- Advertisement -spot_img
HomeMoviesTollywoodదక్షిన మూవీ రివ్యు: Dakshina Movie Review #FilmCombat

దక్షిన మూవీ రివ్యు: Dakshina Movie Review #FilmCombat

- Advertisement -spot_img

చిత్రం:దక్షిణ
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: సూపర్ గ్రిప్పింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “దక్షిణ”
నటి నటులు: సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ, ఆర్నా ములెర్, మేఘన చౌదరి మరియు నవీన్ తదితరులు.
ఎడిటర్: వినయ్
మ్యూజిక్ డైరెక్టర్: బాలాజీ
బ్యా గ్రౌండ్ స్కోర్: ది.యస్.ఆర్
సినిమాటోగ్రఫీ: రామకృష్ణ (ఆర్.కె)
ప్రొడక్షన్: కల్ట్ కాన్సెప్ట్స్
నిర్మాత: అశోక్ షిండే
రచన–దర్శకత్వం: ఓషో తులసీరామ్

కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ ‘సాయి ధన్సిక’ కథనాయాకి గా నటించిన చిత్రం “దక్షిణ”. మంత్ర, మంగళ సినిమా లతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన ‘ఓషో తులసిరామ్’ దర్శకత్వంలో అక్టోబర్ 4న థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ ముందు ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం మరి రిలీజ్ తర్వాత ఆ అంచనాలని అందుకుందో లేదో ఇప్పుడు మన సమీక్షాలో చూద్దాం.

కథ:
ఒక సైకో కిల్లర్ ఒంటరిగా ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా అతి క్రూరంగా చిత్ర విచిత్రంగా చంపుతుంటాడు. అయితే ఆ కేసు సాల్వ్ చేయడానికి దక్షిణ( సాయి ధన్సిక ) ఒక పోలీస్ ఆఫీసర్ తెగ ప్రయత్నిస్తుండగా, ఒక అనుకోని విషాదం ఎదురవ్వడంతో తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. కానీ, ఆ సైకో కిల్లర్ ని వెతకడం మాత్రం ఆపదు.అయితే మరో పక్కన (స్నేహ సింగ్) కూడా మరో పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఆ హంతకుడుని వెతికే పనిలో ఉంటుంది. అలా మొదలైన హంతకుడిని వెతికే వేట చివరికి ఏమైయింది? అసలు హంతకుడు అమ్మాయిలని అంత క్రూరంగా చంపడానికి కారణాలేంటి? అసలు దక్షిణ కి ఎదురైనా ఆ విషాద సంగతనేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
సొసైటీలో ఉన్న అమ్మాయిలు అందరూ స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి అనే పాయింట్ ను ‘దక్షిణ’ సినిమా ద్వారా ఓషో తులసీరామ్ తెరకెక్కించిన చాలా విధానం బాగుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి కధలు వచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే లో ప్లే చేసిన విధానం సూపర్బ్. మొత్తం సినిమాలో సాయి ధన్సిక క్యారెక్టర్ హైలెట్. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో పాటు ‘రా అండ్ బోల్డ్’ గా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ తో అదరకొట్టింది.
పోలీస్ ఆఫీసర్ గా దక్షిణ పాత్రని రివీల్ చేసినప్పుడు, ఆమె ధైర్యసాహసాలుకి సంబంధించి సీన్స్ వచ్చినప్పుడు ఇంకాస్త ఎలివేషన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రెండొవ పాత్రలో ఘోరమైన సంఘటన వల్ల డిప్రెషన్ కి లోనయ్యి మందు సిగరెట్లకు బానిసైపోయిన దక్షిణ పాత్రలో హీరోయిన్ ని చూపించిన విధానం అయితే వేరే లెవెల్ అసలు.
సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి, ముఖ్యంగా ‘సాయి ధన్సిక’ ఇంట్రో, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ ఫైట్ బాగుంటాయి. సాయి ధన్సిక కనిపిస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో ప్రేక్షకులు సినిమాని చూస్తా ఉంటారు.

దక్షిణ మూవీ రివ్యూ

నటినటులు పెర్ఫామెన్స్:
హీరోయిన్ ‘సాయి ధన్సిక’ సినిమాలో ది బెస్ట్ కేరీర్ పెర్ఫామెన్స్. అసలు “సాయిధన్సిక” నా లేదంటే, “సైకో ధన్సిక” అనేంతలా పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఆవిడ ‘యాటిట్యూడ్’ తెరపైన చూస్తే ఇన్నాళ్లు ఇలాంటి యాక్షన్ హీరోయిన్ ని ఎలా మిస్ అయ్యాం అనే ఒక ఫీల్ కలుగుతుంది. ‘రిషబ్ బసు’ తెలుగు తెర కి కొత్తముఖమే అయ్యినప్పటికీ, ఒక సైకో విలన్ కి ఉండాలిసిన ప్రధాన ఖ్వాలిటీస్ తో పాటు, సెట్టిల్డ్ యాక్టింగ్ తో ‘ధన్సిక’ కి దీటు గా నిలబడ్డాడు. ‘స్నేహ సింగ్’ నిడివి తక్కువే అయ్యినప్పటికీ బాగా ఆకట్టుకున్నారు. మిగితావారంతా ఉన్నపటికీ ప్రధాన కథ మొత్తం ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుండడంతో మిగితా పాత్రలేవీ అంత నోటీసు అవ్వవు.

సాంకేతిక విభాగం:
స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ ‘కోర్ పాయింట్’ ని ఇంకా బలంగా చెప్పి ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులని థ్రిల్ చేయడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. తన మునుపటి సినిమాలు కూడా ఇదే జోనర్ కి చెందిన సినిమాలు కావడంతో దర్శకుడు తన రైటింగ్ లో మరింత పరిణితి చెందాడు. ‘మ్యూజిక్ & బ్యాగ్రౌండ్’ స్కోర్ తో పాటు, ‘ఎడిటింగ్’ పని తీరు బాగుంది. ఒక ‘రా’ కంటెంట్ కి కావలిసిన ‘విజ్యువల్స్’, సస్పెన్స్ థ్రిల్లర్ కి కావాల్సిన ఉండాల్సిన అన్ని హంగులు ‘డిఓపి’ అందించారు. అతి తక్కువ బడ్జెట్ లో అంత మంచి విజ్యువల్స్ అందించి, సినిమా రీలిజ్ చేసిన ‘ప్రొడక్షన్ బ్యానర్’ కి సూపర్బ్.

రివ్యూ బై : వెంకటేష్ తిరుమలశెట్టి

హీరో కిరణ్ అబ్బవరం ఫాన్స్ కి పండగే అక్టోబర్ 7న “క” సినిమా నుంచి ‘మాస్ జాతర’ సాంగ్ విడుదల!

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page