పుష్ప ఏ ముహూర్తాన ఈ సినిమా రిలీజైయిందో గాని అప్పటినుంచి పుష్ప కి ప్రపంచమంతా బానిసలైపోయారు. చిన్న లేదు పెద్ద లేదు ముసలిముతక అని తేడా లేకుండా “పుష్ప” చేసిన విన్న్యాసాలకి ఫిదా అయిపోయారు. ఇదంతా కేవలం “పుష్ప” ఎలా ఎదిగాడు అని చేసినందుకే ప్రపంచమంతా అతనికి సలాం కొట్టింది. మరి ఇంకా అదే పుష్ప ఎలా పరిపాలించాడో చుస్తే ప్రపంచమంతా “పుష్ప” కి గులాం అయిపోవడం ఖాయం. ఆ రోజు కూడా ఇంకా ఎంతో దూరంలో లేదు కేవలం 50రోజులు మాత్రమే. అనుకోకుండా వచ్చి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన పుష్ప రాజ్. ఈసారి మాత్రం పక్క లెక్కలతో బరిలోకి దిగుతున్నాడు. ఒక్క భారత దేశాన్ని మాత్రమే కాకుండా చైనా, జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా, ఆఫ్రికా, న్యూజీలాండ్ ఇలా అన్ని దేశాల బాక్సాఫీస్ ని ఏలడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో “బాహుబలి” రికార్డ్స్ బద్దలుకొట్టగల స్టామినా ఉన్న ఏకైక చిత్రం పుష్ప. అలాంటి పుష్ప ని ప్రపంచం మొత్తం మరోసారి మెచ్చుకుంటే ఒక్క బాహుబలి ఏం కర్మ వరల్డ్ మొత్తంలోనే “అవతార్”, “అవెంజర్స్” వంటి ఆల్ టైం టాప్ బిగెస్ట్ హిట్స్ సినిమాల సరసన నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే 2పాటలతో తన ఆగమనం ఎంత ఘనంగా ఉండబోతుందో మరోసారి తెలియజేసిన పుష్ప, డిసెంబరు 6 కోసం ఇప్పటినుంచే వరల్డ్ సినిమాస్ కి కౌంట్డౌన్ మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ మాసివ్ లుక్‌తో పుష్పరాజ్‌గా రూల్ చేయడానికి సింహాసనం అధిష్టించిన ఓ పోస్టర్‌ను వదిలారు. ఆ పోస్టర్ చూస్తుంటే సింహాసనం పై కూర్చొని నిజంగానే ప్రపంచాన్నే శాసిస్తున్న ఫీలింగ్ కల్గుతుంది.