- Advertisement -spot_img
HomeMoviesTollywoodరాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ తో మొదలై ఎన్టీఆర్ తోనే ముగిసింది!

రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ తో మొదలై ఎన్టీఆర్ తోనే ముగిసింది!

- Advertisement -spot_img

రాజమౌళి తో సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే రాజమౌళి సినిమా లేటైనా ఆ తర్వాత ఆ సినిమాకి వచ్చే కలెక్షన్స్ దాని వల్ల హీరోలకి వచ్చే ఇమేజ్ ఊహలకండవు. అందుకే రాజమౌళి సినిమాలో నటిచేందుకు ప్రతి హీరో కలలుకంటాడు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇంకో వైపు కూడా ఉంది. రాజమౌళి సినిమా ప్రతి హీరో కెరీర్ కి ఎంత మెమరబుల్ గా ఉంటుందో ఆ తర్వాత సినిమా ఒక పీడకల లాగ మిగిలిపోతుంది. ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ఇలా ప్రతి ఒక్కరు రాజమౌళి సినిమాతో ఎంత పైకెగిరారో ఆ తర్వాత సినిమాతో అంతే ఢమాల్ అని కిందపడ్డారు. ఎన్టీఆర్ “స్టూడెంట్ no.1” తర్వాత “సుబ్బు” అట్టర్ ప్లాప్ , మళ్లీ ఎన్టీఆర్ “సింహాద్రి” తర్వాత “ఆంధ్రావాలా” డిజాస్టర్ , నితిన్ “సై” తర్వాత “టక్కరి” అట్టర్ ప్లాప్ , ప్రభాస్ “ఛత్రపతి” తర్వాత “పౌర్ణమి” డిజాస్టర్ , రవితేజ “విక్రమార్కుడు” తర్వాత “ఖతర్నాక్” అట్టర్ ప్లాప్ , మళ్లీ ఎన్టీఆర్ “యమదొంగ” తర్వాత “కంత్రి” డిజాస్టర్ ,రాంచరణ్ “మగధీర” తర్వాత “ఆరంజ్” అట్టర్ ప్లాప్ , సునీల్ “మర్యాద రామన్న” తర్వాత “అప్పలరాజు” అట్టర్ ప్లాప్ , నాని “ఈగ” తర్వాత “ఎటో వెళ్ళిపోయింది మనసు” అట్టర్ ప్లాప్, మళ్లీ ప్రభాస్ “బాహుబలి” సిరీస్ తర్వాత “సాహో” అట్టర్ ప్లాప్, రాంచరణ్- ఎన్టీఆర్ “ఆర్ ఆర్ ఆర్” తర్వాత “ఆచార్య”డిజాస్టర్. ఇలా ఒకరు కాదు రాజమౌళి సినిమాలో నటించిన ప్రతి హీరో తమ తర్వాతి సినిమాతో ఘోర పరాజయం అందుకున్నారు. దీనితో రాజమౌళి సినిమాలో చేసిన ప్రతి హీరో తర్వాతి సినిమా ప్లాప్ అనే సెంటిమెంట్ పాతుకుపోయింది. గడిచిన 20ఏళ్లుగా రాజమౌళి సినిమాలో నటించిన ప్రతిహీరో ఎన్ని విధాలుగా ప్రయత్నించిన హిట్ మాత్రం కొట్టలేకపోయారు. ఎన్టీఆర్ తో మొదలైన ఈ సెంటిమెంట్ తర్వాతి హీరోస్ కూడా సక్సెస్ ఫుల్ గా పాటించారు.

రాజమౌళి  సెంటిమెంట్  ఎన్టీఆర్ తో మొదలై ఎన్టీఆర్ తోనే ముగిసింది!

దీనితో ఇంకా ప్రేక్షకులు కూడా రాజమౌళి హీరో తర్వాతి సినిమా హిట్ అవ్వదేమో అని బలంగా ఫిక్స్ ఆయిపోయారు. అయితే ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి అరుదయిన రికార్డు నెలకొల్పాడు. “దేవర” ముందు చిత్రం రాజమౌళి సినిమా కావడం పైగా “ఆర్ ఆర్ ఆర్” లో ఒక హీరో అయినా రాంచరణ్ “ఆచార్య” తో ఆల్రెడీ ఒక ప్లాప్ అందుకోవడం ఇంకా రెండో హీరో ఎన్టీఆర్ కూడా “దేవర” తో ఎన్టీఆర్ కూడా ప్లాప్ కొడతాడు అనుకున్నారంతా. అందుకు తగత్తె “దేవర” ఫస్ట్ డే భయంకరమైన ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని రివ్యూస్ కూడా దేవర కి నెగటివ్ గా రాశాయి. దీనితో నాలుగోసారి కూడా ఎన్టీఆర్ కి రాజమౌళి ఎఫెక్ట్ తప్పదనుకున్నారు. కానీ ఊహించని విధంగా “దేవర” పెర్ఫార్మన్స్ చేసింది. సినిమా ప్లాప్ టాక్ తెచుకున్నప్పటి రెండో రోజు కూడా “దేవర” ఫస్ట్ డే కి ఏమాత్రం తీసిపోకుండా అదరకొట్టింది. ఇంకా మూడు రోజైతే రెండో రోజుకంటే ఎక్కువ కలెక్షన్స్ వసూల్ చేసి అందరిని షాక్కి గురిచేసింది. దీనితో తొలి మూడు రోజుల్లోనే అంతే ఫస్ట్ వీకెండ్ లోనే చాలా ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాల్లోకి తీసుకెళ్లింది. మిగితా లాంగ్వేజ్ లో సినిమా ప్లాప్ అయ్యినప్పటికీ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ తో ఆ నష్టాలని భర్తీ చేయొచ్చు. అటు ఓవర్సీస్ లో కూడా “దేవర” కలెక్షన్స్ కుమ్మాడు. తొలిరోజే యుఎస్ మార్కెట్లో “దేవర” 2.5మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. సినిమా ప్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ స్టార్ పవర్. సినిమాలో సరైన మాస్ అప్పీల్ ఉంటే ఎన్టీఆర్ స్టామినా ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అంతే కాకుండా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ బ్రేక్ చేసాడు. ఇంకో విశేషమేంటంటే ఎన్టీఆర్ సినిమాతోనే మొదలైన రాజమౌళి సెంటిమెంట్ మళ్లీ ఎన్టీఆర్ సినిమాతోనే ముగిసింది.

“రామ్ నగర్ బన్నీ” లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్ నా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది -‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page