సూపర్ స్టార్ రజిని లేటెస్ట్ సెన్సేషన్ “వేట్టయన్” సినిమా రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. జైలర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా లో రానా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించడంతో తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సురేష్ బాబు గారు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ కి ముందు ఒక చిన్న ప్రెస్సుమీత్ ఏర్పాటు చేసిన సురేష్ బాబు సంస్థ, అందులో భాగంగా “వేట్టయన్” తెలుగు టైటిల్ వివాదం పై కొన్ని హాట్ కామెంట్స్ చేశారు.
అసలు వివాదమేంటంటే పరభాష డబ్బింగ్ చిత్రాలు ఏ రాష్ట్రంలో విడుదలైతే ఆ రాష్ట్ర బాషా కి ప్రాముఖ్యత ఇస్తూ ఆ ప్రాంత ప్రజల సౌలభ్యం కొరకు సినిమా టైటిల్స్ వారి భాషలో ఉండాలి. తమిళ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయితే సినిమా టైటిల్ తెలుగులో ఉండాలి. అలాగే తెలుగు సినిమా తమిళ్ , మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదలైతే ఆ భాషలో తెలుగు సినిమా టైటిల్ ఉంటది. ఇది తరతరాలుగా ప్రతి డబ్బింగ్ చిత్రం పాటిస్తున్న ఆచారం. కానీ ఈ మధ్యకాలంలో తమిళ్ డబ్బింగ్ చిత్రాలు ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రిలీజైనా కొన్ని తమిళ్ సినిమా తంగలాన్, “రాయన్”, ఇప్పుడు ‘వేట్టయన్’ ఇలా డైరెక్ట్ తమిళ్ టైటిల్స్ నే తెలుగులో రాసి రిలీజ్ చేశారు. రాయన్ టైటిల్ ఒక వ్యక్తి పేరు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. “తంగలాన్”, ‘వేట్టయన్’ చిత్రాల టైటిల్స్ దగ్గరే తెలుగు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి.
అయితే ఇదే విషయం పై సురేష్ బాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ “దేవర”, “బాహుబలి” కూడా తెలుగు టైటిల్స్ తోనే అన్ని భాషల్లో రిలీజయ్యాయి. ‘వేట్టయన్’ కూడా అదే టైటిల్ తో రిలీజైతే తప్పేంటి అని సమాధానమిచ్చారు. ఇవే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నిజానికి “దేవర”, “బాహుబలి” అనే టైటిల్స్ అనేవి నామవాచకములు అంటే మనుషుల పేర్లు. మనిషి పేర్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఒకేలా పిలుస్తారు. కానీ ‘వేట్టయన్’ అనే టైటిల్ నామవాచకం కాదు ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్ధం. నిజానికి వేటగాడు అనే టైటిల్ ని తెలుగు వెర్షన్ కి రిజిస్టర్ చేయాలనే భావించారు. కానీ అప్పటికే ఆ టైటిల్ ఇంకొకరు వాడేయడంతో చేసేదేమి లేక అదే టైటిల్ తో మూవీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికి సురేష్ బాబు కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. అయితే అదే ప్రెస్సుమీత్ తో టాలీవుడ్ ఇంకో స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు కూడా పాల్గొన్నారు.
భారీ క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న హీరో శ్రీరామ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ “కోడి బుర్ర”