Bahirbhoomi Movie Pre Release Event
నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ – ఈ రోజు మా “బహిర్భూమి” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా సినిమాకు సెట్ బాయ్ నుంచి హీరో వరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి మూవీ నిర్మించినందుకు ఆనందంగా ఉంది. అక్టోబర్ 4న “బహిర్భూమి” సినిమా రిలీజ్ చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లో ఇతర భాషల్లోనూ మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. రేపు సాయంత్రం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ పై మా మూవీ ట్రైలర్ డిస్ ప్లే చేస్తాం. హాష్ ట్యాగ్ “బహిర్భూమి” అని సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 వేల రూపాయల బహుమతి అందిస్తాం. థియేటర్ లో మా “బహిర్భూమి” సినిమా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ – “బహిర్భూమి” అనే మాటకు ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో రెండు ఊర్ల మధ్యలో బహిర్భూమి ప్లేస్ కోసం గొడవలు జరిగేవి. ఈ టైటిల్ సినిమాకు ఎందుకు పెట్టామో మూవీ చూస్తే తెలుస్తుంది. మా వేణు మాధవ్ గారు మంచి ప్రొడ్యూసర్. అలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో స్థిరపడాలి. మా సినిమాకు హీరో నోయెల్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్ తో మీ అందరికీ నచ్చేలా సినిమా చేయగలిగాను. థియేటర్ లో మా సినిమాను అక్టోబర్ 4న చూసి మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరో నోయెల్ మాట్లాడుతూ – “బహిర్భూమి” వంటి మంచి మూవీ చేసిన నిర్మాత మచ్చ వేణు మాధవ్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన ఇండస్ట్రీలో వంద సినిమాలు చేయాలి. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ మన పరిశ్రమలో కొనసాగాలి. అలాగే మా డైరెక్టర్ రాంప్రసాద్ కు ఫస్ట్ మూవీ ఇది. చాలా బాగా సినిమాను తెరకెక్కించాడు. అన్ని ఎలిమెంట్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సినిమా కోసం మా మూవీ టీమ్ ఎంతో కష్టపడింది. హీరోయిన్ రిషిత, చిత్రం శీను, ఫణి వీళ్లందరి క్యారెక్టర్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. మా సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వల్లే నేను ఈ సినిమా కంఫర్ట్ గా చేయగలిగాను. అజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. లిరిక్స్ చాలా బాగున్నాయి సినిమాను థియేటర్ లో మీరంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. తప్పకుండా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.
హీరోయిన్ రిషిత నెల్లూరు మాట్లాడుతూ – మాది నెల్లూరు. సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాంప్రసాద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే మా ప్రొడ్యూసర్ గారు సినిమా మీద ఇష్టంతో ఈ మూవీ నిర్మించారు. 21 డేస్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. నోయెల్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు గరిమా సింగ్ కూడా ఒక రోల్ చేసింది. “బహిర్భూమి” సినిమాకు మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ గరిమా సింగ్ మాట్లాడుతూ – “బహిర్భూమి” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం 15 రోజుల షెడ్యూల్ వర్క్ చేశాను. నా క్యారెక్టర్ కు మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా. “బహిర్భూమి” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ . అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ – బహిర్బూమి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వేణు గారు, డైరెక్టర్ రాంప్రసాద్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు మంచి సాంగ్స్ చేసే అవకాశం దొరికింది. మంచి సాంగ్స్ చేశాం. ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలి. అన్నారు.