- Advertisement -spot_img
HomeMoviesTollywoodఫైనల్ స్టేజి కి చేరిన తమన్నా లేటెస్ట్ చిత్రం "ఓదెల -2" షూటింగ్!

ఫైనల్ స్టేజి కి చేరిన తమన్నా లేటెస్ట్ చిత్రం “ఓదెల -2” షూటింగ్!

- Advertisement -spot_img

తమన్నా భాటియా లీడ్ రోల్లో , మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ‘ఓదెల 2’ లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా వున్నారు. 2021వ సంవత్సరంలో బ్లాక్‌బస్టర్ హిట్ నిలిచిన “ఒదెల రైల్వే స్టేషన్‌”కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్, బీహైండ్ ది స్క్రీన్ కంటెంట్‌తో సంచలనం సృష్టించింది. తన కెరీర్‌లో తొలిసారిగా తమన్నా ఈ సినిమాలో శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది.

ఇన్ని హంగులున్న ఈ “ఓదెల-2” చిత్రం ప్రస్తుతం చివరి దశలో ఉంది షూటింగ్, ఓదెల విలేజ్ లో జరుగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్ సీక్వెల్ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతోంది. మూవీ టీం ఐకానిక్ ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తమన్నా మొదటి సారి ఓదెల విలేజ్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర షూటింగ్ కి సహకరించిన ఓదెల గ్రామస్తులకు మేకర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంపత్ నంది సూపర్ విజన్ లో ఓదెల 2 ఎమోషనల్ డెప్త్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్‌తో నిండిన గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.

ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్న “మిస్టర్ సెలెబ్రిటీ” సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో పరుచూరి వెంకటేశ్వరరావు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page