బ్రహ్మ కొన్ని అందాలని ప్రాణంపెట్టి చెక్కుతూ ఉంటారేమో అనిపిస్తుంది నటి రూప కొడువాయూర్ ని చూస్తుంటే. ఒక్కసారి చుస్తే చూపుతిప్పుకోలేని అందం. పేరు తరహా మళయాళపు అందచెందాలు కనిపిస్తున్నప్పటికీ, తను ఒక మేలిమి బంగారపు తెలుగు పుత్తడిబొమ్మ. చంద్రవంక లాంటి కురులు, పాలబుగ్గల మెరుపు, నెమలిని పోలే నేత్రాలు, మబ్బుల చాటుననుంచి తళుక్కుమని మెరుపువలె మెరిసే తన చిరునవ్వు, కంటి చూపుతోనే తన వైపుకు తిప్పుకోగల కళ తన సొంతం. ప్రాణం పెట్టి నేర్చుకున్న నాట్యకళతో పాటుగా, వృత్తిరీత్యా వైద్యశాస్త్రాన్ని అవలంబించిన ఒక అప్సరస రూప కొడువాయూర్. 2020 లో సత్యదేవ్ నటించిన చిత్రం ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య. ఆ చిత్రంతో తెలుగు తెరమీదకి అరంగేట్రం చేసిన ఈ దేవకన్య తన హావభావాలతోనే ప్రేక్షకుల హృదయ కోరల్లోకి చొచ్చుకుపోయారు. తెరమీద కొంత సేపు ఉన్నప్పటికీ, తన యొక్క ప్రభావం ప్రతీ సినీ అభిమాని మీద చిరస్థాయిగా పడుతుంది. తన నటనా సామర్ధ్యంతో మంచి అవకాశాలే కొల్లగొట్టిన రూప కొడువాయూర్ గారు, తన తదుపరి చిత్రం బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ తో మిస్టర్ ప్రెగ్నెంట్ లో నటించి మళ్ళీ యువత మనసులను కొల్లగొట్టారు. ప్రస్తుతం తమిళంలో కూడా ఒక చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దు గుమ్మ. స్వతహాగా విజయవాడకి చెందిన ఈ అపురూప సౌందర్యవతి, అచ్చమైన తెలుగింటి మహాలక్ష్మి కావటం మన అదృష్టం.
తన కళ్ళలో ఏదో తెలియని మాయ దాగున్నది, అది ఎలాంటి వారినైనా తనవైపుకు ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణకి గురైన ఎవరైనా సరే తన గురించి ఆలోచించకుండా ఉండలేరు. మేలిమి బంగారంపు వర్ణం, కోకిలవలె వినసొంపైన స్వరం, సంద్రములో పుట్టే స్వచ్ఛమైన ముత్యమువలె నవ్వు, స్వచ్ఛమైన ఆకాశాన్ని అలంకరించిన ఇంద్రధనుస్సు వలె ఉండే అందం తనకు కాకా ఇంకెవరికి సొంతం. ఇంతటి ప్రతిభావంతురాలైన రూప కొడువాయూర్ గారికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని, నాట్య ప్రతిభ వలన తనకి స్వతహాగా అవలంభించిన హావభావాలతో మన అందరిని మంత్రముగ్ధుల్ని చెయ్యాలని కోరుకుందాం.
ఆర్టికల్ బై: సాయిరాం తాడేపల్లి