Free health check-up camp for Maa members: Vishnu Manchu.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ‘మా’ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ హెల్త్ చెకప్‌లో ‘మా’ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో
విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘డా.శాస్త్రి గారికి, జీవీకే హెల్త్ హబ్‌కు థాంక్స్. ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది. వేల ఖర్చుతో కూడుకున్న ఈ హెల్త్ చెకప్‌ను ఫ్రీగా అందిస్తున్నందుకు థాంక్స్. ఇది ఇకపై ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మాదాల రవి మాట్లాడుతూ.. ‘జీవీకే హెల్త్ హబ్‌తో కలిసి మాస్టర్ హెల్త్ చెకప్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు మా సభ్యుల ఆరోగ్యానికి ఎప్పడూ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది మా ఆధ్వర్యంలో నాలుగో హెల్త్ క్యాంప్. మా సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం కోసం హెల్త్ కార్డ్‌లను జారీ చేశాం. వాటిని అందరూ వినియోగించుకోవాలి. దేశంలో అత్యవసర సేవల విషయంలో జీవీకే సంస్థ చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. మా సభ్యుల కోసం ఇలా హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేసేందుకు సాయం చేసిన జీవీకే రెడ్డి గారికి థాంక్స్’ అని అన్నారు.
శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘ ‘మా’ ఆధ్వర్యంలో ఇది నాలుగో ఫ్రీ హెల్త్ క్యాంప్. జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఇది చాలా సక్సెస్ ఫుల్‌గా జరిగింది. అందరికీ థాంక్స్’ అని అన్నారు.
డా.శాస్త్రి మాట్లాడుతూ.. ‘ఈ రోజు వరల్డ్ హార్ట్ డే. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించాలి. డైట్, హెల్త్ పట్ల అందరూ అవగాహనతో ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆర్టిస్టులకి ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. అందుకే వీరి కోసం స్పెషల్‌గా మాస్టర్ చెకప్ చేస్తున్నాం. తగినంత నిద్ర, స్పిరిట్యువల్ హెల్త్ కూడా చూసుకోవాల’ని అన్నారు.