తెలుగు లో కొన్ని దశాబ్దాలుగా స్టార్ రైటర్ గా కొనసాగిన పరుచూరి వెంకటేశ్వరరావు ఇప్పుడు తన వారసత్వాన్ని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేయబోతున్నారు. ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు విడుదలై ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు.ట్రైలర్ విడుదల చేసిన రానా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రాబోతున్న ఈ మూవీ ఈ అక్టోబర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇంకా ట్రైలర్ హైలెట్స్ గురించి మాట్లాడుకుంటే, హీరో యాక్షన్, వినోద్ ఆర్ఆర్, శివకుమార్ కెమెరా వర్క్ అన్ని సినిమాకి ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇక విలన్ ఎవరన్నది చూపించుకుండా ట్రైలర్‌ను కట్ చేసిన విధానం చాలా బాగుంది దర్శకుని ప్రతిభను కనిపిస్తుంది. ఆ పాయింట్‌తో సినిమా మీద అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.