథ కాదు”, “మత్తువదలరా-2” వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాల్ని నమోదు చేశాయి. ముఖ్యంగా గత వారం వచ్చిన “మత్తువదలరా-2” చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. రిలీజైనా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తుంది. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని కలెక్షన్స్ కానక వర్షం కురిపిస్తారని మరోసారి ఈ సినిమాలన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. కేవలం థియేటర్స్ లో మాత్రమే కాకుండా ఓటీటీల లో కూడా చిన్న చిత్రాలు అదరకొడుతున్నాయి. దానికి ఉదాహరణ రీసెంట్ గా వచ్చిన “కమిటీ కుర్రోళ్ళు, “ఆయ్” చిత్రాలే . ఈ చిత్రాలు థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్టో ఓటీటీలో కూడా అంత కంటే ఎక్కువ విజయాన్ని సాధించాయి. రికార్డు స్థాయిలో మిలియన్ కొద్దీ వ్యూస్ తో అదరకొడుతున్నాయి. తెలుగు సినిమా ఓటీటీ మార్కెట్ ని భారీ స్థాయిలో పెంచుతూ నిర్మాత నెత్తిన పాలుపోస్తున్నాయి.

అసలు చిన్న సినిమా భారీ విజయాలకు కారణాలేంటి?

చిన్న సినిమాలే కానీ పెద్ద విజయాలు!

ఏ సినిమాకైనా ప్రధాన బలం కంటెంట్ . సినిమా కంటెంట్ బాగుంటే హీరో సంపూర్ణేష్ బాబు అయినా 100కోట్లు పక్క. అదే కంటెంట్ బాగోకపోతే హీరో మహేష్ బాబు అయినా సినిమా కి భారీ నష్టాలు తప్పవు. అయితే సినిమా కంటెంట్ బాగుండడం కోసం మన పురాణాల్ని తిరగేయాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడ నుంచో కథల్ని పట్టుకురావాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ కథ తో ఎంటర్టైన్ చేస్తే చాలు. కథ రోటీనా అయ్యిన పర్వాలేదు. కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంది ౩గంటల పాటు ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తే చాలు సినిమాకి కాసుల వర్షం కురవడం ఖాయం. రీసెంట్ గా వచ్చిన చిన్న చిత్రాలన్నీ ఇవి నిరూపించాయి. “ఆయ్”, “కమిటీ కుర్రోళ్ళు”, “35”, “మత్తువదలరా” వంటి సినిమాలు కథ పరంగా కొత్తవేమీ కాదు. దశాబ్దాల కాలంగా తెలుగు సినిమాల్లో ఎన్నోసార్లు బాగావాడేసిన అరిగిపోయిన క్యాసెట్ లాంటి కధే. అయినా కూడా పెద్ద సినిమాల్ని మించి ఎక్కువ కలెక్షన్స్ సాధించాయి అంటే దానికి ప్రధాన కారణం ట్రీట్మెంట్ కొత్తగా ఉండడం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూడు గంటల పాటు ప్రేక్షకుల్ని కూర్చోపెట్టగలిగాయి కాబట్టి నిర్మాతల పంట పండింది. కానీ పెద్ద హీరో సినిమాలకు ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పెద్ద సినిమాలకి ముందు నుంచి అంచనాలుంటాయి. అందుకే పెద్ద సినిమాలకి కథ దగ్గర నుంచి ప్రతిదీ పక్కాగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చిన నిర్మాత కి వచ్చే నష్టం వర్ణించడం కష్టం.

దేవర తర్వాత కూడా అన్ని చిన్న సినిమాలే!

ప్రభాస్ కల్కి తర్వాత వస్తున్నా ఏకైక పెద్ద సినిమా దేవర. విచిత్రం ఏంటంటే దేవర ముందు వరకు చిన్న సినెమాలదే హవా “దేవర” తరువాత కూడా చిన్న సినిమాలదే. వచ్చే వారమే దేవర గ్రాండ్ రిలీజ్. దాదాపు ఆరేళ్ళ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్నా ఏకైక చిత్రం. పైగా ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ క్రేజ్ రెట్టింపైయింది. అందుకే దేవర పై భారీ అంచనాలున్నాయి. ఏ మాత్రం హిట్టైన “దేవర” ఊచకోతకు బాక్సాఫీస్ బలవాల్సిందే. అయితే ఇదంతా దేవర తర్వాత ఒక రెండువారాల కథ మరి తర్వాత పరిస్థితేంటి. దేవర తర్వాత కూడా మళ్లీ చిన్న సినిమాలదే హవా డిసెంబర్ 6వరుకు. గోపీచంద్ “విశ్వం”, సుధీర్ బాబు “మా నాన్న సూపర్ హీరో” వంటి కొన్ని చిత్రాలు పుష్ప -2 వరుకు బాక్సాఫీస్ ని ఖుషి చేయనున్నాయి.

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ టీజర్ విడుదల:

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page