- Advertisement -spot_img
HomeMoviesTollywood"మంచి కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవించి 'క' సినిమాను ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు...

“మంచి కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవించి ‘క’ సినిమాను ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం,” – హీరో కిరణ్ అబ్బవరం

- Advertisement -spot_img

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ‌”క” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “మా సినిమా విడుదల తేదీని దీపావళికి అనుకున్నాం. ఈ నెల 31న రాబోతున్న సినిమాలన్నీ మంచి పోటీలో ఉన్నాయి. మా వంశీ నందిపాటి సినిమా చూసి మంచి ప్రైస్ ఇచ్చారు, దీనివల్ల మాకు ఆత్మవిశ్వాసం కలిగింది. టీజర్, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో, మా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది. సినిమా 70వ దశకానికి సంబంధించిన పీరియాడిక్ కథతో సాగుతుంది, ఇందులో యాక్షన్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. తమిళంలో కూడా అదే రోజున విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం, అటువంటి విభిన్న సాంకేతికతను ఈ సినిమాలో చూపించాం. విజయ్ పొలాకీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేసిన జాతర పాటకు మంచి స్పందన వచ్చింది.”

డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ – “కిరణ్ గారు సినిమా కోసం పూర్తి సహకారం అందించారు. ఈ కథను అనుభూతితో తెరకెక్కించాము. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది.” సుజీత్ మాట్లాడుతూ, “70వ దశకం నేపథ్యంలో పోస్ట్ మ్యాన్ అభినవ్ వాసుదేవ్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటన అద్భుతంగా ఉంది.” అన్నారు.

డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ – 70 దశకం నేపథ్యంలో “క” సినిమా సాగుతుంది. అప్పట్లో మనకు సమాచారం ఇచ్చేది పోస్ట్ మ్యాన్. ఆ కాలంలో అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్ మ్యాన్ జీవితంలో జరిగే కథ ఇది. ఒక ప్రత్యేకమైన హాబీ ఉన్న ఆ పోస్ట్ మ్యాన్ ఆ హ్యాబిట్ కోసం ఏం చేశాడు. ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సివచ్చింది. అక్కడ అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనేది ఈ మూవీలో ఆసక్తికరంగా చూపించాం. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఉంది. “క” సినిమా ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్లేతో సాగుతుంది. మేము కథ చెప్పినప్పటి నుంచి కిరణ్ గారు ఈ క్యారెక్టర్ కోసం బాగా సన్నద్ధమయ్యారు. మీరు థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అభినయ వాసుదేవ్ మాత్రమే కనిపిస్తారు. కిరణ్ అబ్బవరం అని అనుకోరు. అంతగా క్యారెక్టర్ లోకి మారిపోయారు కిరణ్ గారు. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “క” సినిమాపై పూర్తి నమ్మకం ఉంది. పండగ సీజన్ వల్ల మా సినిమాకు పెద్దగా ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాం.” అన్నారు.

హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ – “సినిమా కథ వినగానే చాలా ఆసక్తి కలిగింది. డ్యాన్స్ లు చేయడం ఎంతో సంతోషంగా ఉంది, సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.

కో ప్రొడ్యూసర్ చింతా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ – మా “క” సినిమాను ఈ నెల 31న పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా మూవీకి వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. ఒక కొత్త కంటెంట్ ను మా చిత్రంలో చూస్తారు. తెలుగులో రిలీజ్ చేస్తున్న వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్. ఈ రోజు ఈవెంట్ కు మా నాన్నగారు రావాలి. ఆయన కొన్ని బిజీ వర్క్స్ వల్ల రాలేకపోయారు. మా టీమ్ అంతా “క” సినిమా సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page