చాలా సంవత్సరాల తర్వాత జూనియర్. ఎన్టీఆర్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో ప్రేక్షకులు ఎన్టీఆర్ ని చూడడానికి పోటెత్తారు. తొలి వీకెండ్ మొత్తం థియేటర్స్ అన్ని ఎన్టీఆర్ నామస్వరంతో మారుమోగిపోయాయి. అందుకు తగత్తె “దేవర” ఫస్ట్ వీకెండ్ అంచనాలకి మించి రాణించింది. కళ్ళు చెదిరే కలెక్షన్స్ రిపోర్ట్ చేసి ఔరా అనిపించింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 172కోట్ల గ్రాస్ వసూల్ చేసి ఆల్ టైం రికార్డు పెట్టింది.
టాక్ మిక్స్డ్ ఉన్నపటికీ రెండో రోజు- మూడు రోజు కూడా “దేవర” దూకుడు ఏమాత్రం తగ్గలేదు. రెండో రోజు 72కోట్ల గ్రాస్, మూడో రోజు 61కోట్ల గ్రాస్ తో టోటల్ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా 304కోట్ల గ్రాస్ వసూల్ టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డులో ఒకటిగా నిలిచింది. మిక్స్డ్ టాక్ తో కూడా సినిమా ఈ స్థాయి కలెక్షన్స్ వసూల్ చేసిందంటే దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ స్టార్ పవర్. ఎన్టీఆర్ కి అసలు సిసలైన మాస్ కంటెంట్ ఉన్న సినిమా పడితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో దేవర మరోసారి నిరూపించింది. తొలి వీకెండ్ లోనే చాలా ఏరియాస్ లోని డిస్టిబ్యూటర్స్ , బయర్స్ లాభాల బాట పట్టారు. ఈ వీకెండ్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని “దేవర” బిజినెస్ లో పాలుపంచుకున్న అందరు సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లే. తరవాత రాబోయే దసరా సీజన్ ఎలాగూ మొత్తం ఖాళీ కాబట్టి దేవర ఇన్వెస్టర్స్ అందరు మరన్ని లాభాలు చూసే ఛాన్స్ ఉంది.