వెంకట ప్రభు దర్శకత్వంలో థళపతి విజయ్ తండ్రి కొడుకులుగా నటించిన చిత్రం “GOAT”. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, స్నేహ, మీనాక్షి చౌదరి కథానాయకులుగా చేసారు. ఊహించినంత విజయం దక్కనప్పటికీ అభిమానులు మాత్రం ఒక విధమైన మాస్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు అందరి ద్రుష్టి విజయ్ 69 మీద పడింది ఎందుకంటే అందరి దృష్టిని ఆకార్చించే విధంగా ఆ మూవీ టీం మూవీలో నటించే స్టార్ కాస్ట్ పేర్లు విడుదల చేసారు. చాలా భారీ తరగనమే ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా, ప్రకాష్ రాజ్, పూజ హెగ్డే, మమితా భైజు, ప్రియమణి ఇలా భారీ తరగనమే ఉంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, KVN ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. బహుశా ఇదే విజయ్ చివరి చిత్రం కావచ్చు. ఆయన మళ్ళీ నటిస్తారో లేదో తెలీదు కానీ, అభిమానులు మాత్రం ఆయనకి ఈ చిత్రంతో మరుపురాని విజయం అందాలని కోరుకుంటున్నారు.
