ఈ దసరా పండక్కి అరడజను కు పైగా సినిమాలొచ్చాయి. అందులో ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు పెట్టిన ప్రతి రూపాయి కి సరిపడా వినోదాన్ని అందించిన సినిమా ఏదంటే “జనక అయితే గనక” అనే చెప్పాలి. దిల్ రాజు లాంటి బడా నిర్మాత ఉన్నప్పటికీ ఈ దసరా కి అన్నిటికంటే తక్కువంచనాలతో విడుదలైన ఈ సినిమా చివరికి అన్నిటికంటే ఎక్కువ వినోదాన్ని అందించింది. ఈ సినిమా కథ విషయంలోనే చాలా ఫ్రెష్ నెస్ చూపించిన దర్శకుడు కధనం విషయంలో ముఖ్యంగా హాస్యం విషయంలో కూడా లో కూడా అంతకంటే ఎక్కువ కొత్తదనం చూపించాడు. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల్ని ఇంతలా నవ్వించిన సినిమా మరొకటి లేదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 2015 లో వచ్చిన నాని “భలే భలే మగాడివోయ్” తరవాత మళ్లీ ఆ స్థాయిలో సినిమా టిక్కెట్టుకి పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసేలా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సినిమా ఇదే.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేను జంధ్యాల గారి ఫ్యాన్ అని పలు మార్లు చెప్పుకున్న దర్శకుడు. అందుకు తగత్తె ఈ సినిమా హాస్యం విషయంలో అణువణువునా జంధ్యాల సుబ్రహ్మణ్యం గారి మార్క్ కామెడీ కనిపిస్తుంది. ఎక్కడ వల్గారిటీ లేకుండా చక్కటి సహజసిద్ధమైన కామెడీ తో అణువణువునా ప్రేక్షకుల్ని నవ్వుల వర్షంలో ముంచేశారు. ఈ సినిమాలో పరిచయమయ్యే ప్రతి పాత్ర ప్రేక్షకుల్ని ఎంతో కొంత నవ్వించే వెళ్తాయి.వెన్నెల కిషోర్ చాలా కాలం తరువాత తనదయిన స్టైల్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ తో ఎంటర్టైన్ చేసాడు. ఈ మధ్యకాలంలో వెన్నెల కిషోర్ ఇంతలా ఎప్పుడు నవ్వించలేదు. ప్రభాస్ శ్రీను కూడా తన కామెడీ టైమింగ్ తో అదరకొట్టాడు. నిజానికి ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను ఇద్దరు ఒక్కరితో ఒకరు పోటీ పది మరి నవ్వించారు ప్రేక్షకుల్ని. వీరిద్దరి కామెడీ కి తోడు రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ మరో అదనపు బలం. సుహాస్ పాత్ర సీరియస్ విక్టిమ్ పాత్రే అయినప్పటికీ తన సీరియస్ కామెడీ తోనే ప్రేక్షకుల్ని నవ్వించడంలో వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను లతో పోటీ పడతాడు. ఓవరాల్ గా చెప్పాలంటే పర్ఫెక్ట్ సినిమా ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. వర్క్ ప్రేజర్స్, టెన్షన్స్ అన్ని పక్కనపెట్టి పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఈ సినిమాకి వెళ్ళండి, రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకొంది.