సినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడూ హిట్లే కాదు ఓటములు కూడా ఉంటాయి. ఎంతో గొప్ప దర్శకుడు అయినప్పటికీ ప్లాప్ సినిమా తెయ్యనోడు లేడు, ఉండరు కూడాను. ఎప్పుడూ హిట్టులు ఇచ్చే డైరెక్టర్ చిత్రాలు అయినప్పటికీ అన్ని వర్గాలవారికి నచ్చి ఉండదు. ఎప్పుడు కూడా ఏదోక్క లోపం ఉంటూనే ఉంటుంది. కానీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, సినిమా అంటే వీళ్లదే అనిపించుకున్న ఇద్దరు తెలుగు దర్శకులు ఇప్పుడు ఒక్క హిట్టు చిత్రం కోసం పరితపిస్తున్నారు. వాళ్లెవరో కాదు “శ్రీను వైట్ల”, “పూరి జగన్నాధ్”. హాస్యం అంటే వైట్ల మూవీనే, జీవితం గురించి తెలుసుకోవాలంటే పూరి చిత్రాలు చూడాల్సిందే అనే స్థితి నుంచి, ఇంక వీళ్లల్లో సత్తా అయిపోయిందేమో అనుకునే స్థితికి వచ్చేసారు. పూరి గారు అయినా రెండు ఏళ్ళ క్రితం ఒకమాదిరి హిట్ కొట్టారు.
కానీ వైట్ల గారు ఎప్పటినుంచో గెలుపు తలుపులు తెరవలేదు. ఈ మధ్య పూరి గారు తన గెలుపు బాటని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అది ఘోరంగా విఫలం అయ్యింది. ఇప్పుడు శ్రీను వైట్ల గారి వంతు వచ్చింది. మాచో స్టార్ గోపి చంద్ గారితో “విశ్వం” అనే యాక్షన్ మూవీ తెరకెక్కించారు వైట్ల గారు. గోపి గారికి కూడా సరైన హిట్ రావట్లేదు. ఇద్దరూ కలిసి వాళ్ళ అదృష్టాన్ని ఈ అక్టోబర్ 11న పారిఖ్చించుకోబోతున్నారు. ఈ చిత్రంలో గోపి గారి సరసన కావ్య టప్పర్ నటిస్తున్నారు. టిజి విశ్వపరసాద్ గారు నిర్మిస్తున్న ఈ చిత్రం విజయం మీద అందరి ద్రుష్టి ఉంది. ఈ చిత్రం వైట్ల గారికే కాదు, గోపి గారికి మరియు ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ గారికి కూడా చాలా ముఖ్యం. వైట్ల గారికి పూర్వ వైభవం రావాలని కోరుకుందాం.