- Advertisement -spot_img
HomeMoviesTollywoodసైకలాజికల్ థ్రిల్లర్ "కలి" మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ 'హల్లో హల్లో..' రిలీజ్, ఈ...

సైకలాజికల్ థ్రిల్లర్ “కలి” మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ ‘హల్లో హల్లో..’ రిలీజ్, ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

- Advertisement -spot_img

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ కి ఇంకా మూడు రోజుల సమయమే ఉండడంతో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈరోజు “కలి” మూవీ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ ‘హల్లో హల్లో..’ ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘హల్లో హల్లో..’ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి బ్యూటిఫుల్ లిరిక్స్ అందించగా, జీవన్ బాబు (జె.బి.) ప్లెజెంట్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. హైమత్ హైమత్ అహ్మద్, అదితీ భావరాజు మంచి ఫీల్ తో పాడారు. ‘హల్లో హల్లో హల్లో పూలదారుల్లో పాదం వేద్దాం ఓ పిల్లో, ఛల్లో ఛల్లో ఛల్లో రంగు రంగుల్లో జీవించేద్దాం ఛల్ ఛల్లో, కలవని దూరం దూరం నిన్న వరకు, అడుగులో అడుగేసేద్దాం చివరి వరకు…’అంటూ రొమాంటిక్ గా సాగుతుందీ పాట. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథకు ‘హల్లో హల్లో..’ పాట కలర్ ఫుల్ పిక్చరైజేషన్ తో కొత్త ఫ్లేవర్ తీసుకొస్తోంది. చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రిన్స్ కి ఈ చిత్రమన్న ఆ సక్సెస్ లోటు తీరుస్తుందేమో చూద్దాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page