- Advertisement -spot_img
HomeReviewsగోపీచంద్ విశ్వం మూవీ రివ్యూ - FilmCombat

గోపీచంద్ విశ్వం మూవీ రివ్యూ – FilmCombat

- Advertisement -spot_img

చిత్రం: విశ్వం
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: Routine sentimental action drama
నటి నటులు: గోపీచంద్, కావ్యా థాపర్, సునీల్, శ్యామ్, జిషు సేన్గుప్తా, వెన్నెల కిషోర్, నరేష్, విటివి గణేష్, ప్రగత, మాస్టర్ భరత్, ముకేశ్ రిషి, రాహుల్ రామకృష్ణ తదితరులు
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
బ్యా గ్రౌండ్ స్కోర్: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: కె . వి . గుహన్
ప్రొడక్షన్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రైటర్స్: గోపి మోహన్
ఆర్ట్స్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్: రవివర్మ, దినేష్, సుబ్బరాయన్
నిర్మాతలు: టి. జి . విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి
మాటలు, డైరెక్షన్: శ్రీను వైట్ల

విశ్వం మూవీ రివ్యూ: Viswam Movie Review #FilmCombat

సుమారు 6 సంవత్సరాల తరువాత ఒక్క హిట్ కోసం మళ్ళీ తన అభిమానుల ముందుకు వచ్చారు శ్రీను వైట్ల. ఒకప్పుడు హాస్యాస్పద యాక్షన్ మూవీస్ కి కేర్ అఫ్ అడ్రస్ అయిన ఆయన, కొన్నాళ్లుగా సరైన హిట్ లేక చాలా విరామం తీసుకుని గోపించంద్ గారితో విశ్వం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీచంద్ గారికి కూడా సరైన హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఇద్దరు కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోటానికి “విశ్వం” చిత్రంతో మన ముందుకు వచ్చేసారు. ఈరోజు (అక్టోబర్ 11) ఈ చిత్రం వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క విశ్లేషణ ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

కథ:

ఒక సెంట్రక్ మినిస్టర్ (సుమన్) ని తన తమ్ముడు బాచిరాజు (సునీల్) పాకిస్తాన్ తీవ్రవాది అయిన ఖురేషి (జిషుసేన్ గుప్తా) తో కలిసి చంపటం దర్శన అనే ఒక చిన్న పాప చూస్తుంది. ఖురేషి హిందువు అనే ముసుగులో ఉండే ఒక ప్రొఫెసర్. కాలేజీ విద్యార్థులని తీవ్రవాదులుగా మారే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మినిస్టర్ పదవి కోసం బాచిరాజు తన అన్నని చంపుతాడు. ఈ హత్య చుసిన దర్శన ని చంపటానికి ప్రయత్నించినప్పుడు గోపి (గోపీచంద్) కాపాడతాడు. సమైరా (కావ్యా థాపర్) తో ప్రేమలో ఉన్న గోపి , ఆ పాప ఫ్యామిలీలో కలిసిపోయి ఆ పాపని కాపాడటమే పనిగా పెట్టుకుంటాడు. పాప ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టినప్పటికీ పాప జాడ తెలిసి ఎటాక్ చేస్తారు. ఈ క్రమంలో గోపి పాప ప్రాణాలని కాపాడగలిగాడా, అసలు గోపి ఎవరు? పాపని తను ప్రాణాలకి తెగించి ఎందుకు రక్షిస్తున్నాడు ? గోపికి , ఖురేషి కి ఏంటి సంబంధం? సమైరా తో నిజముగా ప్రేమలో ఉన్నాడా ? ఇవన్నీ తెలియాలి అంటే విశ్వం చూడాల్సిందే .

కథనం :

ఒక హీరో తన ఐడెంటిటీ దాచుకుని వేరే వ్యక్తిలాగా వచ్చి, ఒక అమాయకుడిని అడ్డం పెట్టుకుని తను అనుకున్న పని చెయ్యటం శ్రీను వైట్ల మూవీస్ లో ఉండే టెంప్లేట్. అదే టెంప్లేట్ ని ఎక్కడా కూడా మార్చకుండా మళ్ళీ తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంతసేపు దూకుడు, ఆగడు, బాద్షా సినిమాలే గుర్తొస్తాయి. అవన్నీ కలిపిన కథనే విశ్వం. మొదటి భాగంలో ఒక క్రైమ్ తో సినిమా మొదలు పెట్టి ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ, కామెడీ సీన్స్ పెట్టి మ్యానేజ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోవు. గోపీచంద్ గారి ఎంట్రీ తో కొంచం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది కథ. ఆయన పాపని కాపాడటానికి చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. అమ్మ సెంటిమెంట్ సన్నివేశాలు ఇంకా పాట కన్నీళ్లు పెట్టిస్థాయి. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో మొదటి భాగం ముగుస్తుంది.

పాపని కాపాడే సన్నివేశాలతో మొదలయ్యే రెండొవ భాగం, ట్రైన్ కామెడీ సీన్ తో ముందుకు వెళుతుంది. కొంచం అక్కర్లేని పాత్రలు వచ్చి విసిగిస్తూ ఉంటాయి స్క్రీన్ మీద. ఈ భాగంలో గోపి తన గతాన్ని, పాపతో తనకి ఉన్న సంబంధాన్ని అందరికీ చెప్తాడు. కొన్ని పోరాట సన్నివేశాలు, దేశభక్తికి సంబందించిన సన్నివేశాలతో రెండొవ పార్ట్ అంతా నిండిపోతుంది. చివర్లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇలాగ శ్రీను వైట్ల తన పూర్వ చిత్రాల రెఫరెన్సెస్ తీసుకుని కలిపి చేసినట్టుగా అనిపిస్తుంది విశ్వం చిత్రం.

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఎప్పటిలానే గోపీచంద్ గారు తనదైన స్టైల్ లో తన పాత్రకి న్యాయం చేసారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఫుల్ జోష్ చూపించారు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. చిన్న పాప కూడా తనకి ఉన్న పరిధిలో మంచిగా చేసింది. చాలా కాలం తరువారా కిక్ శ్యామ్ గారికి తెలుగులో మంచి పాత్ర లభించింది. ఆయన వంతు సహకారం ఆయన కూడా నిర్వర్తించారు. హీరోయిన్ కావ్యా తన అందాలని చూపించటానికి ఉన్నట్టు చూపించారు. ప్రతీ ఫ్రేములోను ఆవిడ అందాల ఆరపోత ఆగలేదు. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, గిరి, రఘుబాబు ఇలా కొంతమంది నటులకి చిన్న చిన్న రోల్స్ ఇచ్చి కథలోకి ఇరికించారు. ట్రైన్ కామెడీ కూడా కొంతవరకు పరవాలేదు అనిపించినప్పటికీ వెంకీ చిత్రం మాదిరిలాగా అలరించదు. వెన్నెల కిషోర్, నరేష్ గారు, ప్రగతి గారు, రాహుల్ రామకృష్ణ, సునీల్, ముకేశ్ రిషి ఇలాంటి సీనియర్ నటులు వాళ్ళకి తగ్గ పాత్రకి న్యాయం చేసారు. విల్లన్ గా చేసిన జిషు సేన్గుప్తా నుంచి ఇంకొంచం బెటర్ పెర్ఫార్మన్స్ ఎక్సపెక్ట్ చేస్తే మాత్రం నిరాశ చెందుతారు. విల్లన్ జిషు సేన్గుప్తా, పాప, హీరోయిన్ కావ్యా నుంచి మాత్రం తెలుగు లిప్ సింక్ అయితే ఎక్సపెక్ట్ చెయ్యకండి. పాప అయినా పరవాలేదు, కావ్యా, జిషు సేన్గుప్తా ఇద్దరి లిప్ సింక్ అయితే అస్సలు కలవలేదు.

సాంకేతిక విభాగం:

తనదైన కామెడీ టైమింగ్ తో, రైటింగ్ తో శ్రీను వైట్ల గారు తన మార్క్ ని చూపించుకుని ప్రయత్నం చేసారు. కొన్ని చోట్ల అది పండింది. కొన్ని చోట్ల విసుగొచ్చేస్తుంది. BGM తో మంచి మర్క్స్ కొట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, అమ్మ పాటకి తప్ప ఇంకేం పాటలకి న్యాయం చెయ్యలేదు . మొరాకో మగువ పాట కొంచం కలర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అనిపించాయి. ముఖ్యంగా చెప్పుకోవలసింది పోరాట సన్నివేశాల గురించి. చాలా స్టైలిష్ గా తెరకెక్కించారు. ఫ్లాష్ బ్యాక్ ఫైట్ సన్నివేశాలు, అడవిలో ఫైట్ చాలా నచ్చుతాయి ప్రేక్షకులకి. నిర్మాణ విలువలు బాగున్నాయి. గోవా, మిలన్, కాశ్మీర్, హైదరాబాద్ ఇలాంటి ప్రదేశాలలో చిత్రీకరణ చేసిన లొకేషన్స్ బాగున్నాయి.

రేటింగ్: 2.75/5
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page