- Advertisement -spot_img
HomeMoviesTollywoodమెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా "నాగబంధం" మూవీ గ్రాండ్ లాంచ్ -అక్టోబర్ 23 నుంచి రెగ్యులర్...

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా “నాగబంధం” మూవీ గ్రాండ్ లాంచ్ -అక్టోబర్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్‌!

- Advertisement -spot_img

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ ‘నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్’ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1 గా కిషోర్ అన్నపురెడ్డి ఈ మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ ని నిర్మించనున్నారు. తారక్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు.

‘పెదకాపు’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా డెబ్యు చేసిన విరాట్ కర్ణ, తోలి సినిమాతోనే యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇప్పుడు ‘నాగబంధం’ చిత్రంలో విరాట్ కర్ణ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈరోజు టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్‌కి క్లాప్‌ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఆసియన్‌ సునీల్‌ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.అభిషేక్ నామా డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో నిధి చుట్టూ తిరిగే ఈ సినిమా కథ . భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. సినిమా కథ భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ తిరుగుతుంది.ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీగా పని చేస్తున్నారు, అభే సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్.ఈ ప్రతిష్టాత్మకమైన హై-బడ్జెట్ పాన్ ఇండియా మూవీ నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నెల 23న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ అనౌన్స్ చేశారు.

లాంచింగ్ ఈవెంట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. చిరంజీవి గారు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీలౌతున్నాను. సినిమా చాలా మంచిగా వస్తుందని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ’ అన్నారు

నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అక్టోబర్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మరో ఏడాదిన్నరలోనే సినిమాని ప్రేక్షకులను తీసుకొస్తున్నాము. ఎగ్జాక్ట్ డేట్ త్వరలోనే చెప్తాము. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. అందరికీ థాంక్యూ’ అన్నారు

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాగబంధం ఇంట్రో వీడియో రిలీజ్ చేసినప్పుడే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ అర్థమై ఉంటుంది. అభిషేక్ మామగారు ఈ సినిమాని చాలా అద్భుతంగా రూపొందిస్తున్నారు. కిషోర్ గారు చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విరాట్ తో ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిషేక్ గారికి థాంక్యూ. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం’ అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page