చిత్రం : విశ్వంభర
తారాగణం : చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు
సంగీతం: ఎం. ఎం . కీరవాణి
ఛాయాగ్రాహకులు: చోట కె నాయుడు
కూర్పు: కోటగిరి వెంటేశ్వర రావు, సంతోష్ కామిరెడ్డి
మాటలు: సాయి మాధవ్ బుర్ర
నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్
నిర్మాత: వంశీ, ప్రమోద్, విక్రమ్
రచన, దర్శకత్వం: వసిష్ఠ
ఆర్టికల్ బై: సాయిరాం తాడేపల్లి
మెగాస్టార్ చిరంజీవి గారినుంచి ఒక సినిమా వస్తోంది అంటే ఆయన అభిమానులే కాదు. మొత్తం సినీ ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. బింబిసార లాంటి టైం ట్రావెల్, సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కించిన తరువాత తన రెండొవ చిత్రమే మెగాస్టార్ తో చేస్తున్న ప్రతిభావంతుడైన దర్శకుడు వసిష్ఠ. త్రిష కథానాయికగా చేస్తున్నారు. కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. ఈరోజు ఏ చిత్రం టీజర్ విజయ దశమిని పురస్కరించుకుని విడుదల చేసారు. చిరంజీవి గారు ఇదివరకు సోషియో ఫాంటసీ చిత్రం చేసారు. కాకపోతే ఇది కొంచం విభిన్నమైన కథలా కనిపిస్తోంది. ఒక తెల్లని ఎగిరే గుర్రం మీద ఎంట్రీ ఇచ్చారు ఆయన. అంత కొత్త దర్శకుడు, తన రెండొవ చిత్రంతోనే ఇంత భారీగా గ్రాఫిక్స్, భారీ తారాగణంతో చేస్తున్నారు అంటే చాలా గ్రేట్.
టీజర్లో చాలా అంశాలే చూపించే ప్రయత్నం చేసారు దర్శకులు. గ్రాఫిక్స్, దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్లారు. ఈ చిత్రం కోసం చిరుగారు చాలా కష్టపడి కసరత్తులు చెయ్యటం మనం చూసాము ఇంతకుముందే. గెటప్ పరంగా ఏమంత మార్పు లేకపోయినా, కొంచెం పాత్రకోసం బాడీ తగ్గించినట్టు కనిపిస్తోంది. సాయి మాధవ్ బుర్ర గారు అందించిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో ఈ చిత్రం సందడి చెయ్యబోతోంది. వేచి చూడాలి మరి, చిరు గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ యువ దర్శకుడు ఎలా నిలుపుకుంటారో.