కొత్త కంటెంట్లను అందించేందుకు టాలీవుడ్ మేకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో “హెచ్ఎన్ క్యూబ్” ప్రొడక్షన్ అనే మరో కొత్త నిర్మాణ సంస్థ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. “హెచ్ఎన్ క్యూబ్ ప్రొడక్షన్” అనే పేరుతో ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా లోగో, మోషన్ పోస్టర్‌ను గురువారం నాడు లాంచ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి చేతుల మీదుగా ఈ లోగోను లాంచ్ చేయించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ప్రస్తుతం ఐదు చిత్రాలు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాయి. హిమనంద గజా సమర్పణలో రామ్ నందా దర్శక, నిర్మాతగా హెచ్ఎన్ క్యూబ్ ప్రొడక్షన్లో వరుసగా ఐదు చిత్రాలు రాబోతోన్నాయి. ఇక ఈ కొత్త ప్రొడక్షన్ లాంచ్ అనంతరం..
దర్శక, నిర్మాత రామ్ నందా మాట్లాడుతూ.. ‘రియల్ఎస్టేట్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చాను.2002 నుంచి సినిమా ఫీల్డులో ఉన్నాను. నాకంటూ ఓ మూవీ ఆఫీస్ 2002 నుంచే ఉండేది. ప్రాణం సినిమాని నా ఫ్రెండ్ మల్లీ చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రయాణించాను. సినిమాల మీద నాకు చాలా పట్టు ఉంది. కాలేజీలోనూ కల్చరర్ యాక్టివిటీస్‌లోనూ ముందుండేవాడ్ని. హెచ్ఎన్ క్యూబ్ లోగోని నేనే డిజైన్ చేశాను. నా ఫ్యామిలీ మొత్తాన్ని సూచించేలా లోగోను రూపొందించాను. ప్రస్తుతం మా ప్రొడక్షన్ నుంచి ఐదు చిత్రాలు (“ప్రేమలు- పెళ్లిళ్లు”, “మనసు”, “ఎల్ఎస్ఎల్ఎమ్”, “గతి”, “రామున్ని నేనే- రావణున్ని నేనే”) రాబోతోన్నాయి. గత ఏడాది నుంచి నేను నా సినిమాల మీద పని చేస్తున్నాను. నా ప్రొడక్షన్ హౌస్‌ను అందరికీ పరిచయం చేయాలని అనుకున్నాను. అన్ని చిత్రాలకు సంబంధించిన కథలు, స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక దాని తరువాత ఒక చిత్రాన్ని చేస్తాను. నేను సినిమాలు తీస్తున్నాను అని జనాలకు తెలియాలనే ఇలా ఇప్పుడు లోగోను లాంచ్ చేశాను. ఐదు సినిమాలు ఒకే సారి చేసేంత డబ్బు కూడా నా వద్ద లేదు. ఒక సినిమా తరువాత ఇంకో సినిమా చేస్తాను. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి.. ఈ ఐదు చిత్రాలను నిర్మిస్తున్నాను. నాకు నమ్మకం మాత్రమే ఉంది.. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రతీ పోస్టర్, టైటిల్‌కు సపరేట్ కాన్సెప్ట్, స్టోరీ ఉంటుంది. ప్రేమలు, పెళ్లిళ్లు మూవీని ముందుగా సెట్స్ మీదకు తీసుకొస్తాను. ఇందులో కొత్త వారినే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రేమలు,పెళ్లిళ్లు సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. మంచి చిత్రాలను మీడియా, తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
వ్యాపార వేత్త మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రామ్ నందా గారితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన ఇలా సినిమాల్లోకి రావడం, ఒకే సారి ఇలా ఐదు చిత్రాలు నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. ఆయనకు మంచి సక్సెస్ దక్కాలి’ అని అన్నారు