రైటర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకి రచయితగా పనిచేసిన కొరటాల శివ గారు ప్రభాస్ మిర్చి చిత్రంతో డైరెక్టర్ గా కొత్త ప్రస్థానానికి నాంది పలికారు. అలాంటి గొప్ప రచయిత నటనకి, పాత్రకి తన కళ్ళతోనే ప్రాణం పొసే నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే చిత్రం తెరకెక్కించారు. వసూళ్ల పరంగా మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని వర్గాలవారు ఈ చిత్రం మీద కొంచం మిక్స్డ్ అభిప్రాయంతో ఉన్నారు. తారక్ అభిమానులు మాత్రం “ఆయుధపూజ” పాటని తమ సొంతం చేసుకుని చెవులు చిల్లు పడేలా వింటూనే ఉన్నారు. అనిరుద్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. కథ పరంగా రెండు భాగాలుగా చూపించకర్లేదు అని చాలామంది ఉంటున్నప్పటికీ మనవంతు విశ్లేషణ చేసి ఒకసారి కొరటాల గారు ఈ మొదటి భాగంలో మనకి వదిలిన ప్రశ్నలు ఏంటి అనేవి తెలుసుకుందాం. రెండొవ భాగం ఎంత ముఖ్యమైనదో మనకే తెలుస్తుంది.
- మొదటగా ఎతి, యదు కోసం వెతకటం మొదలు పెట్టిన ఇన్స్పెక్టర్ అజయ్, ఏదో పెద్ద ప్రమాదం దేశానికి పొంచి ఉంది అని తెలుసుకుంటాడు. అసల ఆ ప్రమాదం ఏమిటి అనేది ఈ భాగంలో చూపించలేదు. బహుశా ఆ ప్రమాదానికి వారధి ఈ ఎర్ర సముద్రం అయ్యుండొచ్చు.
- సముద్రంలో అజయ్ కి కనపడిన శవాలు ఎవరివి. కొన్ని అస్తి పంజరాలకి పోలీస్ యూనిఫామ్ కూడా ఉంది. అంటే చనిపోయిన వాళ్ళల్లో పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారా ?
- మురుగన్ని చంపింది ఎవరు. భైరా నా, దేవర నా లేకపోతే వర నా?
- ప్రకాష్ రాజ్ ఎవరు. ఆయనకి ఆ ఊరికి సంబంధం ఏమిటి?
- వర నిజంగానే దేవరాని పొడిచాడా? వర కాకపోతే ఇంకెవరికి ఆ అవసరం ఉంటుంది?
- దేవర సముద్రంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పటికి వర వయసు 12 సంవత్సరాలు. దేవర చనిపోయి ఉంటే, రెండేళ్ల తరువాత భైర మనుషులని జీవత్సవంలా పంపించింది ఎవరు? దేవర నిజంగానే చనిపోయాడా? లేకపోతే 14 ఏళ్ళ వర ఇదంతా చేయగలడా?
- ఈ కుట్రలో శ్రీకాంత్ కి కూడా భాగం ఉందా? సినిమా రెండొవ భాగంలో శ్రీకాంత్ వాళ్ళ చెల్లి, తన భర్త (భైర తమ్ముడు) ని చూపించలేదు. ఈ 12 ఏళ్ళల్లో వాళ్ళకి ఏమన్నా అయ్యుంటుందా.
ఇలాంటివి ఎన్నో పాయింట్స్ కొరటాల గారు సమాధానం చెప్పాల్సి ఉంది రెండొవ భాగంలో. ఎంతైనా రచయిత కదా. ఆమాత్రం సస్పెన్స్ లేనిదే ఆయన ప్రతిభ ఎలా కనిపిస్తుంది మరి. ఇప్పుడు అందరి కళ్ళు దేవర రెండొవ భాగం మీదనే. ఈ ప్రశ్నలకి సమాధానం కోసం యావత్ సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇంక కొరటాల గారి మీదనే భారం వేశారు అభిమానులు. ఎట్టకేలకు దేవర తో కొరటాల రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేసారు. అదే సంతోషం.