మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం “విశ్వంభర” టీజర్ ఈరోజు దసరా కానుకగా రిలీజ్ చేశారు. సినిమా సోసియో ఫాంటసీ కావడంతో మళ్లీ “జగదేక వీరుడు అతిలోక సుందరి” టైపు సినిమా వస్తుందని ఆశించారు ఫాన్స్.కానీ ఈరోజు “విశ్వంభర” టీజర్ చూసి ఖంగు తిన్నారు ఫాన్స్. ఎందుకంటే టీజర్లో VFX వర్క్ చాలా అంటే చాలా నాసిరకంగా ఉంది. సినిమాలో మెగాస్టార్ దుష్ట శక్తులు పై పోరాడే వీరుడిగా నటిస్తున్నాడన్న సంగతి టీజర్లో హైలెట్ చేసారు గాని అది సరిగ్గా వర్క్ అయినట్లు కనిపించడంలేదు. మెగాస్టార్ ను రెక్కల గుర్రం పై చూపించడం ఆ తర్వాత మంచు కొండల్లో చిరంజీవి ఫైట్ సీన్స్ చూస్తుంటే సినిమాల కాకుండా హిందీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్, లేదంటే ఒక కార్టూన్ సినిమా చూస్తున్న కల్గుతుంది. బింబిసార లాంటి ఒక కల కావ్యాన్ని తీసిన వశిష్ట నుంచి ఇంత దారుణమైన అవుట్ ఫుట్ వస్తుందని మెగా ఫాన్స్ కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో ఆదిపురుష్ VFX పై కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అది ముందు గాని పసికట్టి సినిమా ని పోస్టుపోన్ చేసి మరి VFX ని ఇంప్రూవ్ చేసిన ఫలితం దక్కలేదు. అయితే ఇప్పుడు ఆ భాద్యత విశ్వంభర టీం పై మరింత ఉంది. సినిమా రిలీజ్ టైం కి VFX చాలా ఇంప్రూవ్ చేయాలి. ఆరంభం నుంచి ముగింపు వరకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి చిత్రయూనిట్. లేదంటే ఆదిపురుష్ ని మించిన దారుణమైన పరాభావం విశ్వంభర ఎదుర్కోవడం ఖాయం.